| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
140. వదిన
| ఇది వయసు కుదరని సరసము. పిల్లగాడు వదినతో సరసము లాడుతున్నాడు. |
|
ఒడ్డుమీద కూసున్న పిల్లగో నువ్వెవ్వరి కొడుకవో పిల్లగో నేను మేనత్త కొడుకను వదినో నీకు నీటైన చీరెలు దెచ్చేను వదినో చీరెలు బీరెలు అక్కడా నా మనసైన మాట ఇక్కడా నీ దగ్గరికి వత్తిని వదినో నీకు రైకెల్ దెత్తిని వదినో రైకల్ బీకెల్ అక్కడా నా మనసైన మాట ఇక్కడా పొంగుకుంట వత్తిని వదినో నీకు పోగుల్ దెత్తిని వదినో పోగుల్ గీగుల్ అక్కడా నా మనసైన మాట ఇక్కడా |
| వదినకు ఇచ్చకాలు గిట్టవు. మనసైన మాట పలికితే వింటుంది. చీరెలు, రైకలు, పోగులు అల్లంత దూరములో నుండవలసినదే. |