| ఇంకెందుకాలస్యం ఇచ్చేయ్ సొగసుల తాంబూలం అన్నాడట
|
| ఇంగువ కట్టిన గుడ్డ లాగా
|
| ఇంట ఆచారం - బయట అనాచారం
|
| ఇంట గెల్చి - రచ్చ గెలువు
|
| ఇంటాయనకు మగతనమేవుంటే పొరుగింటాయన పొందెందుకు? అందట
|
| ఇంటింటా ఒక పొయ్యి - మా యింట మరో పొయ్యి
|
| ఇంటి ఎద్దుకు బాడుగ ఏమిటి?
|
| ఇంటికన్న గుడి పదిలం
|
| ఇంటి కళ ఇల్లాలే చెబుతుంది
|
| ఇంటికి అవ్వ - కొలతకు తవ్వ కావాలి
|
| ఇంటికి ఈల కత్తి - పొరుగుకు బంగారు కత్తి
|
| ఇంటికి ఏబ్రాసి - పొరుగింటికి శ్రీమహాలక్ష్మి
|
| ఇంటికి ఒక పువ్వు - ఈశ్వరుడికి ఒక మాల
|
| ఇంటికి గుట్టు - మడికి గట్టు
|
| ఇంటికి జ్యేష్ఠాదేవి - పొరుగింటికి శ్రీమహాలక్ష్మి
|
| ఇంటికి పెద్ద కొడుకు, పెద్ద అల్లుడే లెక్కపడేది
|
| ఇంటికి పెద్దకొడుకై పుట్టటం కంటే చాకలివాడి గాడిదగా పుట్టటం మేలు
|
| ఇంటికి ముసలి - మడుగుకు మొసలి కీడు
|
| ఇంటి కుక్కకు యింటి కుక్క పనికి రాదు
|
| ఇంటి కూటికీ, బంతి కూటికీ రెంటికీ చెడినట్లు
|
| ఇంటి గుట్టు పెరుమాళ్ళ కెరుక
|
| ఇంటి గుట్టు లంకకు చేటు
|
| ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే మీసాలన్నీ తెగ కాలినాయట
|
| ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
|
| ఇంటి పేరు కస్తూరివారు - ఇంట్లో గబ్బిలాల కంపు
|
| ఇంటి పేరు పుణ్యాల వారు - చేసేవేమో పాపపు పనులు
|
| ఇంటి మొగుడు చెమటకంపు - పొరుగింటి మొగుడు పూలవాసన
|
| ఇంటి లక్ష్మిని వాకిలే చెబుతుంది
|
| ఇంటివాడివలె చేసేవాడూ లేడు - బయటివాడివలె తినేవాడూ లేడు
|
| ఇంటివాడు ఈకతో కొడితే పొరుగువాడు పోకతో కొడతాడు
|
| ఇంటివాడు ఒసే అంటే, బయటివారూ ఒసే అంటారు
|
| ఇంటివారు వేలు చూపితే బయటివారు కాలు చూపుతారు
|
| ఇంట్లో ఇగురు కూర కంటే పొరుగింటి పుల్లకూర రుచి
|
| ఇంట్లో ఇల్లాలి పోరు - బయట బాకీల హోరు
|
| ఇంట్లో ఈగల మోత - బయట పల్లకీల మోత
|
| ఇంట్లో తిని ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
|
| ఇంట్లో పిల్లి - బయట పులి
|
| ఇంత చక్కని పెళ్ళికి బాగా వాయించరా సన్నాయి మేళం అన్నట్లు
|
| ఇంత బ్రతుకూ బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్లు
|
| ఇక పుట్టేనా - ఇక పెరిగేనా - నలభై ఏళ్ళ కొడకా యింట్లో కూర్చో అన్నట్లు
|
| ఇక్కడ మునిగి అక్కడ తేలినట్లు
|
| ఇచిత్రాల పెళ్ళికొడుక్కి అక్షింతలు పెడితే నొసలు గులగుల అని నోట్లో వేసుకున్నాట్ట
|
| ఇచ్చకాలకు ఉచ్చతాగితే గచ్చు కంపు కొట్టిందట
|
| ఇచ్చకాలవారూ బుచ్చకాలవారూ పొట్టకోసం పొక్కులు గోకుతారు
|
| ఇచ్చితినమ్మా వాయనం అంటే పుచ్చుకుంటినమ్మా వాయనం అన్నట్లు
|
| ఇచ్చి తిరిగేది కోమటి తీసుకుని తిప్పేది కంసాలి
|
| ఇచ్చి తీసుకుంటుంటే ఈలిగ నేస్తం
|
| ఇచ్చింది యిచ్చి పుచ్చిన దాన్ని కొన్నట్లు
|
| ఇచ్చింది ఇస్తే కరణమే కాదన్నట్లు
|
| ఇచ్చిన నిష్ఠూరం కన్నా యివ్వని నిష్ఠూరమే మంచిది
|
| ఇచ్చినమ్మ ఈగ - పుచ్చుకున్నమ్మ పులి
|
| ఇచ్చినవాడు దాత - ఇవ్వనివాడు రోత
|
| ఇచ్చినవాడే నచ్చినవాడు - చచ్చినవాడే అబ్బినవాడు
|
| ఇచ్చే గొడ్డునే పితికేది
|
| ఇచ్చేవాడు తీసుకునేవాడికి లోకువ
|
| ఇచ్చేవాడ్ని చూస్తే చచ్చేవాడైనా లేస్తాడు
|
| ఇచ్చేవి అందాలు పుచ్చుకునేవి తీర్థాలు అన్నట్లు
|
| ఇత్తడి పుత్తడీ కాదు - తొత్తు దొరసానీ కాదు
|
| ఇదిగో పసుపు - అదుగో ముసుగు అన్నట్లు
|
| ఇదిగో పులి అంటే అదుగో తోక అన్నట్లు
|
| ఇదిగో పాము అంటే అదుగో పడగ అన్నట్లు
|
| ఇద్దరు దెబ్బలాడితే మూడోవాడికి లాభం
|
| ఇద్దరు పెళ్ళాల మొగుడు ఇరుకున పడి చచ్చినట్లు
|
| ఇద్దరు మొగుళ్ళకు ముద్దుల పెళ్ళాంగా వుండటంలోనే మజా అందట
|
| ఇనుప గుగ్గిళ్ళుకానీ మినప గుగ్గిళ్ళు కావు అన్నట్లు
|
| ఇనుము కరిగే చోట ఈగలకేమి పని?
|
| ఇనుముతో కూడిన అగ్నికే సమ్మెట పోట్లు
|
| ఇనుము విరిగితే అతకవచ్చు మనసు విరిగితే అతకలేము
|
| ఇరుగు ఇంగలం - పొరుగు మంగలం
|
| ఇరుగును చూచి పొరుగు వాత పెట్టుకొన్నట్లు
|
| ఇరుకులో యిబ్బందులు అన్నట్లు
|
| ఇలను నమ్మి చెడినవాడు కలికానికి కూడా కన్పించడు
|
| ఇల్లరికపుటల్లుడు ఇంటికి చేటు - కొమ్ముల బర్రె కొట్టానికి చేటు
|
| ఇల్లరికం కన్నా మాలరికం మేలు
|
| ఇల్లలికి ముగ్గులు పెడితే ఈగల బాధ
|
| ఇల్లలుకగానే పండుగా?
|
| ఇల్లాలి శుచి యింటిని చూడగానే తెలుస్తుంది
|
| ఇల్లాలు గుడ్డిదయితే ఇంటి కుండలకు చేటు
|
| ఇల్లాలు లేని యిల్లు భూతాలకు నిలయం
|
| ఇల్లు యిచ్చినవానికీ, మజ్జిగ పోసిన వానికీ మంచి లేదు
|
| ఇల్లు ఇరకటం - ఆలి మరకటం
|
| ఇల్లెక్కి కొరివి త్రిప్పినట్లు
|
| ఇల్లు ఎక్కి కోక విప్పిందట
|
| ఇల్లు కట్టి చూడు పెళ్ళిచేసి చూడు
|
| ఇల్లు కాలుతుంటే జల్లెడతో నీళ్ళుపోసినట్లు
|
| ఇల్లుకాలి ఏడుస్తుంటే చుట్టకు నిప్పడిగినట్లు
|
| ఇల్లు కాలుతుంటే బావి త్రవ్వినట్లు
|
| ఇల్లుచూచి ఇల్లాలిని చూడు
|
| ఇల్లు జానెడు - కర్ర మూరెడు
|
| ఇల్లు తీరు వాకిలి - తల్లి తీరు పిల్ల
|
| ఇల్లు దాటిన ఆడది లోకానికి లోకువ
|
| ఇల్లు పీకి పందిరి వేసినట్లు
|
| ఇల్లు మ్రింగే అత్తకు యుగం మ్రింగే కోడలు
|
| ఇల్లు లేనమ్మ హీనం చూడు - మగడు లేనమ్మ మానం చూడు
|
| ఇల్లు విడిచిన తర్వాత ఇల్లాలవుతుందా?
|
| ఇల్లు విడిచిన ఆడది - చెట్టు విడిచిన కోతి ఒకటే
|
| ఇల్లే తీర్థం - వాకిలే వారణాసి - కడుపే కైలాసం అన్నట్లు
|
| ఇల్లే కైలాసం - వాకిలే వైకుంఠం అన్నట్లు
|
| ఇవ్వడమన్నది ఈ యింట లేదు, తే అన్నది తరతరాలుగా వస్తున్నదన్నట్లు
|
| ఇవ్వని మొండికి విడువని చండి
|
| ఇవ్వాళ అందలం ఎక్కడమెందుకు? రేపు జోలె పట్టడమెందుకు?
|
| ఇవ్వాళ చస్తే రేపటికి రెండు
|
| ఇవిగో పూలంటే అందుకో అందాలు అందట
|
| ఇష్టంలేని పెళ్ళాన్ని ఒసే అన్నా తప్పే - అమ్మా అన్నా తప్పే
|
| ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానం
|
| ఇసంట రమ్మంటే ఇల్లంతా నాది అన్నట్లు
|
| ఇసుక తక్కెడ - పేడ తక్కెడ
|
| ఇస్తే చేసేది లేదు - చస్తే వచ్చేది లేదు
|
| ఇస్తే పెండ్లి - ఇవ్వకపోతే పెటాకులు
|
| ఇహం పరం లేని మొగుడు ఉంటేనేమి? పోతేనేమి?
|
| ఈ ఇంట ఆచారమా మా గ్రహచారమా?
|
| ఈ ఊపుడుక్కాదు ఆ ఊపుడుకు తట్టుకోవాలన్నాడట
|
| ఈ ఊళ్ళో పెద్దలెవరంటే తాళ్ళు - దాతలెవరంటే చాకళ్ళు
|
| ఈగ వ్రణం కోరు - నక్క పీనుగ కోరు
|
| ఈగను కప్ప మ్రింగితే - కప్పను పాము మ్రింగుతుంది
|
| ఈ చీరెట్లా వుందంటే, చీరే లేకుంటే నువ్వు మరీ బాగుంటావన్నాడట
|
| ఈ చేత చేస్తారు - ఆ చేత అనుభవిస్తారు
|
| ఈటె పోటు మానుతుంది గానీ మాట పోటు మానదు
|
| ఈడుగానిది యింటికిరాదు
|
| ఈడు చూసి పిల్లని యివ్వాలి - పిడి చూసి కొడవలి కొనాలి
|
| ఈడ్పు కాళ్ళు, ఈడ్పు చేతుల ఇతడేనమ్మా యిల్లరికపుటల్లుడు
|
| ఈతకు మించిన లోతు లేదు
|
| ఈతగింజ ఇచ్చి తాటిగింజలాగినట్లు
|
| ఈతచెట్టు ఇల్లు కాదు - తాడిచెట్టు తల్లి కాదు
|
| ఈతచెట్టు క్రింద పాలు త్రాగినా కల్లే అంటారు
|
| ఈత నేర్చిన వాడికే నీటి చావు
|
| ఈత వచ్చినపుడు లోతనిపిస్తుందా?
|
| ఈదబోతే త్రాగ నీళ్ళు లేవు
|
| ఈనగాచి నక్కల పాలు చేసినట్లు
|
| ఈ దెబ్బెలా వుందని అడిగితే నిన్నటి దెబ్బే బాగుందన్నదట
|
| ఈనాడు ఇంటిలో - రేపు వీధిలో
|
| ఈ నొక్కుళ్ళకన్నా ఆ దెబ్బలే బాగున్నాయందట
|
| ఈ సంబడానికేనా ఇంత ఆర్భాటం?
|