| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
078. ఏరాలు
| వేరే పోవగనే సరికాదు. అక్కడనూ సమస్యలు కలవు. ఆ 'దుంగ' కంటె ఈ 'కొంగ' తోనే ఎక్కువ బాధ! |
| పు:- | ఏరాల్ని తెస్తాను । ఇంటిలో పెడతాను ఏరాలి మాట వినాలి । సుందరి పిల్ల ఏరాలి మాట వినాలి । నాయుడోలమ్మీ | ॥ ఏ ॥ |
| స్త్రీ:- | ఏకులొడుకుతాను । యేరొండి పెడతాను యేరాలి పోరు పడలేను । సుందర మగడ యేరాలి పోరు పడలేను । సోకుదారి మగడ | ॥ ఏ ॥ |
| పు:- | వండిపెట్టలేవా । వడ్డించలేవా కోనేటి నీళ్ళు తేలేవా । సుందరి పిల్ల నామాట వినాలే । నాయుడోలమ్మీ | ॥ ఏ ॥ |
| స్త్రీ:- | కూకుంటె లెగలేను । కూడొండి పెట్టలేను కోనేటి నీళ్ళ కెళ్ళాలేను । సుందర మగడ కానిమాట లనబోకు । సోకుదారి మగడ | ॥ ఏ ॥ |
| పు:- | బంగారపు బొమ్మ । బెంగుళూరు గుంట దాని నడుము నాగబంధములే । సుందరి పిల్ల దాని నడక హంస నడకలే । నాయుడోలమ్మీ | ॥ ఏ ॥ |
| స్త్రీ:- | దాని మాయలోను పడబోకు ! నాయుడుబావ దాని సోకులోను దిగబోకు ! సుందర మగడ దాని మాటలైన వినబోకు ! సోకుదారి మగడ | ॥ ఏ ॥ |
| పు:- | వడ్డాణ మిదిగోయె । వయ్యారి భామా నీనడుముకైన పెట్టుకోయె । సుందరి పిల్ల నీ నడుము చక్కగుంటుందె । నాయుడోలమ్మీ | ॥ ఏ ॥ |
| స్త్రీ:- | ఎప్పుడెట్టుకోవాలో । అప్పుడెట్టు కోవాలి పండుగ పున్నానికి । సోకుదారి మగడ అది అప్పుడెట్టు కోవాలి । నాయుడు బావ | |
| తడికె పాట లోని చిన్న అలక వలె పెద్ద అలకలు కూడ నగతో పటాపంచలు! |