| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
151. వలపుకాని చావు విని -
| ఈ చిన్నది కూడ వలపు ఒకచోట, వళ్ళు వేరొక చోట ఉన్న దురదృష్టవంతురాలే. పాపము ఈమె తన వలపుకాడు మరణించిన వార్త విన్నది. ఎట్లేడ్వగలదు? ఆనాడే అత్తింట ఒక దూడ కూడ చచ్చిపోయినది. ఆ దుఃఖమును దూడ పేరిట వెళ్ళగ్రక్కుకొని గుండె బరువు దింపుకొను చున్నది. |
|
దూడమ్మ దూడా దూడా దూడంటె దుఃఖమొచ్చె వాడంతా వాడిపోయే కూడైన తినిపోయె దూడమ్మ బూరెలు వండినాను బుట్టలో పెట్టినాను బూరైన తినిపోయె దూడమ్మ దూడా దూడా గారేలు వండినాను గంపాలో పెట్టినాను గారైన తినిపోయె దూడమ్మ దూడా దూడా గుగ్గిళ్ళు వండినాను గుడిసెల్లో పెట్టినాను గుగ్గిళ్ళు తినిపోయె దూడమ్మ దూడా దూడా మంచినీళ్ళ బావి కాడ మంచి మంచి గంతులేసి మంద మోర మలగూకోయె దూడమ్మ దూడా దూడా వరిచేలలోకి పోయి వచ్చిపోయె వారిమీద వన్నె చూపులైన చూడు దూడమ్మ దూడా దూడా ఎన్నెన్నొ దూడలున్నాయి ఎన్నెన్నొ వాడలున్నాయి నావాడా దూడా నీవే దూడమ్మ దూడా దూడా |
| ఇంకొకతెకు పరిస్థితులింత పదునుగా లేవు. గుండెలు బాదుకుని ఏడుస్తున్నది; |
| గుండేలు గాడి తమ్ముడంట మందపాటి కోటడంట మారెళ్ళ సుబ్బడంట మందుపెట్టి సంపెరోరబ్బో గుండేలుగా అరబ్బో అరబ్బో అరబ్బో గుండేలుగా ॥ |