| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
146. గంగి
| గంగీకి నాపైన మనసొప్పకుంటేను నడబావిలో పడి - చస్తానని చెప్పు గంగితో మాపు - వస్తాననీ చెప్పు గంగితో ॥ చెవులాకు కమ్మాలు, కాళ్ళాకి అందేలు తెస్తానని చెప్పు గంగితో మాపు - వస్తాననీ చెప్పు గంగితో ॥ బాణాల చీరాను, బొమ్మంచు రవికాను తెస్తానని చెప్పు గంగితో మాపు - వస్తాననీ చెప్పు గంగితో ॥ |
| అన్నీ ఆ తుంటరి మాటలే. ఆ గంగి వీనికి లొంగునా? |