| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
166. బంగారు సామి
| అద్దాల మహలులోని ఓరబ్బా, బంగారిసామీ! ఇట్ల రానిపోని మాటలకి వాదాడబోకురో! రబ్బే! బంగరిసామీ! ఊటికాయల కాలమొచ్చెనురో॥ రబ్బే! బంగరిసామీ! ఉబ్బింది - దాని మొగము వుబ్బితే వుబ్బింది గాని సబ్బు యేసి రుద్దరో! రబ్బే! బంగరిసామీ! కలే కాయల కాలమొచ్చె కఱ్ఱె పిల్లకి ప్రాయమొచ్చె సుట్ట గాల్పుకున్నట్టు దాని సుట్టింటి కెడతావు; దాని సుట్టూర దిరుగుతవో! రబ్బే! బంగరిసామీ॥ ఎగవసేలో గెడ్డి గోసి దిగవ సేలో మోపు గట్టి ఇట మోపెత్తి పొమ్మంటే కొంగు లాగి పోతివేమిరో॥ రబ్బే! బంగరిసామీ! గూడలేసే గుంటకాడ కబిల్దోలె బాయికాడ - ఇట్ట వజ్జరాల వాన గురిసె విడవరింక కబిలెవో రబ్బే! రాజా! నా బంగరిసామీ॥ |