| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
077. వేరే పోదామా
| అవిభక్త కుటుంబపు నీడలోనే వేరింటి కాపురము గూడు కట్టును. ప్రౌఢ తన భర్త నడుగుచున్నది. |
|
సందమామ కన్న సక్కాని మొగుడా వేరే పోదామా? అత్తమామల పోరు నేను పడలేను ఆడబిడ్డల పోరు నేను పడలేను | ॥ సం ॥ |
|
ఉంగరాల చేయి ఊగెరా మొగుడా కందిరీగా నడుము కదిలేర మొగుడా వేరే పోదామా? | ॥ సం ॥ |
|
కొండంత కొప్పేమొ కదిలేర మొగుడా కొప్పుపై జాజులు వాడెరా మొగుడా వేరే పోదామా? | ॥ సం ॥ |
| లక్కరాజు గంగయదాసు పాట ఒకటి ఇటువంటిదే కాని ఇంతకన్న పెద్దది ఉన్నది. |