శతకములు గువ్వలచెన్న శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
క. తడబ్డ భీతహృతయముల బెడబెడయగుఁ బట్టుబట్టవిడఁ గట్టు నెడన్‌
బడబడ బాదుటయందును గుడగుడయన్నముడుకందు గువ్వలచెన్నా!
51
క. పాగా లంగరకాలును మీఁగాళ్లనలారఁబంచె మేలిమికట్టుల్‌
సాగించుకండువాల్పయి కోఁగాయిఁకఁగానమెన్న గువ్వలచెన్నా!
52
క. వెలయాండ్రవీథులంజనఁ దలఁపు లవారిఁగ జనించి తమమిత్రులతోఁ
గలిసి షికారునెపంబునఁ గులుకుచుఁ బోవుదురుముందు గువ్వలచెన్నా!
53
క. ఎన్నఁగలజీవరాసుల యన్నిఁటిగర్భమునఁబుట్టి యటమనుజుండై
తన్నెఱిఁగి బ్రతుకవలెరా కొన్నాళ్ళకు నెచటనున్న గువ్వలచెన్నా!
54
క. కామినులకు సంతుష్టియుఁ గాముకులకు వావివరుస కఠినాత్మునకున్‌
సామోక్తులు విశ్వాసము కోమటులకుఁ దలఁప సున్న గువ్వలచెన్నా!
55
క. లొడలొడయగు వదులందును బుడబుడనీళ్లందుబుట్టి మునుఁగుటయందు\న్‌
గడగడ చెవిబాధయెడన్‌ గొడగొడ లప్రస్తుతోక్తి గువ్వలచెన్నా!
56
క. సంకటములచే మెయిగల పొంకంబెల్లను నడింగి పొలుపరినడువన్‌
జంకుంగలిగియు మెల్లన కొంకకముండింటికేగు గువ్వలచెన్నా!
57
క. ధనమైనంతట భూముల తనఖాలును విక్రయములు తరువాతసతీ
మణిభూషణాంబరంబులు గొనుటయు విటలక్షణములు గువ్వలచెన్నా!
58
క. నిత్యానిత్యము లెఱుఁగుచు సత్యంబగుదానిఁ దెలిసి సత్కృత్యములన్‌
నిత్యముజేయుచు దశదిక్స్తుత్యముగా మెలఁగుమన్న గువ్వలచెన్నా!
59
క. ధనమే మైత్రినిఁదెచ్చును ధనమేవైరమునుదెచ్చు ధనమేసభలన్‌
ఘనతనుదెచ్చును నెంతటి గొనముల కుప్పలకునైన గువ్వలచెన్నా!
60
AndhraBharati AMdhra bhArati - shatakamulu - guvvalachenna shatakamu ( telugu andhra )