| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
141. గైరమ్మ
| వీడెవరో మరియొక ఆకు జాస్తిగా చదివినవాడు. నక్కజిత్తులు చేస్తున్నాడు. వెర్రికాకి వీని వలలో పడేనా? |
|
గైరమ్మోల్! గైరమ్మా! నిన్నే తల్లి గన్నదే । గైరమ్మా! ॥గై॥ నీ ముక్కెంత చక్కనే । గైరమ్మా! నీ ముక్కులో నత్తెంత అందమే। గైరమ్మా! ॥గై॥ నీ నడుమెంత చక్కనే । గైరమ్మా! నీ నడుము వడ్డాణమెంత అందమే । గైరమ్మా! ॥గై॥ నీ కాలెంత చక్కనే । గైరమ్మా! నీ కాలి అందెలెంత అందమే। గైరమ్మా! ॥గై॥ నీ వొల్లెంత చక్కెనే । గైరమ్మా! నీ వెల్లమీది నగలెంత అందమే । గైరమ్మా! ॥గై॥ నీ కళ్ళెంత చక్కనే । గైరమ్మా! నీ కళ్ళకాటుకెంత అందమే । గైరమ్మా! ॥గై॥ |
| పొగడ్తలు గైరమ్మ కోసమా, నత్తు వడ్డాణాము, అందెలూ నగలూ కోసమా? తెలుసుకోగల అవకాశము మనకు లేదు. |