| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
155. పెద్దోళ్ళ చిన్నది
| ఈపిల్ల మెల్లగా జిత్తులు నేర్చుకొంటున్నది. వద్దన్నదట! పెద్దిగాడు ఈమెకంటె గడుసువాడు. |
|
పెద్దోళ్ళ పెద్దినొరి పెద్దో నే నొద్దన్నవాళ్ళకెల్లా ముద్దొస్తానే పెద్దాపురం సంతకెళ్ళి పెద్దిగాణ్ణి కలుసుకుంటే రావే చిలకా రావే అంటూ బుగ్గలు రెండు పట్టుకోని బూరి ముక్కలాగు తిన్నాడే ॥ |
| ఇంటికి వచ్చి విజయసూచకముగా అద్దము చూచుకొని ఉంటుంది! |