| కావ్యములు | మను చరిత్రము | షష్ఠాశ్వాసము |
| స్వారోచిషుని తపమునకు మెచ్చి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించుట | ||
| సీ. |
నీలమేఘము డాలు డీలుసేయఁగఁ జాలు, మెఱుఁగుఁ జామనచాయ మేనితోడ నరవిందములకచ్చు లడఁగించు జిగిహెచ్చు, నాయతం బగు కన్నుదోయితోడఁ బులుఁగురాయని చట్టుపల వన్నె నొరవెట్టు, హొంబట్టు జిలుఁగు గెంటెంబుతోడ నుదయార్కబింబంబు నొఱపు విడంబంబుఁ, దొరలంగ నాడు కౌస్తుభముతోడ |
|
| తే. |
జయజయ ధ్వని మౌళి నంజలులు సేర్చు-శర్వ శతధృతి శతమన్యు శమన శరధి పాలకైలబిలాదిదేవాళితోడ-నెదుటఁ బ్రత్యక్షమయ్యె లక్ష్మీశ్వరుండు. |
102 |
| క. |
ఈ తెఱఁగునఁ దోఁచిన హరి కాతఁడు సాష్టాంగ మెఱఁగి యంగము పులకా న్వీతంబుగ హర్షాశ్రువు లేతేరఁగఁ జూచి భక్తి నిట్లని పొగడె\న్. |
103 |