| కావ్యములు | మను చరిత్రము | షష్ఠాశ్వాసము |
| స్వారోచిషుని జననము | ||
| శా. |
కాంచెం బుత్త్రు విశాల నేత్రుఁ బృథుపక్షఃపీఠ విభాజితుం బంచాస్యోద్భట శౌర్యధుర్యు ఘనశుంభద్బాహుఁ దేజోనిధిం బంచాస్త్రప్రతిమాను మానఘను సామ్రాజ్యైకహేతుప్రభూ తాంచల్లక్షణలక్షితు\న్ సుగుణ రత్నానీక రత్నాకరు\న్. |
99 |
| క. |
వేడుక నయ్యవసరమున నాడిరి సురసతులు కిన్నరాంగనలర్థిం బాడిరి గంధర్వులు గొని యాడిరి సురతూర్యనినద మగ్గల మయ్యె\న్. |
100 |
| తే. |
అట్లు జనియించి స్వారోచిషాఖ్య నతఁడు శాంతి దాంతి దయా సత్య శౌచ నిరతుఁ డై యకామతఁ జిరతపం బాచరించె నచ్యుతునిఁగూర్చి యంతఁ గృపార్ద్రుఁ డగుచు. |
101 |