| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
076. రాజసపు కోడలు
| రాజసపు కోడలు వాలకము పరికించండి. |
|
ఇల్లలికి ముగ్గుపెట్టి రింటి మగవారు పేడకళ్ళు దీయు పెదబావగారు ఇంటి పనులు చేయు ఇంకో బావయ్య అంటులన్నియు దోము అత్తయ్యగారు ఇంటిపనులు నయ్యె విడిదిలేవమ్మ; దుబ్బుపుల్ల ఏది పంచటరుగేది? చిట్టిముంత నీళ్ళేవి చిరు పసుపేది? కుంకపు బరిణేది అద్దము ఏది? చూడరా ఆడదాని సురటి మాటలు చూడరా ఒకదెబ్బ చూడరా ఇకను; ఎక్కరా చింతచెట్టు విరవరా జూక వెయ్యరా ఆ జూక వెన్ను పొడుగునను; ఆరునెలల బాల చంక బెట్టుకుని పుట్టింటికప్పుడు మరి దౌడుతీసె అల్లంత దూరాన అన్నలు చూసి "ఏమమ్మ చెల్లెలా! ఇట్లు వచ్చేవు?" "కానక కాండ్రేగు పళ్ళు నేగోర నేరక నేరేడు పళ్ళు నేగోర కారుడ్డములు పలికె కాంతుడు మావారు నేరాలు మోపేరు వారందురును" కుదించి కుదించి గోడు చెందంగ ఓదార్చి తమ యింట నుండమన్నారు |
| వ్యాఖ్యాన మనవసరము. సురటి అన్నది దేశిపదము. సురటి మిద్దెలు, సీతమ్మ సురటి అనే పదములు దేశిలో కనబడుతవి. "అన్నెకారి" అన్నది ఇంకొకటి. |