| తంగేడు పూచినట్లు
|
| తండ్రి ఓర్వని బిడ్డను తల్లి ఓరుస్తుంది
|
| తండ్రి చస్తే పెత్తనం తెలుస్తుంది - తల్లి చస్తే కాపురం తెలుస్తుంది
|
| తండ్రి వంకవారు దాయాదివారు
|
| తంతే బూరెల గంపలో పడ్డట్లు
|
| తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలం రమ్మంటే వస్తుందా?
|
| తక్కువ వానికి నిక్కులు లావు
|
| తగవు తీర్చరా సింగన్నా అంటే దూడ, బర్రె నావే అన్నాట్ట
|
| తగినట్టు కూర్చాడురా తాకట్లమారి బ్రహ్మ అన్నట్లు
|
| తగిలించుకొనటం తేలిక - వదిలించుకోవటం కష్టం
|
| తగిలిన కాలుకే తగులుతుంది
|
| తగులమారి తంపి - పుల్లింగాల పిల్లి
|
| తగులుకున్న మొగుడినీ, తాడిచెట్టు నీడనూ నమ్ముకోరాదు
|
| తట్టలో కాపురం బుట్టలోకి వచ్చినట్లు
|
| తణుకు పోయి మాచారం పోయినట్లు
|
| తడి గుడ్డతో గొంతు కోసినట్లు
|
| తడిక కుక్కకు అడ్డంగానీ, మనిషికి అడ్డమా?
|
| తడిక తోసిన వాడిది తప్పు అన్నట్లు
|
| తడిసి గానీ గుడిసె కప్పడు
|
| తడిసిన వానికి చలేమిటి?
|
| తడిసి ముప్పందుము మోసినట్లు
|
| తద్దినం పెట్టేవానికి తమ్ముడేగా!
|
| తద్దినపు భోజనానికి పిలిస్తే, రోజూ మీ ఇంట ఇట్లాగే జరగాలని దీవించాడట
|
| తద్దినానికి తక్కువ - మాసికానికి ఎక్కువ
|
| తన యింటితలుపు ఎదురింటికిపెట్టి, తెల్లవార్లూ తనింట్లో కుక్కలు తోలుతూ కూర్చున్నట్లు
|
| తన కంట్లో దూలాలు పెట్టుకుని, పరుల కంట్లో నలుసులు ఎంచినట్లు
|
| తన కంపు తన కింపు
|
| తన కడుపు పండితే పక్కింటాయన తలనీలాలు సమర్పిస్తానని మొక్కుకుందిట
|
| తన కలిమి ఇంద్రభోగం, తన లేమి లోకదారిద్ర్యం అనుకున్నట్లు
|
| తన కాళ్ళకు తానే మొక్కుకున్నట్లు
|
| తనకు కానిది ఎట్లా పోతేనేం?
|
| తనకు కాని రాజ్యం పండితేనేం? పండక పోతేనేం?
|
| తనకు మాలినధర్మము - మొదలు చెడ్డ బేరము లేవు
|
| తనకు రొట్టె - యితరులకు ముక్క
|
| తనకు లేదనేడిస్తే ఒకకన్ను పోయింది - ఎదుటివానికున్నదని ఏడిస్తే యింకోకన్ను పోయింది
|
| తన కోపమే తన శత్రువు
|
| తన గుణం మంచిదయితే, సానివాడలో కూడా కాపురం చేయవచ్చు
|
| తన చావు జగత్ప్రళయం అనుకున్నట్లు
|
| తన ముడ్డి కాకుంటే కాశీదాకా దేకమన్నట్లు
|
| తన తప్పు తప్పు కాదు - తన బిడ్డ దుడుకూ కాదు
|
| తనదాకా వస్తేగానీ తెలియదు
|
| తనది తాటాకు - యితరులది ఈతాకు
|
| తన నీడని తానే త్రొక్కుకున్నట్లు
|
| తన నోటికి తవుడు లేదు - లంజ నోటికి పంచదారట
|
| తన ముడ్డి కాకపోతే తాటి మట్టకి ఎదురు దేకమన్నట్లు
|
| తనయుల పుట్టుక తల్లి కెరుక
|
| తనవారి కెంత వున్నా తన భాగ్యమే తనది
|
| తన సొమ్ము అల్లం - పరుల సొమ్ము బెల్లం
|
| తనువుకు తనువే అర్పణం అన్నట్లు
|
| తనువుల తహతహ తీరేది కాదన్నట్లు
|
| తనువుల దాహాలు పెదవులకే తెలుసునన్నట్లు
|
| తనువుల పాలపుంత సొగసుల తాంబూలం అన్నట్లు
|
| తనువుల యుద్ధం తనివి తీరదు
|
| తనువులు దగ్గరైతే పరువాల పోరు తగ్గుతుందన్నట్లు
|
| తనువు వెళ్ళినా దినము వెళ్ళదు
|
| తన్నే కాలికి రోలు అడ్డమా?
|
| తప్పు చేసినవానికీ - అప్పుచేసిన వానికీ ముఖం చెల్లవు
|
| తప్పులు చేయనివారు అవనిలో లేరు
|
| తప్పు లెన్ను వారు తండోపతండాలు
|
| తప్పు, ఒప్పు దైవ మెరుగును
|
| తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రువులగును
|
| తమలపాకులో సున్నమంతటివాడు - తక్కువయినా ఒకటే ఎక్కువయినా ఒకటే
|
| తమలపాకుతో తానిట్లంటే, తలుపుచెక్కతో నేనిట్లంటి
|
| తమాం లేదంటే రవికైనా తప్పించమన్నాడట
|
| తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగా చెప్పాలి
|
| తరతరాల ఆస్తే నిలిచివున్న ప్రశస్తి అన్నట్లు
|
| తలకడిగి బాసచేసినా వెలయాలిని నమ్మరాదు
|
| తల క్రింద కొరివిలాగా
|
| తల కోసి మొలేసినట్లు
|
| తలగడ క్రింద త్రాచుపామువలె
|
| తల గొరిగించుకొన్నాక తిథి, వార,నక్షత్రాలు చూచినట్లు
|
| తలచినప్పుడే తాత పెళ్ళి
|
| తల చుట్టం, తోక పగ
|
| తలచుకొన్నప్పుడే తలంబ్రాలంటే ఎలా?
|
| తల ప్రాణం తోకకు వచ్చినట్లు
|
| తలంబ్రాలకూ, తద్దినాలకూ ఒకే మంత్రమా?
|
| తలమాసిన వాడెవడంటే ఆలి చచ్చినవాడే అన్నట్లు
|
| తలలు బోడులయినా తలపులు బోడులా?
|
| తలలో నాలుకలాగా
|
| తలవ్రాత తప్పించుకోలేనిది
|
| తల్లి కడుపు చూస్తే పెళ్ళాం జేబు చూస్తుంది
|
| తల్లికి కూడు పెట్టడుగానీ, పిలిచి పినతల్లికి చీరపెడ్తాడట
|
| తల్లికి కూడు పెట్టని వాడు తగవు చెప్పేవాడా?
|
| తల్లికి తగిన బిడ్డ
|
| తల్లిగలప్పుడే పుట్టిల్లు - పాలుగలప్పుడే పాయసం
|
| తల్లి గుణం కూతురే బయట పెడుతుంది
|
| తల్లి చచ్చినా మేనమాముంటే చాలు
|
| తల్లి చనిపోతే తండ్రి పినతండ్రితో సమానం
|
| తల్లి చస్తే నాలుక చచ్చినట్లు - తండ్రి చస్తే కళ్ళు పోయినట్లు
|
| తల్లి చాటు పిల్ల
|
| తల్లి చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?
|
| తల్లితండ్రులు తిట్టుకుంటూ లేస్తే - పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు
|
| తల్లిదే వలపక్షం - ధరణిదే వలపక్షం
|
| తల్లినన్నా చూపెట్టు - తద్దినమన్నా పెట్టు
|
| తల్లి దైవము - తండ్రి ధనం
|
| తల్లిని చూచి పిల్లను - తరిని చూచి బర్రెను ఎంచుకోవాలి
|
| తల్లిని నమ్మినవాడూ, ధరణిని నమ్మిన వాడూ చెడడు
|
| తల్లి పిత్తి పిల్ల మీద పెట్టినట్లు
|
| తల్లి పుట్టిల్లు మేనమామ దగ్గర పొగడినట్లు
|
| తల్లి పెంచాలి - ధరణి పెంచాలి - అంతేగానీ బయటివారు పెంచుతారా?
|
| తల్లి మాటలు - పినతల్లి పెట్టు
|
| తల్లి ముక్కు కోసిన వానికి మేనత్త ముక్కు బెండపువ్వు
|
| తల్లి ముఖం చూడని బిడ్డ - వాన ముఖం చూడని పైరు
|
| తల్లి లేని పిల్ల - ఉల్లిలేని కూర
|
| తల్లి లేని పిల్ల దయ్యాల పాలు
|
| తల్లి వంకవారు తగినవారు
|
| తల్లి విషం - పెళ్ళాం బెల్లం
|
| తవ్వగా తవ్వగా నిజం తేలుతుంది
|
| తవ్వి మీద పోసుకున్నట్లు
|
| తవ్వినా దొరకనిది మొత్తుకుంటే దొరుకుతుందా?
|
| తాకబోతే తగులు కున్నట్లు
|
| తాగను గంజి లేదు - తలకు సంపంగి నూనెట
|
| తాగనేరని పిల్లి ఒలక పోసుకున్నదట
|
| తాగపోతే నీరు లేదుగానీ ఈద పోయినట్లు
|
| తాగినవాడి తప్పుకు తగవు లేదు
|
| తాగిన వాడిదే పాట - సాగిన వాడిదే ఆట
|
| తాగిన రొమ్మే గుద్దినట్లు
|
| తాగేవాడే తాళ్ళ పన్ను కడతాడు
|
| తాచుపోతు తామసం - జర్రిగొడ్డు పిరికితనం
|
| తా జెడ్డ కోతి వనమెల్లా చెరచిందిట
|
| తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా?
|
| తాటి చెట్టుకింద పాలు తాగినా కల్లే అంటారు
|
| తాటి చెట్టుకి తేనె పట్టుపడితే ఈతచెట్టుకు ఈగలు ముసిరాయట
|
| తాటిచెట్టు నీడ గాదు తగులుకున్నది పెండ్లామూ గాదు
|
| తాడి తన్నే వాడుంటే తల తన్నే వాడుంటాడు
|
| తాడు తెగిన గాలిపటంలా
|
| తాడూ లేదు - బొంగరం లేదు
|
| తాతకు దగ్గులు నేర్పినట్లు
|
| తాత తిన్న బొచ్చె తరతరాలు
|
| తాతలనాడు నేతులు తాగాం, మా మూతులు వాసన చూడండి
|
| తాను త్రవ్విన గోతిలో తానే పడతాడు
|
| తాను తిన తవుడు లేదు - వుంచుకున్న దానికి వడియాలు
|
| తాను దూర సందులేదు - మెడకో డోలు
|
| తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్లు
|
| తాను మింగేదాన్నీ - తనను మింగేదాన్నీ చూచుకోవాలి
|
| తాను మెచ్చ తినాలి - పరుల మెచ్చ నడవాలి
|
| తాను తుమ్మి తానే శతాయుశ్షు అనుకున్నట్లు
|
| తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు
|
| తాపుల గొడ్డుకు రోలడ్డమా?
|
| తామరాకుపై నీటి బొట్టు లాగా
|
| తాయెత్తులకే పిల్లలు పుడితే మొగుడెందుకన్నట్లు
|
| తా వలచింది రంభ - తా మునిగింది గంగ
|
| తాళ్ళపాక వారి కవిత్వం కొంత - నా పైత్యం కొంత
|
| తింటే అయాసం - తినకుంటే నీరసం
|
| తింటే కదలలేను - తినకపోతే మెదలలేను
|
| తింటేగానీ రుచి తెలీదు - దిగితేగానీ లోతు తెలీదు
|
| తింటే గారెలు తినాలి - వింటే భారతం వినాలి
|
| తిండికి ఏనుగు - పనికి పీనుగు
|
| తిండికి చేటు - మందికి బరువు
|
| తిండికి తిమ్మరాజు - పనికి పోతరాజు
|
| తిండికి ముందు - పనికి వెనుక
|
| తిండికి మెండు - పనికి దొంగ
|
| తిండికి వచ్చినట్టా - తీర్ధానికి వచ్చినట్టా?
|
| తిండి కొద్దీ పసరం
|
| తిండెక్కువైతే తీపరం పెరుగుతుంది
|
| తిక్కల వాడు తిరునాళ్ళకు పోతే ఎక్కా, దిగా సరిపోయిందిట
|
| తిక్కోడి పెళ్ళిలో తిన్నవాడిదే లాభం అన్నట్లు
|
| తిట్టబోతే అక్కబిడ్డ - కొట్టబోతే బాలింత అన్నట్లు
|
| తిట్టితే చచ్చేవాడూ - దీవించితే బ్రతికేవాడూ లేడు
|
| తిట్టితే గాలికి పోతాయి
|
| తిట్టిన వాడికి తిట్టున్నర అన్నట్లు
|
| తిట్టుకు సింగారం లేదు
|
| తిట్టే నోరు, తినే నోరు, తిరిగే కాలూ వూరుకోవు
|
| తినగల అమ్మ తిండి తీర్థాలలో బయటపడుతుంది
|
| తినగా తినగా గారెలు చేదు
|
| తినబోతూ రుచులడిగినట్లు
|
| తిననేర్చినమ్మ పెట్ట నేరుస్తుంది
|
| తినమరిగిన కుక్క అలమరిగిందట
|
| తినమరిగిన కోడి యిల్లెక్కి కూసింది
|
| తినమరిగిన ప్రాణం అల్లాడిపోతుంది
|
| తిని వుండలేక, తాగి బొందలో పడినట్లు
|
| తిని కక్కరాదు - కని పోగొట్టుకోరాదు
|
| తినే తినే కూడులో మన్ను పోసుకున్నట్లు
|
| తినేది గొడ్డు మాంసం పైగా విభూతి రేఖలు
|
| తిన్న యింటి వాసాలు లెక్కపెట్టినట్లు
|
| తిన్నదాని కంటే అరిగిందే బలం
|
తిమ్మన్నా! తిమ్మన్నా! నమస్కారం అంటే నా పేరు నీకెలా తెలిసిందని అడిగితే
నీ ముఖం చూడగానే తెలిసిందని అన్నాడట
|
| తిమ్మిని బ్రహ్మి, బ్రహ్మిని తిమ్మి చేసినట్లు
|
| తియ్యని ముద్దులకు మురవాలో, అదిరే దెబ్బలకు అరవాలో తెలియటం లేదన్నదట
|
| తియ్యని రోగాలు - కమ్మని మందులు
|
| తిరుగానాం మరగానాం తీపి వాయనం అన్నట్లు
|
| తిరిగి రైతు - తిరక్క బైరాగి చెడతారు
|
| తిరిగే కాలూ, తిట్టే నోరు వూరుకోవు
|
| తిరుపతి క్షవరంలాగా
|
| తిలా పాపం తలా కొంచెం
|
| తీగ కదిలిస్తే డొంకంతా కదుల్తుంది
|
| తీగకు కాయ బరువా?
|
| తీట గలవానికి తోట గలవానికి తీరికుండదు
|
| తీట బట్టి వాడే గోక్కుంటాడు
|
| తీట సిగ్గెరగదు
|
| తీతువ పిట్టలాగా
|
| తీపి ఏదంటే ప్రాణం అన్నట్లు
|
| తీయగా తీయగా రాగం - మూలగ్గా మూలగ్గా రోగం
|
| తీర్థము, స్వార్థము కలిసి వచ్చినట్లు
|
| తీరు తీరు గుడ్డలు కట్టుకొని తీర్థానికి పోతే, ఊరికొక గుడ్డ వూడిపోయిందట
|
| తీర్చే వారుంటే ఎన్ని బెట్టులైనా పోవచ్చు
|
| తీసినవాడూ బాగానే వుంటాడు - చూచినవాడూ బాగానే వుంటాడు ఎదుటివాని మీద పడుతుంది ముట్టుపుల్ల
|
| తుట్టె పురుగుకు రెక్కలొచ్చినా, ముసలాడికి ప్రాయం వచ్చినా పట్టపగ్గా లుండవు
|
| తుప్పరల పసే గానీ మంత్రాల పస లేదు
|
| తుమ్మ తోపుల్లో కొత్త కోలాటం
|
| తుమ్మల్లో ప్రొద్దుకూకినట్లు
|
| తుమ్మ దుడ్డు వలె - కాపు కదురు వలె
|
| తుమ్మితే వూడిపోయే ముక్కు ఎన్నాళ్ళుంటుంది
|
| తుమ్ముకు తమ్ముడు లేడు గానీ ఆవలింతకు అన్న వున్నాడు
|
| తుమ్ము తమ్ముడై చెపుతుంది
|
| తుమ్మెదలాడితే వాన తప్పదు
|
| తురకలలో మంచివాడెవరంటే తల్లిగర్భాన వున్నవాడు, పుడమిగర్భాన ఉన్నవాడు
|
| తురక లేని వూళ్ళో దూదేకులవాడే ముల్లా
|
| తురకవాడికి గంగిరెద్దు పోతే కోసుకుని తిన్నారట
|
| తులము నాలుకకు తొంభై రుచులు
|
| తులలో వానకు ధరణి పండును
|
| తులసి కోటలో దురదగొండి మొలచినట్లు
|
| తులసివనంలో గంజాయి మొక్కలాగా
|
| తులవ నోటికి ఉలవపప్పు
|
| తూనీగలాడితే తూమెడు వర్షం
|
| తూర్పున ఇంద్ర ధనుస్సు - దూరాన వర్షం
|
| తూర్పున ఇంద్ర ధనుస్సుకు దుక్కిటెద్దు రంకె వేస్తుంది
|
| తెంపుల నీళ్ళు - చిల్లులు కడవ
|
| తెగించి దానం చేస్తా తేరా పిడికెడు రాళ్ళు అన్నాడట
|
| తెగించినవాడికి తెడ్డే లింగం
|
| తెగితే లింగడు రాయి
|
| తెగిన వేలుమీద ఉచ్చకూడ పోయడు
|
| తెగువ దేవేంద్ర పదవి
|
| తెగేదాకా లాగరాదు
|
| తెడ్డుండగా చెయ్యి కాల్చుకున్నట్లు
|
| తెడ్డుకేమి తెలుసు వంట రుచి?
|
| తెలఘాణ్యపు టెక్కు - నియోగపు నిక్కు
|
| తెలియని దయ్యంకన్నా తెల్సిన దయ్యం మేలు
|
| తెలివి ఒకరి సొత్తా!
|
| తెలివికి తల లేకపోయినా, భోజనానికి పొట్ట వుంది
|
| తెలివి తక్కువ - ఆకలెక్కువ
|
| తెలివైనవాడికి చిటికెల సంకేతం చాలు
|
| తెలిసే వరకే బ్రహ్మ విద్య - తెలిసిన తర్వాత కూసు విద్య
|
| తెల్లనివన్నీ పాలు -నల్లనివన్నీ నీళ్ళు అనుకున్నట్లు
|
| తెల్లవారితే ఎల్లవారల బ్రతుకులూ ఒక్కటే
|
| తెల్లవారితే చూడు ఎల్లాయి బ్రతుకు
|
| తేనెటీగల పని తీరుబడి లేని పని
|
| తేనె పోసి పెంచినా వేపకు చేదు పోదు
|
| తేరగా వచ్చింది తెగ తిన్నట్లు
|
| తేరగా వచ్చింది వూరికే పోతుంది
|
| తేర గుర్రం - తంగేడు బరిక
|
| తేలు కుట్టిన దొంగలాగా
|
| తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లూ తెగ కుట్టిందట
|
తేలు తేలండీ! అంటూ అరిస్తే మొగాళ్ళను పిలవ్వే అన్నాట్ట,
మీరు మొగాళ్ళు కారా అని భార్యంటే సమయానికి గుర్తు చేసావు కర్రతే అన్నాట్ట
|
| తేలు మాదిరి కుట్టటం - బల్లి మాదిరి అణగటం
|
| తేలువలె కుట్టినట్లు
|
| తేలేనయ్యకు తిండి మెండు - వండలేనమ్మకు వగలు మెండు
|
| తొండ ముదిరితే ఊసరవెల్లి
|
| తొందరకు ఆలస్యం తోడు
|
| తొందరగా రమ్మంటే, తిరగమూత వేసి వస్తానన్నట్లు
|
| తొడ సంబంధం తొంభై ఏళ్ళుంటుంది
|
| తొత్తు క్రింద బడి తొత్తులాగా
|
| తొత్తులాగా పనిచేసి దొరలాగా అనుభవించాలి
|
| తొలకరి జల్లులు - ఆశల మొలకలు
|
| తొలకరిలో చెరువు నిండినా - తొలిచూలు కొడుకు పుట్టినా లాభం
|
| తొలకరి వాన మొలకలకు తల్లి
|
| తొలి ఏకాదశికి తొలి తాటిపండు
|
| తోక తెగిన నక్కలాగా
|
| తోకతో నారాయణా అన్నట్లు
|
| తోక ముడుచుకొన్నట్లు
|
| తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటి కెళితే - అదీ తోచనమ్మ అత్తారి పుట్టింటికి పోయిందట
|
| తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటి కెళితే - చూచీ చూడనట్లు చూచారట
|
| తోటకూర నాడైనా చెప్పవైతివిరా కొడకా అన్నట్లు
|
| తోట మీద వారికి, పీట మీద వారికి మొగమాట ముండదు
|
| తోడులేక రాచపీనుగ వెళ్ళదు
|
| తోడేలును గొర్రెలకు కాపుంచినట్లు
|
| తోరణం కట్టగానే పెళ్ళయినట్టా?
|
| తోరణం కట్టినింట్లో తగవు పనికిరాదు
|
| తోలు కొరికే వాడు పోతే ఎముక కొరికే వాడు వస్తాడు
|
| తోలు తీయకుండానే తొనలు మ్రింగినట్లు
|