| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
పండుగనాడు |
| పండుగనాడు (సంక్రాంతి) (ప్రతిభ - అక్టోబరు 1938) |
|
పాడాలట! పాడాలట! |
|
చలిచే ఆ కలిచే విలపించే ముష్టివాని రెక్కలమీదికి సం తుష్టికొరకు చింకిగుడ్డ జీవన హేమంతపు చలిక్రాగగ కప్పుటకు ఒక గీతం కావాలట! కావాలట! |
|
ఆముదపు ప్రమిదలలో వెలిగే దీపాలు హృదయంలో భావాలు పండుగట! పండుగట! |
|
కాలిన ప్రేయసి దేహం చమురు కంపు ఈలోకం పాడాలట! పాడాలట! |
|
శరీరమే రామభజన సెమ్మా గీతాలే భక్తులు తిరువీధుల తిండికొరకు తిరిగి తిరిగి అలసినారు |
|
పండుగట! డబ్బులు మెండుగ దొరకునట! |
|
గళమే నాదస్వరముగ కాలమె ముందంజవైచి గంగిరెద్దు బ్రతుకు నాది ముక్కున విధి త్రాడై వేలాడగ పట్టిపట్టి లాగుతుంది పాడాలట! పాడాలట! |