| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
జ్వలనా! |
| జ్వలనా! |
|
జ్వలనా! జ్వలనా వేదనరగిల్చి విశ్వం పగిల్చి వెలిగింపుము మా వేడినెత్తురుల; |
|
రాగం లేనీ భోగవస్తువట గుడ్లను పొదిగే పిల్లల కోడట మాటతప్పని మగువ బానిసట అమాయకాత్మల, బాలల అబలలటంచూ బేలలటంచూ మొగుడే ప్రాపంటూ సిగ్గు వీడని చిరుత ప్రాయమున మొగ్గ తొడగని మొలక వయసులో పాలేలేని చూలాలినిగా చేసి కుందనమే పూసి వధచేసి వంటిని పసుపుతీసి ముఖాన్ని పూసి ఒళ్ళు తెలియక పళ్ళు కొరుకుతూ నృత్యం చేసే రాక్షసి సంఘపు కీలాలమ్మే తైలమ్ముగ జీవనమె వత్తిగ రుధిరజ్యోతి వెలిగింపుమురా విప్లవగీతిని వినిపింపుమురా జ్వలనా! జ్వలనా! |