| కావ్యములు | మను చరిత్రము | ద్వితీయాశ్వాసము |
| తెరువుఁ దెల్పుమని ప్రవరుఁడు వరూధిని నర్థించుట | ||
| ఉ. |
ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ! యొంటిఁ జరించె దోట లే కివ్వనభూమి? భూసురుఁడ, నేఁ బ్రవరాఖ్యుఁడఁ, ద్రోవ తప్పితి\న్ గ్రొవ్వున నిన్నగాగ్రమునకు\న్ జనుదెంచి, పురంబుఁ జేర నిం కెవ్విధిఁ గాంతుఁ? దెల్పఁగదవే! తెరు వెద్ది? శుభంబు నీ కగు\న్. |
39 |
| క. |
అని తనకథ నెఱిఁగించినఁ దన కనుఁగవ మెఱుఁగు లుబ్బఁ, దాటంకములు\న్ జనుఁగవయ నడుమ వడఁకఁగ, వనిత సెలవివాఱ నవ్వి వానికి ననియె\న్. |
40 |