| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
157. గంగమ్మొదినా
| ఇది యెవతెయో కప్ప తలకాయ దీనిది. వళ్ళే మనిషిది. మధువునాని ఎగిరిపోయిన తుమ్మెద కోసము ఎదురు చూస్తున్నది. వాడెవడో బర్సాత్ నాయకుడు. నిరతంబు మల్లిక కడనే యుండి ముదము గూర్పగ నాతని కొక్క పూవేనా? |
|
సెంగావి సీరగట్టి రంగూలా రవికె తొడిగి కొంగూనూ జార యిడిశానే ఓ గంగమ్మొదినా నే ముందరెల్లి వయ్యారి నిలచితినే ఓ గంగమ్మొదినా బంగమయ్యె నా వాలుచూపులే ఓ గంగమ్మొదినా సెవలా తమ్మంట్ల యెరుపూ సేతి మురుగూల పసుపూ సేదేనే మీసాల నలుపూ ఓ గంగమ్మొదినా నా బారమంతా నీకె దక్కేనే ఓ గంగమ్మొదినా కోరపాగా కోరసూసిందే ఓ గంగమ్మొదినా ఉంగ్రాల జుట్టు దువ్వి సెంగల్వ పాగా దిద్దీ అంగాలో ఆగిపోయాడే ఓ గంగమ్మొదినా నా సంగతేదో సూసిపోయేడే ఓ గంగమ్మొదినా పొంగు పొంగు అణిగి పోయిందే ఓ గంగమ్మొదినా పొద్దుకూకే పూల సాయా అద్దరేతిరిది ఆ అరుపు నిద్దరేదే నీలి కళ్ళకు ఓ గంగమ్మొదినా సద్దులేని జాములొకటైనే ఓ గంగమ్మొదినా వారాలు తిరిగిపోయె దూరాలు దూరమాయె ఏరోజా రోజు గడవాదే ఓ గంగమ్మొదినా మా రాజు రాకలేనాడో ఓ గంగమ్మొదినా నా రాతలేమి రాశాడో ఓ గంగమ్మొదినా |