| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
179. ఈశ్వరా జగదీశ్వరా
| ఈశ్వరా పరమేశ్వరా జగదీశ్వరా కరుణింపరా శాశ్వతుడవని వేడితిని విశ్వాసముంచర యీశ్వరా ముందు జేసిన పూర్వకృతములు ఇందుబాపుము యీశ్వరా పొందుగా మీ పాదపద్మము జెందియుంటిని యీశ్వరా కపటవిద్యలు నేర్చి పొట్ట గడుపుచుంటిని యీశ్వరా నెపములెన్నక నన్ను నీ కృపనేలుమీ పరమేశ్వరా ఆరుగురు శత్రువులు నాపై క్రూరమెంచిరి యీశ్వరా పరమమంత్రము చేత శత్రుల నణచవలె పరమేశ్వరా తొమ్మిది ద్వారముల కొంపిది నమ్మనేటికి యీశ్వరా బొమ్మలాట పాలుచేసి బ్రోవకుంటివి యీశ్వరా మూడుగుణములు విడువజాలక మోసపోతిని యీశ్వరా వేడ్కితో నీమాయ దాటనుపాయమేదో యీశ్వరా చంకదుడ్డెమకింకరులకు జంకనేరను యీశ్వరా అంకమందున జేర్చి సద్గురు శంకదీర్చర యీశ్వరా |
| ఇది యెడ్ల రామదాసుది. తరుచు వినబడుతుంది. |