| శతకములు | గువ్వలచెన్న శతకము |
|
| క. |
తబ్బిబ్బుగాఁడు క్షుద్రుఁడు సబ్బండుగ నిష్ఠబున్న సబ్బునఁగడుగం బొబ్బలిడ నల్లశ్వానము గొబ్బున తెల్లనిది యగునె? గువ్వలచెన్నా! |
91 |
| క. |
జారిణి తనవగుపనులె వ్వారలుఁ జూడరనుబుద్ధి వర్తించు నిలన్ క్షీరముఁ ద్రాగుబిడాలము కోరిక లోఁ దలఁచునట్లు గువ్వలచెన్నా! |
92 |
| క. |
వాకొనెద గూనమునుగల చాకలియధికారియైన జనములసుఖముల్ చేకొనిన కొఱవిచేఁ దలఁ గోకికొనినయట్టులుండు గువ్వలచెన్నా! |
93 |
| క. |
పక్కలనిడి ముద్దాడుచుఁ జక్కఁగఁ గడుగుచును దినముసబ్బుజలముచే నక్కఱదని యస్పృశ్యపుఁ గుక్కలఁ బెంచుదురు ద్విజులు గువ్వలచెన్నా! |
94 |
| క. |
కాంచనచేలుని విడిచి ప్రపంచమున న్నీచులిండ్ల పాలయ్యుఁగడన్ జంచలయగు సిరిపోకకుఁ గుంచితమతి యగుట తగదు గువ్వలచెన్నా! |
95 |
| క. |
చింతలఁ జువుకుచు నున్నను స్వాంతము నెపుడైనహరునియందుంచఁదగున్ అంతట నాఁచున్నసరసి గొంతట రేవైనభంగి గువ్వలచెన్నా! |
96 |
| క. |
వెలయాండ్రవలెను బనిపాటలువిడి సంగీతమును నటన మభినయమున్ గులవిద్యలుగాఁ గైకొని కులసతులు చరింత్రు ముందు గువ్వలచెన్నా! |
97 |
| క. |
లోభికివ్యయంబు సోమరి యౌభామకుఁ బనియు నిర్ధనాత్మునకునప త్యాభిప్రవృద్ధియును బహు గోభర్తకు నఘము లురువు గువ్వలచెన్నా! |
98 |
| క. |
సరియైనవారితోడను నరుగఁగవలె నొక్కపనికి నటుకాకున్నన్ విరసఁపుబల్కులు పల్కుచు గురివిడి పొమ్మనఁగఁగలరు గువ్వలచెన్నా! |
99 |
| క. |
తన్నుమునుపు చదివించిన మన్నీని విలేఖనమున మాన్యజనునకున్ సున్నిడి యరిచే విత్తముఁ గొన్న వకీల్చల్లవాఁడు గువ్వలచెన్నా! |
100 |