| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
182. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురూ
| విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురూ అన్నదమ్ములంట ఈ భూదేవీ ఆకాశవాణికీ వారె కర్తలంట వారి మహిమతో చేసిరీ ఒక మట్టిబొమ్మనంట ఈ తొమ్మిది కిటుకుల దర్వాజాలూ మాటలాడుకుంట | ॥విష్ణు॥ |
| వస్తా వట్టిదె పోతా వట్టిదె ధర్మము తనవెంట సాంబశివుడు నిను పిలువ నంపి నడు జల్దిగ రమ్మంట | ॥విష్ణు॥ |
| చేతులొ బెల్లం ఉన్నంతసేపే కాకి బలగమంట చేతిలొ బెల్లం సరిపోయినాక ఎవరు రారు వెంట | ॥విష్ణు॥ |
| ఇంటి ముంగిటా పిల్లమేకలు ఇల్లు బలగమంట ఏడ్చేవారు మరి ఆర్చేవారు ఎవరు రారు వెంట | ॥విష్ణు॥ |
| తొలినాడు యములోళ్ళ నైనతను గుంజుకు రమ్మంటా యములోళ్ళంతా చుట్టు నిలిచినరు తాళ్ళూ తెమ్మంటా | ॥విష్ణు॥ |
| చిన్నపెద్దలూ కూర్చున్నారు చింతలు పడుకుంటా నీళ్ళు బోసి కూర్చుండ బెట్టినరు మాయ బొమ్మనంట | ॥విష్ణు॥ |
| పువ్వుల దండలు వేసినరయ్యా మాయ బొమ్మకంట ఎత్తండి ఎత్తండి ఎత్తండోయి మట్టి బొమ్మనంటా దింపుడు కల్వము కాడ దింపినరు మాయబొమ్మనంటా సొమ్ము సమస్తము తీసుకున్నరూ పోతరు వారంతా గురువు పోస్తడూ శంఖు తీర్థమూ ముక్తి ఫలము కంటా మంట్లో మన్ను కలిపినారు ఈ మాయబొమ్మనంటా ధన ధాన్యంబులు ఎవరి పదార్ధము ధర్మమె తన వెంట చేసిన పుణ్యము పాపకర్మములె వచ్చును తన వెంట | ॥విష్ణు॥ |