| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
ఏమంది? |
| ఏమంది? (భారతి - డిసెంబరు 1942) |
| ఏమంది? |
|
కొమ్మలు తలలూపగ కమ్మని కోకిల కూజితాలకు వెన్నెల విహారములకు కన్నె గాలి కౌగిళ్ళకు ఆశించి ఆర్ద్రమ్మై ఆనందాశ్రులు నించే ఎడద అరుణరాగ ఆలాపన కిది కాలం కాదంది! |
| ఏమంది? |
|
పాతాళమ్మున పతితులు పలవించే మాటల జిలిబిలి తేటల చీకటిగుండె కదిల్చే జాలిపాట పాడమంది! లోపలికే చూడమంది! |
| ఏమంది? |
|
ముష్కరు లెవరో తస్కరించిరి ముండ్ల గులాబీ పూలనన్నిటిని; మాయం చేసిన వారిని గాయం చేసే రక్త సిక్త - గీతా లేతామే తోడమంది! గాలి చెవుల పోయమంది! |
| ఏమంది? |
|
విష భుజంగ మట జీవితము జన్మ వాసనలు మరపించి నైజమ్మే విస్మరింప నాగస్వర మూద మంది! త్యాగము చూపించ మంది!! |
| ఏమంది? |
|
శంఖ గళమ్మున దిగిపోయిన తెగిపోయిన మంగళసూత్రమ్మట తాను దాని పైన జాలువారు కాటుక కన్నీటిని నే నట! కలకాలం నిలచిపోయి విలయ వేళ కూడ మరువ గగనమ్మును భూమి భూమిని గగనమ్ము ఒకటే గాఢ పరీరంభమ్మున కలుసుకోక పోరంది! కాలం వియోగ కాలమ్మైనది మన కొకనాడు; వెల వెల బోవక పోదానాడు ఘర్మ బిందువులమై మనము కలసి తిరుగుదా మంది పెనచుకు పోదా మంది తరచి చూచుకొమ్మంది! |
| ఏమంది?? |