| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
067. వదినె పాట
| మన వారి హాస్యాలు సున్నితంగా నుండక మోటుగా నుంటవి. గురజాడ వారు పలికే వరకూ తెలుగువారు హాయిగా చక్కగా నవ్వటమే నేర్చుకోలేదు. మోటుహాస్యపు పాటలలో ఒకటి. |
|
వదినెకు వగదర బిందెకు బిగదర బంగారు కుచ్చుల మా వదినే గోడపొంటి రెండు నల్లులు పారుతె ఉలవలంటదీ మావదినే బుక్కుతనంటది మావదినే నరాలపొంటి తేళ్ళు పారుతె సేవాలంటది మావదినే తింటనంటది మావదినే దూలాలపొంటి పాములు పారుతె కడియాలంటది మావదినే పెట్టుకుంటనంటది మావదినే శెక్కెరబుక్కి దొడ్లవంటే చీమలు కుట్టిన మావదినే అన్నం తినక అర్రలవంటే అన్నయ్య కొట్టిందా వదినే |