| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
066. మేలుకొలుపు
| ఇది అత్తింటి ముద్దుకోడలికి మేలుకొలుపు. "లేవే సీతమ్మా మాయమ్మా ముద్దులగుమ్మా లేవే బంగరు బొమ్మా లేవే అది యేమే మాయమ్మ అదుపు లేదా నీకు అత్తవారిల్లిది లేవే" అన్న మేలుకొలుపు గుర్తుకు వస్తుంది ఇది వింటే. |
|
జాజిపూల జలకమాడి పాలవెల్లి పాలకెక్కి అత్తయింట నడుగుపెట్టి మొగుడురాగ మొగముదాచి ఎందుకింత సిగ్గుపడుదు వేలనీకు ఇంత సిగ్గు? తాడి చెట్టు తలను దన్ని తాత నీడ తరిగిపోయె నిదురలెమ్ము నిమ్మకాయ కళ్లు విప్పు కందపిలక త్వరగ లెమ్ము తల్లిగాదె చిలుక వచ్చి చెట్టు మీద పిలుచుచుండె పిల్ల నిన్ను వేగలెమ్ము వెన్న ఇదిగొ కిత కిత కిత కిత కిత కిత |