| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
కవీ! |
| కవీ! |
|
మృత్యువొసంగే మాతృ కరమ్ముల విధవ కానుపు పెదిమల వెలుగై వెలిగి నలుపెక్కిందీ సంధ్య |
|
ఖేదం రేపీ రోదసి నిండి విశ్వ గళమ్మున హాలాహలమై విస్తరిల్లినవి చీకటులు! |
|
నల్లని త్రాచు కోరలు తెల్లని మశూచి కుండలు గగనమ్మున తారలు! * * * * జట్కా గుఱ్ఱం కాలం మెళ్ళో గంటలు రెండు మ్రోగినవి |
|
చచ్చిన తల్లి శవం మెళ్ళో గజ్జెల పట్టెడతో ఉల్లాసంగా ఆడుకునే పసి పిల్లడులా గాలి! |
|
ఒళ్ళు తెలియని పుళ్ళ బాధతో వెక్కి వెక్కి ఏడ్చినది చుక్కల ఆకాశం! |
|
సద్యో ఫలితం విద్యు ద్దీపం వెలుగున గదిలో |
|
ఖ్యాతి గడించే గీతం వ్రాసి ప్రేయసి కంకిత మీయాలంటూ మూతి బిగించి చేతులు నులుముతు కూచున్నావ!!! |