| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
180. బైరాగీ
| చివ్వర ఘటాకాశ ప్రశంస ఉన్నప్పటికీ ఇది నీతీ, శమదమాది గుణసంపత్తీ బోధించే పాటయే. |
| నాద బ్రహ్మానందయోగీ వీడు వేదాంతసారము వినిచే బైరాగీ రాజసంబు దుఃఖదమురా, ఘన రాజయోగ మార్గమే సౌఖ్యదమురా | ॥నాద॥ |
| చిత్తశుద్ధి గల్గియుండు, భక్తి జేరి సద్గురు నీవు సేవించుచుండు | ॥నాద॥ |
| మత్తత్వము లేకయుండు, స మస్త మింద్రజాలమంచూరకుండూ | ॥నాద॥ |
| పెద్దల నిందించవలదూ, ఒరులు పీడించినా నీవు భీతిల్లవలదూ | ॥నాద॥ |
| వనిత లేకున్న దుఃఖమురా, కాని వనిత గల్గెనేని వగవదుఃఖమురా | ॥నాద॥ |
| ధనము లేకున్న దుఃఖమురా, చాల ధనము గల్గెనేని దాచదుఃఖమురా | ॥నాద॥ |
| పచ్చి కుండ వంటిమేను, ఇది చచ్చుగాక ఆత్మ చావదెన్నడును | ॥నాద॥ |
| విచ్చికుండ వ్రక్కలైనా, లోన హెచ్చియున్న బయలు విచ్చి రెండౌన | ॥నాద॥ |