| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
003. ఊడుపు
| పొలము దుక్కి పూర్తి అయి నీటితోనిండి మొక్కల్ని కోరుతుంది. రంగురంగుల చీరలు కట్టి వరుసతీర్చి మాలెతలు వంగి నాట్లు నాటుతారు. నాటుతూ సరదా కోసము పాటలు పాడతారు. దేనిని గురించి? ఊడుపు గురించే! |
|
ఊడుపుడవం డమ్మలాలా మీ రుడవండీ దమ్మూ సేసిన సేలల్లో ఊసులాడుకోని ఊరుకోబోకండి ఇడదీసి వరిమొక్క లెడమెడముగ పాతండీ | ॥ ఊడు ॥ |
|
బాడనక బందనక పాటుపడినామంటే మారాజు పని సూసి మన కీనామిస్తాడు | ॥ ఊడు ॥ |
|
ఆ ఊరి మారాజు ఐదణాలిస్తేను ఈ ఊరి మారాజు ముప్పావలిస్తాడు | ॥ ఊడు ॥ |
| పాపము రెక్కాడిన గాని డొక్కాడని ప్రాణులు. ఊరినుంచి ఊరికి నడచి సాగిపోతూ ఏవూరి మహరాజైనా పని చెప్తాడా అని చూస్తుంటారు. వారి పని చూసి ఇనాము లిచ్చే మహరాజులెందరో! |