| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
167. బైరన్న
| ఇది పక్కా రంకులాడి కథ. కుంటెన మగనికి ఉపాయములు చెప్పుచున్నది. |
|
అప్పనా తనామన మారోరి బైరనా మారోరి బైరన రాగోరె బైరనా | అప్పనా |
|
ఇంటి ముందు యీతపొద ఇంటి యెనక గచ్చ పొద ఒంటిగాను రాబోకు ఒరుల జిక్కి పోదువురా | అప్పనా |
|
సవతితల్లి పెట్టుపోత పగలు రేయి కత్తికోత గుమ్మమైన దాటనీరు గుసగుసలు ఆడనీరు | అప్పనా |
|
రాత్రి రెండు జాములకు రావిచెట్టు కింద నుండు యింట్లోవారు సూడకుండ ఎటులొ నిను కలసెదరా | అప్పనా |
|
వచ్చె బోయె దారిలోను పిచ్చి కుక్కలున్నవిరా మచ్చు జల్లి పోయెదరు మాయలొ పడబోకుమురా | అప్పనా |
|
నీకు నాకు జోడుగాన నిమ్మ పూల తెప్పమీద తేలిపోవ మనసు పుట్టె తెల్లవారు టెప్పుడురా | అప్పనా |
|
ఎప్పుడిల్లు విడిచెదనో ఎపుడు నిను చూచెదనొ చిత్తమూ చెదిరిపోయే కత్తికోత లాగనుండి | అప్పనా |