| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
భావం! |
| భావం! (భారతి - నవంబరు 1941) |
| వేడిగ గీతం |
|
నివురు గప్పిన నిప్పు హృదయం కుదిపిన కుంపటి జీవితం హేమంత నిశ మంచు దెబ్బ సహించుకోలేక పుడమి అంచులు వెలసిన నిశా నీల దుప్పటి కప్పుకొని మూడంకె వేసి నిద్రిస్తే పుండుమీద చేయిలా, బాధాకరంగా గాలి! |
|
చల్లగాలిలో సన్నసన్నగా తారి చుక్కలె భయపడ నా చర్మం గోడ గెంతి నా రక్త స్రవంతి నీది హృదయ హజారానికే ఎగబ్రాకి పట్టుజారి క్రిందపడి శబ్దిస్తే నా ఇనుప గీతాల సంకెళ్ళ ని న్నిరికించి బాధిస్తే నీకు పకపకా నవ్వా! దొంగా!!! |