| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
చల్లని గీతి |
| చల్లని గీతి (భారతి - సెప్టెంబరు 1940) |
|
ఇసుక ఎడారుల పసిరిక నేలై కుసుమించిన దీ బ్రతుకు! |
|
కర్షక హర్షోదయ వర్షాగమ వేలావేళల తూనీగ ఎడద ఎగిరె హాయిగాను! |
|
గ్రీష్మపు టెండల మండిన భూముల తొలకరి వేళల మాతృమృత్తికా మధుర వాసనలు సుధాగళమ్మున! |
|
ఉన్మిషతమ్ములు జీవితాధ్వములు శరన్మేఘములు పరుగులెత్తినవి విద్యున్మాలలు వెంట తరిమినవి. |
|
తల్లిచేతి చల్లందనము పిల్లల మాటల తీపి కొల్లగొన్నదేమో బ్రతుకు! |
|
మాతృవక్షమున పాలపోటుతో తల్లికడుపులో పిల్లడు కదిలాడు? చల్లని గీతి రేకెత్తినది. |
(సెప్టెంబరు 1940 భారతిలో ఇది 'ఒకక్షణం' అనే పేరుతో అచ్చుపడింది.)