| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
168. కొయ్యోడ
| కొయ్యోడు పాటలు ఉత్తర విశాఖ మండలములో చాల ఉన్నవి. ఇది అసలు పాటయో, అనుకరణమో తెలియరాదు. రచనా సంపూర్ణతను గుర్తిస్తే ఇది నాగరికుల రచన లాగే అగుపడుచున్నది. |
|
చుక్కలకోకా కట్టుకోని చుట్టూ గోడు రైకా తొడిగి బుఱ్ఱ నున్నగ దువ్వూకోని బొట్టూకాటుక పెట్టూకోని నోటికి చుట్టా పెట్టూకోని గోటుగాను నడుచుకుంటూ చక్కదనమే చూసుకుంటూ ఎక్కడి కెల్తవు చిట్టెమ్మంటే పోలేరమ్మ మెరకల మీదికి పుల్లల కెల్తము కొయ్యోడో రయ్యొ కొయ్యోడా॥ కర్ర చేత పట్టుకోని కిర్రూ చెప్పులు తొడుగూకోని పాయల మొల్తాడేసుకోని కాయి పంచలు కట్టుకోని వక్కలాకులు వేసూకోని ఎక్కడికెల్తవు కొయ్యోడంటె పోలేరమ్మ మెరకల మీదికి పొగాకు కెల్తను చిట్టమ్మీ లమ్మీ చిట్టమ్మీ చీటికి మాటికి చిట్టమ్మంటా చీటికి మాటికి చిట్టమ్మంటా చిట్టమ్మున్న నడీధిలోను చినబాబుంతడు పెదబాబుంతడు కరణాలుంటరు కాపూలుంటరు చిట్టమ్మానీ పిలవకురో రయ్యో కొయ్యోడ॥ నే కుందన్నాయుడి కూతుర్నిరో రయ్యో కొయ్యోడ॥ అబ్బో అబ్బో అలాగునైతే కురసా కురసా మొక్కలపీటా కుందన్నాయుడి కూతురివా నే మద్దెప్పయ్య మనవణ్ణే లమ్మీ చిట్టమ్మీ |
| ఇంటికి తగిన యిల్లాలురో ॥రయ్యో కొయ్యోడ॥ ఇది అసలు పాటలోని భాగము వలెనే ఉన్నది. |