| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
భగత్సింగు శాపము |
| భగత్సింగు శాపము |
|
హిమవన్నగమున ఆది శంకరుని హస్త యుగమ్మున చల్లని రాత్రి నల్లని జండా నాలుక జాపింది |
|
వెన్నెల పీలికగాని సన్నని గాలులుగాని లేనే లేవు |
|
చీకటి కదన కుతూహల రాగం చిందులు ద్రొక్కి చుక్కల చూపులుకూడ సురిగిన మొండి రాత్రి అది |
|
క్రతువంటూ పశువంటూ నిను బలియిచ్చిన ఋషులంతా పటాపంచలైనారు నీ గళమ్మున నిరాకరణ సూత్రం వైచి నిలువున ఉరితీశారా నా తండ్రీ! |
|
నాటికి నేటికి భారత భూమి పాడి యావునకు కళ్ళల్లో కాటుకపొగలు బుఱ్ఱను భూకంపం గుండెల్లో కుతకుత ఉడికే లావా! |