| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
175. పడవపాట
| ఇది తనకంటె పిన్నవానితో సరసములు మరిగినది. చనువెక్కువౌట తిట్లు ప్రారంభించినది. |
|
రావూ నే రమ్మంటే । పోవూ నే పొమ్మంటే రవ్వా చేసెదవేమిరా । నీవెంతో రాలూగాయై పోతివిరా॥ మల్లెపందిరికాడ మంచమేసి పరుపేసి తెల్లాదుప్పటి పరచినా - దానిపై మల్లేమొగ్గలు చల్లినా॥ పూలాచీరా గట్టి పూసల రైకా తొడిగి నీలాల కొప్పు పెట్టినా - దానిపై పూలా దండలె చుట్టినా॥ నోట తాంబూలమూసి కాటికా కన్నీరు గార మాటమాని నేనుండినా - దానిపై తోటికోడల్ దొమ్ములాడినా॥ పుట్టింటికి పోదమాని పట్టూ పట్టి నేనిండా పట్టిడీ తాపి పారేసినా - దానిపై పట్టు పట్టి విదిలించినా॥ |