| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
సామిధేని |
| సామిధేని |
|
రక్త పతాకం, శక్తి నాలుక, అగ్ని కిరీటం, ఆకాశమ్మున ముని మాపు కేకలు వేస్తూ పిలిచింది. |
|
కాలం నాగు విను వీధులలో వెన్నెల పడగ విప్పింది. |
|
శారద రాత్రి శంకరు ఫాలం బూది పవిత్రత బూరా వూదింది. |
|
హంతకు చేతిని కత్తులు వింత హృదయమున భావాలు |
|
శిరసున రతనము గళమున విషమ్ము కలమ్ము కొసలో కాటుక మబ్బులు కాగితమె కంపించింది |
|
పాటే గ్రహపాటాళి సూరన అడిదాన్ని తిక్కన ఖడ్గాన్ని పేలిన బిజాపూరు ఫిరంగి గుండు నా గుండె. |