| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
152. దొరగారు
| ఈపాట నుండి దృశ్యము మారి రావలసి వచ్చినది. ఇక కేవలము, వయసూ వలపూ మాత్రమే పాటలకు వాహనములు. సంఘనియమములు తెగువ లేని వారికి, వీరంతా తోకచుక్కలు. ఈ పిల్లను చూడండి, ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నది. |
|
అద్దసేరు బుక్కా కొనీ వంగి కీసల బోసుకోని ఎగిరి ఎగిరి సల్లాబోతడే నా దొరగారు ఎవరి మీద సల్లాబోతడే నా దొరగారు | ॥ఎ॥ |
|
పావుసేరు బుక్కా కొనీ వంగి కీసల బోసుకోని పైకి పైకి సల్లాబోతడే నా దొరగారు ఎవరి మీద సల్లాబోతడే నా దొరగారు | ॥ఎ॥ |
|
దొరసాని మీద సల్లాబోతడే నాదొరగారు దొరసాని మీద సల్లాబోతడే | ॥ఎ॥ |