| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
159. కన్నెగోర - చిన్నచిల్క
| సంఘములోనుంచి దాటిపోయి ఏతోటలోనో కొమ్మల మీద ఊగుతూ పాడుకుంటున్నారు ప్రేయసీ ప్రియులు. |
| మొవ్వాకు చీరపెడతా। మొగలిరేకులుపెడతా; నన్నూ పెళ్లాడ్తావా? కన్నెగోరా? | ॥మొ॥ |
| ముద్దూటుంగరముబెట్టి । ముత్యాలపేరుగట్టి నిన్నే పెళ్లాడతాను । చిన్నచిల్కా! | ॥ము॥ |
| ఉల్లీ పిల్లేళ్లుచేస్తా! మొల్లాతలంబ్రాలుపోస్తా నన్నూ పెళ్లాడతావ । కన్నెగోరా! | ॥ఉ॥ |
| పసుపూ పాదాలు కడిగి । పచ్చాటంగీ తొడిగి నిన్నేపెళ్లాడతాను । చిన్నచిల్కా | ॥ప॥ |
| గచ్చాగజ్జియలుపెడతా । పచ్చాకుతాళిగడతా। నన్నూ పెళ్లాడతావా? కన్నెగోరా | ॥గ॥ |
| మణుల దీపాలు తెచ్చి । మంగళహారతులిచ్చి, నిన్నే పెళ్లాడతాను । చిన్ని చిల్కా | ॥మ॥ |
| గోరువంక అనగా ఆడుచిలుక అన్న అర్థము చేసినాడు ప్రాకృత రచయిత. |