145. గంగి - గంగారాం
| గంగి ఏదో మిషపై గంగారాం కడకు చేరినది. తాను వదిలి పోయిన వస్తువులట అడుగుతున్నది. ఏవీ ఇవ్వను, నిన్ను పోనివ్వను అంటున్నాడు. అయితే వట్టి మాటలకు మోసపోయేది కాదు గంగి! |
| చిక్కుడు చెట్లల్లో | గంగారాం |
| నా సిగ్గుబోయిందీ | " |
| నా సిగ్గు నాకియ్యి | " |
| నా వోల్లను కల్వబోత | " |
| నీ సిగ్గు నీకియ్యనే | గంగి |
| నీ వోల్లను కల్వబోనియ్యనె | " |
| వంకాయ సెట్లల్లో | గంగారాం |
| నా వంకె పోయిందీ | " |
| నా వంకె నాకియ్యీ | " |
| నా వోల్ల యింటికి పోత | " |
| నీ వంకె నీకియ్యనే | గంగి |
| నీ వోల్ల యింటికి పోనియ్యనే | " |
| బీర సెట్లల్లో | గంగారాం |
| నా చీరె పోయిందీ | " |
| నా చీరె నాకియ్యీ | " |
| నా వోల్లను కొయ్యవోత | " |
| నీ చీరె నీకియ్యనే | గంగి |
| నీ వోల్లను కొయ్యవోనియ్యనే | " |
| బండమీద బండలంటివి | గంగారాం |
| బంగారు తలుపంటివి | " |
| బండ మీద బండ ఏది | " |
| బంగారు తలుపేది | " |
| ఈదుల్ల ఇల్లంటివి | " |
| ఇద్దరికి జోడంటివి | " |
| ఈదుల్ల ఇల్లేది | " |
| ఇద్దరికి జోడేది | " |
| గుట్టమీద గుడిసంటివి | " |
| గురిజాల తలుపంటివి | " |
| గుట్టమీద గుడిసేది | " |
| గురిజాల తలుపేది | " |
| ఇంటనే బాయంటివి | " |
| ఇద్దరికి జోడంటివి | " |
| ఇంటనే బాయేది | " |
| ఇద్దరికి జోడేది | గంగారాం |
| గంగారాం ఆట కట్టుబడినట్లున్నది. తోసి రాజైన ఏమి చేయగలడు? ఎక్కడా మొగమాటము లేదు గంగికి. |
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - gaMgi - gaMgArAM - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )