| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
కిటికీలో దీపం |
| కిటికీలో దీపం (ప్రతిభ - జనవరి/ఏప్రిల్ 1939) |
|
జితేంద్రియుని బుద్ధిలాగు జేగంటలాగు కిటికీలో దీపం! |
|
గోడివతల గదిలోపల పేరుకున్న కాంతి గోడవతల చీకటి! |
|
హృదయంలో ఒకటి రెండు వెలుతురు గాయాలు. |
|
స్వర్గం నరకం చావు బ్రతుకు గొప్ప బీద వ్యత్యాసం తెలివితక్కువ చదువెక్కువ తారతమ్యం |
|
జీవహింస చేయనని చూడనని నా శపధం! |
|
గోడమీద గదిలోపల వెలుతురు కాసించి చేరిన జీవుల ఆకలితో భక్షించే బల్లి! |
|
పక్కలో పాలుత్రాగు పసిపిల్లడు ఉక్కిరి బిక్కిరి యైనట్టు గొప్పగాలి రేగింది |
|
గోడవతల చీకటి నవ్వింది |
|
కిటికీలో దీపం కంపించి ఊపెత్తిన వెర్రిపీరులా ఊగి ఊగి సాగి సాగి తెగిపోయిన రబ్బరుముక్కై తెగటారెను! |
|
ఇప్పుడో కిటికీలో గోడివతల గదిలోపల ఒకటే చీకటి! జీవరహస్యం!!! |