| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
169. కొయ్యోడు పాట
| పల్లవి: | అయ్యో: కొయ్యోడ! |
| అ. ప.: | ఓరింట్లో తిండికి, లేకపోయింది బైట బడాయి కొట్టకురో రయ్యో కొయ్యోడ ॥ అ॥ |
| 1 చ: | కొయ్యడ కొయ్యడ, బండంటారు వానికి బండికి । బస్తలు లేవంట వాడి కొడుకే । మట్టిబెట్టంట వాడి పెళ్ళం । సూరకత్తంట ఆ గుంటకు నీకు । తగునంట్రో ॥ అ॥ |
| 2 చ: | కలిగిన కంట్లో । కాటుక బెడితే నాకన్ను మెరమెర । లాడెరో రయ్యో కొయ్యోడ దాని మరిగిన మొగుడు । పొరుగున నుంటె మనసు మెరమెర । లాడేరోరయ్యో కొయ్యోడ ॥ |
| 3 చ: | అందము సందము । లేని మొగుండు వాడు సందెడుంటే । ఎందుకో రయ్యో కొయ్యోడ ఎదిగిన పిల్లను । యింట్లో బెట్టి బైట మంచం । యెయ్యకురో రయ్యో కొయ్యోడ ॥ |
| 4 చ: | చిట్టెమ్మ వచ్చిన । ముహూర్తము నుండి దొడ్డెడు గేదలు । చచ్చెనురో ॥ ర॥ దొడ్డెడు గేదలు । చస్తే; చచ్చెనూ |
| ఇది కూడ వెలిచవి మరిగిన వెలది తలపులనే తెచ్చి చూపించు పాట. ప్రాకృతుల జావళీయా అనిపించుచున్నది. 'పోలీసు వెంకటస్వామి' అనే బూతులబుంగ ఒకపాట ఉన్నది. ఈ కోవలో పెక్కులు పాటలున్నవన్నమాట. |