| గంగకు - దొంగకు - పంగకు తప్పులేదు
|
| గంగలో మునిగినా కాకి హంస కాదు
|
| గంగిగోవుపాలు గరిటెడైనా చాలు
|
| గంజాయి తోటలో తులసి మొక్క
|
| గంజి త్రాగేవాడికి మీసాలెత్తే వాడొకడు
|
| గంజిలోకి ఉప్పేలేకుంటే పాలలోకి పంచదారట
|
| గండం గడిచి పిండం బయటపడ్డట్లు
|
| గంతకు తగిన బొంత
|
| గంపలాభం చిల్లు తీసినట్లు
|
| గజమూ మిధ్య - పలాయనమూ మిధ్య అన్నట్లు
|
| గజ్జి ఉన్నవాడికి లజ్జ వుండదు
|
| గట్టిగా ఆయుష్యముంటే గరిక నూరిపోసినా బ్రతుకుతాడు
|
| గట్టిగా తిడితే గాలిలో కలిసిపోతుంది - తనలో తిట్టుకుంటే తనకు తగుల్తుంది
|
| గట్టుమీద వానికి గప్పాలెక్కువ
|
| గడ ఎక్కు తిమ్మన్నా - గంతులు వేయి తిమ్మన్నా అన్నట్లు
|
| గడించేది ఒకడు - అనుభవించేది మరొకడు
|
| గడించే వాడొకడు - గుణించే వాడొకడు
|
| గడిచి బ్రతికినామని గంతులు వేయరాదు
|
| గడ్డివాము దగ్గర కుక్కలాగా
|
| గడ్డంకాలి ఏడుస్తుంటే చుట్టకు నిప్పడిగినట్లు
|
| గడ్డ గడ్డకు గ్రుక్కెడు నీళ్ళు త్రాగినా రెడ్డే వ్యవసాయం చేయాలి
|
| గడ్డ పలుగులు గాలికి కొట్టుకుపోతూంటే పుల్లాకు నా గతేంటి అన్నదట
|
| గడియ పురసత్తు లేదు - గవ్వ ఆదాయం లేదు
|
| గడ్డివామిలో సూది వెదికినట్లు
|
| గతజల సేతు బంధనము
|
| గతి చెడినా మతి చెడరాదు
|
| గతిమాలిన వాడికి కుతిక లావు
|
| గతిలేనమ్మకు గంజే పానకం
|
| గద్దించే అత్త - మర్దించే మామ
|
| గబ్బిలంలాగా అటు పక్షీ కాదు - ఇటు జంతువూ కాదు
|
| గబ్బిలాయి ముఖంలాగా
|
| గయ్యాళి, గచ్చపొద ఒకటే
|
| గరిక మేసిన గాడిద చస్తుందిగానీ, గరిక చావదు
|
| గురుడాయ లెస్సా అంటే శేషాయ లెస్సా అన్నట్లు
|
| గరుత్మంతుణ్ణి చూచిన పాములాగా
|
| గర్భాదానం నాటి ముచ్చట్లు లంఖణాలలో తలచుకొన్నట్లు
|
| గర్భాదానానికి రమ్మని జాబువ్రాస్తే నాకు తీరికలేదు నేనున్నట్లుగానే జరిపించండని జాబు వ్రాసాట్ట
|
| గాజుల చెయ్యి గలగల్లాడితే యిల్లు కళకళలాడుతుంది
|
| గాటిలో కుక్క గడ్డి తినదు, తిననీయదు
|
| గాడి తప్పిన బండివలె
|
| గాడిదకేమి తెలుసు గంధపు వాసన?
|
| గాడిదగుడ్డు
|
| గాడిదకు గడ్డివేసి, ఆవును పాలిమ్మన్నట్లు
|
| గాడిదకు భోగినీళ్ళు పోస్తే బూడిదలో పొర్లాడిందట
|
| గాడిదతో సేద్యం కాలి తాపులకే
|
| గాడిదలతో సేద్యం చేస్తూ కాలి తన్నులకు జడిస్తే ఎట్లా?
|
| గాడిద పుండుకు బూడిద మందు
|
| గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే - ఒంటె అందానికి గాడిద ఆశ్చర్యపోయిందట
|
| గాదె క్రింద ఎలుక గాదె క్రిందే బ్రతకాలి
|
| గాదె క్రింద పందికొక్కులాగా
|
| గానుగవాడి ఎద్దుగానూ - చాకలివాడి గాడిదగానూ పుట్టరాదు
|
| గారాబం గజ్జెల కేడిస్తే - వీపు దెబ్బల కేడ్చిందట
|
| గారెలు చేయవే పెండ్లామా అంటే వేలు మాత్రం చూపిందట
|
| గాలి ఉన్నప్పుడే తూర్పార పట్టాలి
|
| గాలి కబుర్లు
|
| గాలికి పుట్టి ధూళికి పెరిగినట్లు
|
| గాలికి పోయిన కంపను కాలికి తగిలించుకొన్నట్లు
|
| గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం
|
| గాలిని మూట కట్టగలం గానీ, గయ్యళి నోరు మూయలేం
|
| గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అన్నట్లు
|
| గాలిలో మేడలు కట్టినట్లు
|
| గిరాకీ కొననివ్వదు - మందం అమ్మనివ్వదు
|
| గుండ్రాయి దాస్తే పెళ్ళి ఆగుతుందా?
|
| గుండెల ఊపుడుకాదు తొడల తొక్కుడుకు తయారుకా అన్నాడట
|
| గుగ్గిళ్ళకు కొన్న గుఱ్ఱాలు అగడ్తలు దాటుతాయా?
|
| గుడగుడ ఆలోచన గుడిసెకు చేటు
|
| గుడారం గూని బ్రతుకు
|
| గుడి దగ్గరయితే గురుత్వం దూరం
|
| గుడిని మింగే వాడికి తలుపులు అప్పడాలు
|
| గుడిని మింగే వాడికి లింగం అడ్డమా?
|
| గుడిసేటి పనులు
|
| గుడ్డి ఎద్దు చేలో పడ్డట్లు
|
| గుడ్డి కంటికి మట్టి అద్దం
|
| గుడ్డి కంటికి పగలైతేనే? రాత్రయితేనేం?
|
| గుడ్డికన్నా మెల్ల మేలు
|
| గుడ్డి కన్ను మూసినా ఒకటే తెరిచినా ఒక్కటే
|
| గుడ్డి గుర్రానికి దాణా చేటు
|
| గుడ్డి మొగుడికి రేచీకటి పెళ్ళాం
|
| గుడ్డివాడి ఉపాయం గుడ్డివాడిది, గూనివాడి ఉపాయం గూనివాడిది
|
| గుడ్డివాడి చేతిలో రాయి
|
| గుడ్డివాడు ఎటు రువ్వినా గురే
|
| గుడ్డివాళ్ళు ఏనుగులను తడిమి చూచి వర్ణించినట్లు
|
| గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
|
| గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకున్నట్లు
|
| గురి కుదిరితే గుణం కుదురుతుంది
|
| గురి తప్పినా పులినే కొట్టాలి - గుంటనక్కను కాదు
|
| గురివిందగింజ తన ముడ్డిక్రింద నలుపెరగదు
|
| గురువు నుంచుని త్రాగితే, శిష్యుడు పరిగెడుతూ త్రాగుతాడు
|
| గురువును మించిన శిష్యుడు
|
| గురువుకు తిరుమంత్రం చెప్పినట్లు
|
| గురువుకు పంగనామాలు పెట్టినట్లు
|
| గురువులేని విద్య గుడ్డి విద్య
|
| గుఱ్ఱము కడుపున గాడిదపిల్ల పుడుతుందా?
|
| గుఱ్ఱము గుడ్డిదయినా దాణాకు తక్కువ లేదు
|
| గుర్రానికి ముడ్డిలో కాలితే వరిగడ్డి తింటుంది
|
| గుర్రానికి సకిలింత - సంగీతానికి ఇకిలింత వుండాలి
|
| గుర్రాన్ని యేటివరకూ తీసికెళ్ళగలమే గానీ నీళ్ళు త్రాగించగలమా?
|
| గుళ్ళో దేవుడికి నైవేద్యమే లేకుంటే పూజారి పులిహోర కోరాడట
|
| గుళ్ళో పిత్తక పోతే గుగ్గిలం వేసినంత పుణ్యం
|
| గువ్వ గూడెక్కె - రాజు మేడెక్కె
|
| గూట్లో దీపం - నోట్లో ముద్ద
|
| గూనివాని ఒడుపు పడుకున్నపుడు చూడాలి
|
| గూబ ఎక్కిన గృహము చెడును
|
| గెలువని రాజుకు గొప్పలు మెండు
|
| గేదె, దూడ వుండగా గుంజకు వచ్చెరా గురక వాయువు
|
| గొంగడున్నంతే చాచుకోవాలి
|
| గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరినట్లు
|
| గొంతుకలో వెలక్కాయ పడినట్లు
|
| గొంతెమ్మ కోరికలు
|
| గొడుగుమీద గొడుగుంటే పిడుగుమీద పిడుగు పడినట్లే
|
| గొడ్డుకు ఒక దెబ్బ - మనిషికి ఒక మాట
|
| గొడ్డుకి తిన్నది పుష్టి - మనిషికి ఉన్నది పుష్టి
|
| గొడ్డు రైతుకు ఒక బిడ్డ
|
| గొడ్డు వచ్చిన వేళ - బిడ్డ వచ్చిన వేళ
|
| గొడ్డువాడు గొడ్డుపోయి ఏడుస్తుంటే మాదిగవాడు తోలు పోయిందని ఏడ్చాడట
|
| గొడ్రాలికి గొంతు పెద్ద
|
| గొడ్రాలికేమి తెలుసు ప్రసవ నొప్పులు
|
| గొడ్రాలి తిట్టూ, గొడ్డలిపెట్టూ ఒక్కటే
|
| గొప్పగా తెలిసినవారే గోతిలో పడతారు
|
| గొఱ్ఱు గుచ్చిన నేలకు కొరత వుండదు
|
| గొర్రె ఎంత పెరిగినా తోక బెత్తెడే
|
| గొర్రె కసాయివాడినే నమ్ముతుంది
|
| గొర్రెవాటు వేలం వెర్రి
|
| గొర్రె బలిస్తే గొల్లకే లాభం
|
| గొర్రెల మందలో తోడేలు పడ్డట్లు
|
| గొర్రెలు గుంపు కూడితే గొప్ప వర్షం
|
| గొల్లల గోత్రాలు గొర్రెలకు తెలిస్తే - గొర్రెల గోత్రాలు గొల్లల కెరుక
|
| గొళ్ళెం లేని తలుపు - కళ్ళెం లేని గుర్రం
|
| గోచీకి ఎక్కువ తుండుకు తక్కువ
|
| గోచీకి మించిన దరిద్రం లేదు
|
| గోచీపాతల రాయుడులాగా
|
| గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకు?
|
| గోడుకు గోకుడే మందు
|
| గోడకు కొట్టిన సున్నం, లంజకు పెట్టిన సొమ్ము తిరిగిరావు
|
| గోడమీద పిల్లివాటము
|
| గోడలకు చెవులుంటాయి - నీడలకు కళ్ళుంటాయి
|
| గోతిని తీసినవాడే అందులో పడేది
|
| గోతికాడ నక్కలాగా
|
| గోముఖ వ్యాఘ్రం
|
| గోరంత ఆలస్యం - కొండంత నష్టం
|
| గోరంత దీపం - కొండంత వెలుగు
|
| గోరంత వుంటే కొండంత చేసినట్లు
|
| గోరుచుట్టుపై రోకలి పోటు
|
| గోవు లేని వూళ్ళో గొడ్డే శ్రీమహాలక్ష్మి
|
| గోవే తల్లి - ఎద్దే తండ్రి
|
| గ్రహచారం చాలకపోతే తాడే పామై కరుస్తుంది
|
| గ్రహాలు గతులు తప్పినా, ఆడినమాట తప్పరాదు
|
| గ్రాసంలేని కొలువు - మీసంలేని బ్రతుకు - రసం లేని కావ్యం ఒక్కటే
|
| ఘడియ వెసులుబాటు లేదు దమ్మిడీ రాబడి లేదు
|
| ఘోటక బ్రహ్మచారి లాగా
|