| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
065. అత్తింటికి
| మా బావ వచ్చాడు ఓయి సెల్లూలా నేనెల్లి వత్తాను ఓయి సెల్లూలా కొత్త సీరాలెన్ని ఓయి సెల్లూలా కొబ్బెరా బెల్లాము ఓయి సెల్లూలా సీటి గుడ్డాలెన్ని ఓయి సెల్లూలా సిల్కు సీరాలెన్ని ఓయి సెల్లూలా పైట పావడాలు ఓయి సెల్లూలా పట్టాడాలెన్నో ఓయి సెల్లూలా మా బావ వచ్చాడు ఓయి సెల్లూలా నేనెల్లి వత్తాను ఓయి సెల్లూలా నన్ను మరువాకండి ఓయి సెల్లూలా నా మాట మరువాకు ఓయి సెల్లూలా అమ్మ మాటయీను ఓయి సెల్లూలా అన్నాకి తమ్ముడీకి ఓయి సెల్లూలా అమర్చి పెట్టావె ఓయి సెల్లూలా ఇరుగు పొరుగోరీతో ఓయి సెల్లూలా ఇష్టంబుగా ఉండు ఓయి సెల్లూలా పొద్దు ఎక్కక ముందు ఓయి సెల్లూలా పక్కా నుంచి లెగిసి ఓయి సెల్లూలా పెతి రోజు గుడికిన్ని ఓయి సెల్లూలా పదిలంగ ఎల్లిరావె ఓయి సెల్లూలా పళ్ళు పువ్వూలున్ను ఓయి సెల్లూలా పట్టూ కెళ్ళవోలె ఓయి సెల్లూలా ఓయి మా బావ వచ్చాడు ఓయి సెల్లూలా నేనెల్లి ఒత్తాను ఓయి సెల్లూలా |
| ఈ పాట వింటే, కుమార్తె తరలి పోయిన తర్వాత |
| "ఏరెంత వెళుపమ్మ ఇసుక సన్నమ్ము ఏరుదాటి వెళ్ళింది ఎవరాడపడుచు మూటనున్నది పసుపు పొట్లాన కుంకం వడి నిండ పోకల్లు పండుటాకుల్లు భమిడి శ్రీ పిల్లమ్మ సారె వెళ్ళింది" |
| అన్న పాట గుర్తుకు వస్తున్నది. |