| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
154. గోంగూరకి
| - దీనికి మాయదారి కుర్రవాడు వల పన్నినాడు. పట్టుబడ్డది. ఈ పాటలోనిది కొట్టుకొనుట మాత్రము కాదు. వంటికీ, మనసుకీ మల్లయుద్ధము. |
|
ఎందుకోననుకొంటి గోంగూరకి - అమ్మ ఎందుకోననుకొంటి గోంగూరకి | |
|
పుట్టెక్కి సూశాడు గోంగూరకి - వాడు చెట్టెక్కి సూశాడు గోంగూరకి | ఎందుకో |
|
చెట్టుదిగి నవ్వాడు గోంగూరకి - వాడు పట్టు పట్టమన్నాడు గోంగూరకి | ఎందుకో |
|
ఎత్తు ఎత్తమన్నాడు గోంగూరకి - వాడు మోపెత్తమన్నాడు గోంగూరకి | ఎందుకో |
|
చేయి పట్టుకొన్నాడు గోంగూరకి - వాడు చెక్కిలిని పుణికేడు గోంగూరకి | ఎందుకో |
|
కళ్లలోకి చూశాడు గోంగూరకి - అమ్మ ఒళ్ళు పులకరించింది గోంగూరకి | ఎందుకో |
| ఈ వరసలో వల్లూరి జగన్నాథరావు గారు ఒకపాట రచించినారు. ఈ చరణములు అందులోనివా అని అనుమానము కలుగుతుంది. కాని మాటలేవిన్నీ తప్పి పడినట్లు లేవు. 'గోంగూరకి' అన్నది పాదాంత పదమే. |