079. సిరి సిరి మువ్వ పాట
| అయితే నగలతో సంతుష్టి చేకూర గలదా? ఎన్నాళ్ళు సవతి బాధ భరించగలదు మగనాలు? |
| ఈ ముండ కాపురము | ॥సిరి సిరి మువ్వ ॥ |
| నాకే ముండ తెచ్చింది | ॥ సి ॥ |
| అన్నపూర్ణ కాపురము | ॥ సి ॥ |
| కన్నవారి యిల్లు కాదా | ॥ సి ॥ |
| రంగమ్మ కాపురము | ॥ సి ॥ |
| రత్నాల మూట కాదా | ॥ సి ॥ |
| ప్రక్క పాపిడేలనని | ॥ సి ॥ |
| ప్రక్కలిరగ తన్నేడే | ॥ సి ॥ |
| జాకెట్టు తొడిగితే | ॥ సి ॥ |
| షోకేల నని తన్నేడే | ॥ సి ॥ |
| పాకిదాని లాగుంటేని | ॥ సి ॥ |
| పకపక వాడు నవ్వేడే | ॥ సి ॥ |
| "కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!" |
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - siri siri muvva pATa - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )