| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
153. పిలుపు
| - ఈ పిల్లకు తన సంగతి అర్థమైనది. విహారమునకు పోదము రమ్మంటున్నది అక్కను. ఏ మధురానుభూతియో కాలికి తగులక పోవునా? |
|
రాయెమ్మె రాజక్క సాలోడు నేసిన మెరపుటద్దాల రైకె తొడిగన్న సూత్తము | ॥రా॥ |
|
అవుసులోడు చేసిన అందమైన కమ్మలు పెట్టన్న సూత్తము | ॥రా॥ |
|
కుమ్మరోడు వానిన గట్టి ఎసలలు వాడన్న సూత్తము | ॥రా॥ |
|
పోశమ్మ సందులోన పొంగుతున్నది లొట్టి తాగన్న సూత్తము | ॥రా॥ |
|
పటేలు దొడ్డిలోన గడ్డాము వున్నాది పోయన్న సూత్తము | ॥రా॥ |