| పంచదార పలుకులు - విషపు చూపులు
|
| పంచపాండవులంటే నాకు తెలీదా? మంచపుకోళ్ళులాగా ముగ్గురంటూ రెండువేళ్ళు చూపించాడట
|
| పంచాంగం పటపట - విస్తరాకు లొటలొట
|
| పంచాంగం పోగానే తిథీ వారాలూ పోతాయా?
|
| పంచాగ్ని మధ్య ఉన్నట్లు
|
| పంటకు పెంట - వంట మంట
|
| పండని ఏడు పాటు ఎక్కువ
|
| పండాకును చూచి పసరాకు నవ్వినట్లు
|
| పండాకు రాలుతుంటే పసరాకు నల్లబడుతుంది
|
| పండిత పుత్రుడు పరమ శుంఠ
|
| పండిన రోజే పండుగ
|
| పండినా ఎండినా పని తప్పదు
|
| పండుగనాడూ పాత పెళ్ళామేనా/పాత మొగుడేనా?
|
| పండుగ - పైన దండుగ
|
| పండు వలిచి చేతిలో పెట్టినట్లు
|
| పండే పంట పైరులోనే తెలుస్తుంది
|
| పంది ఎంత బలిసినా నంది కాదు
|
| పందిని పొడిచే వాడే బంటు
|
| పంది పన్నీరు మెచ్చునా?
|
| పంది బురద మెచ్చు
|
| పందిరి పడి బ్రతికినవారూ యిల్లు పడి చచ్చినవారూ లేరు
|
| పందుం తిన్నా పరకడుపే
|
| పంపకాలు మాకు - లొట్టలు మీకు
|
| పకపకా నవ్వేవారూ, గబగబా అరిచేవారూ కపటమెరుగరు
|
| పక్కమీద పూలు నలిగినట్లు నీవూ నలిగితే ఎట్లా అన్నాడట
|
| పక్కలో బల్లెంలాగా
|
| పక్కింటి పోరు పండగంత వేడుక
|
| పగ గలిగి బ్రతకటం - పామున్న యింట్లో బ్రతకటం ఒక్కటే
|
| పగటి నిద్ర పనికి చేటు
|
| పగ బట్టిన త్రాచులాగ
|
| పగలు చెయ్యి లాగితే రానిది, రాత్రి కన్నుగీటితే వస్తుందా?
|
| పగలు చూస్తే రాత్రికి కలలోకి వస్తుంది అన్నట్లు
|
| పగలూ, వగలూ నిప్పులాంటివి
|
| పగలెల్లా బారెడు నేశాను - దీపం తేరా దిగనేస్తాను అన్నాడట
|
| పగవాడిని పంచాంగం అడిగితే మధ్యాహ్నమే మరణం అన్నాడట
|
| పచ్చగా వుంటే పదిమంది చుట్టాలు
|
| పచ్చి వెలగకాయ గొంతుకడ్డం పడ్డట్లు
|
| పట్టణే పాదమాచారం
|
| పట్టినదంతా బంగారం - ముట్టినవల్లా ముత్యాలు అన్నట్లు
|
| పట్టుకొన్నవాడు మట్టగుడిశ అంటే పైనున్నవాడు జెల్ల అన్నాడట
|
| పట్టుకొమ్మను నరుక్కున్నట్లు
|
| పట్టుచీర ఎరువిచ్చి, పీట పట్టుకుని వెంట తిరిగినట్లు
|
| పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు
|
| పట్టెడు పెడితే పుట్టెడు పుడుతుంది
|
| పట్టెడు బొట్టుంటే పది లక్షలు స్త్రీకి
|
| పడతి పరువాలు పంచదార గుళికలు
|
| పడమట కొర్రువేస్తే పందిళ్ళమీద రాజనాలు పండుతాయి
|
| పడమట కొర్రువేస్తే పాడి ఆవు రంకె వేస్తుంది
|
| పడమట పిసరంత మబ్బు నడిస్తే పాతాళందాకా వాన
|
| పడమట మెరిసిన పది ఘడియలకు వాన
|
| పడమట మెరిస్తే పంది కూడా నీళ్ళలో దిగదు
|
| పడ్డ గోడలు పడ్డట్టుండవు - చెడిన కాపురం చెడినట్లుండదు
|
| పడిసం పదిరోగాల పెట్టు
|
| పడుగూ పేకలాగా
|
| పడుచుపిల్ల పరువాలు రసరాజ్య సోపానాలు
|
| పడుచుపిల్ల కనుగీటు యువహృదయపు తడబాటు
|
| పడుచుపిల్ల కౌగిలి సుఖాల లోగిలి
|
| పడుచుల కాపురం - చితుకుల మంట
|
| పడుచులతో సయ్యాట - పాములతో చెలగాటం ఒకటే
|
| పడ్డవారు చెడ్డవారు కారు
|
| పణత పడే జాగాకే కాళ్ళు ఈడ్చుకుపోతాయి
|
| పత్రి దేవుని మీద - భక్తి చెప్పులమీద
|
| పదవులు మావి - బాధలు మీవి
|
| పదిమంది చేరితే పనిపాడు
|
| పదిమంది నడిచిందే బాట
|
| పదిమంది కళ్ళ పడ్డ పాము చావక బ్రతుకుతుందా?
|
| పది రాళ్ళు వేస్తే ఒక రాయైనా తగులుతుంది
|
| పది వూళ్ళ పాపరాజులాగా
|
| పదుగురాడుమాట పాటియై ధర చెల్లు
|
| పద్మాసనం వేసుకుని కూర్చుంటే పరమాన్నం వడ్డిస్తారా?
|
| పనికి పంగనామం పెట్టి గంపజాతర నెత్తికెత్తుకున్నట్లు
|
| పనికి పరాకు - తిండికి హుషారు
|
| పనికి పాతిక నష్టం - పరక లాభం
|
| పనికి పీనుగ - తిండికి ఏనుగు
|
| పనికి వచ్చి సరదా తీర్చమన్నట్లు
|
| పనిగలవాడు పందిరేస్తే పిచ్చుకలు వ్రాలగానే పడిపోయిందట
|
| పనిచేయనివాడు ఇంటికి చేటు
|
| పని తక్కువ - ప్రాకులాట ఎక్కువ
|
| పనిముందా? తిండి ముందా?
|
| పని ముద్దా? పాటు ముద్దా?
|
| పని లేని పాపరాజులాగా
|
| పనిలేని మంగలి పిల్లితల గొరిగినట్లు
|
| పనీ పాటూలేదు పదం పాడతానన్నట్లు
|
| పనీలేదు - పాటూలేదు
|
| పన్నెండామడల మధ్య బ్రాహ్మణుడు లేకపోతే యజ్ఞం చేయిస్తానన్నాడట
|
| పప్పుకూటికి ముందు - చాకిరీకి వెనుక వుండాలి
|
| పప్పులేని పెళ్ళి - ఉప్పులేని కూర
|
పప్పులో ఉప్పు వేసేటప్పుడు చెప్పెయ్యవే కోడలా అంటే,
పప్పులో చెప్పువేసి, అత్త కంచంలో అంచున పెట్టిందట
|
| పయోముఖ విషకుంభము
|
| పరకాంత పొందు తాచుపాము పడగ
|
| పరకాంత లెందరయినా కులకాంతకు సాటిరారు
|
| పరనింద గృహక్షయం - యతినింద కులక్షయం
|
| పరమానందయ్యగారి శిష్యులలాగా
|
| పరికిణీ, పావడాలు పరువాల ఆవడలు
|
| పరుగెత్తి పాలు త్రాగేకన్నా, నిలబడి నీళ్ళు త్రాగటం మేలు
|
| పరులసొమ్ము పాపిష్టిది
|
| పరుల సొమ్ము పామువంటిది
|
| పరుల సొమ్ము పేలపిండి
|
| పరువాల జాతరలో పెదవి ఎంగిలా?
|
| పరువాల పల్లవింత - పాన్పు త్రుళ్ళింత
|
| పరువాల పొందుకు పరదాలు అడ్డెందుకు?
|
| పరువాల పోరు మధువుల పుంత అన్నట్లు
|
| పరువిచ్చి పరువు తెచ్చుకో
|
| పరువుకీ, కరువుకీ డబ్బు
|
| పరువు లేని బ్రతుకు పరమ రోత
|
| పరోపకారం ఇదం శరీరం
|
| పళ్ళూడకొట్టుకోవటానికి ఏ రాయైనా ఒక్కటే
|
| పశువుల పాలు మేపును బట్టి
|
| పశువుల విరివి - పంటకు తేట
|
| పసిపిల్లలు దేవుడితో సమానం
|
| పసిపిల్లలు, తాగుబోతులు నిజం చెబుతారు
|
| పసుపు, కుంకుమల కోసం పది క్రోసులయినా వెళ్ళాలి
|
| పెళ్ళికి బొట్టుపెట్టి పిలిస్తే వెళ్ళక, పెంకుపట్టుకుని వెనుకదారిన పులుసు కోసం వెళ్ళిందట
|
| పాండవుల సంపాదన దుర్యోధనుల వారి పిండాకూళ్ళకు సరి
|
| పాచిన కూరలు బాపనికన్నట్లు
|
| పాచిపండ్లవాడు కూడబెడితే, బంగారు పండ్లవాడు అనుభవించాడట
|
| పాటకు పది ఫణుతులు
|
| పాటిమీద గంగానమ్మకు కూటిమీదే ధ్యాస
|
| పాటుకలిగితే కూటికి కొదువా?
|
| పాటు చేతకానివాడు మాటల మోసగాడు
|
| పాటు పడితేనే భాగ్యం
|
| పాటులెల్ల పొట్టకూటికే
|
| పాడిందే పాడరా పాచిపండ్ల దాసరీ! అన్నట్లు
|
| పాడికి పంట తమ్ముడు
|
| పాడికుండలు పగులకొట్టినట్లు
|
| పాడి గుట్టు - పంట రట్టు
|
| పాడిని దాచాలి - పంటను పొగడాలి
|
| పాడి పసరము, పసిబిడ్డ ఒకటే
|
| పాడువూరికి నక్క తలారి
|
| పాడే నోటికి పాట పండుగ
|
| పాత చింతకాయ పచ్చడి
|
| పాత చుట్టం - పాత చింతకాయపచ్చడి
|
| పాతది పనికి రాదు - కొత్తది కొరగాదు
|
| పాత రోత - కొత్త రుచి
|
| పాత్ర యెరిగి దానం యివ్వాలి - వంశ మెరిగి బిడ్డను తెచ్చుకోవాలి
|
| పానకంలో పుడకలాగా
|
| పానుపు అలవాలిగానీ తనువులు గాదన్నట్లు
|
| పాపమని పాలు పోస్తే, ఒద్దని ఒలకపోశాడట
|
| పాపమని భోజనం పెడితే పక్కలోకి రమ్మన్నాడట
|
| పాపాల భైరవుడు
|
| పాపిట వంకరయితే బ్రతుకంత వంకరే
|
| పాపి సముద్రానికి పోతే అరికాలు తేమ కాలేదుట
|
| పాపిసొమ్ము పరులపాలు - ద్రోహిసొమ్ము దొంగలపాలు
|
| పాపీ చిరాయువు
|
| పాముకాళ్ళు పాముకే ఎరుక
|
| పాముకు పళ్ళలో విషం - జ్ఞాతికి కండ్లలో విషం
|
| పాముకు పాలు పోసినట్లు
|
| పాము చావరాదు - బడిత విరగరాదు
|
| పాము చుట్టము - పడగ పగ
|
| పాము పడగ నీడను కప్ప చందాన
|
| పారే ఏటికి నీరు పండుగ
|
| పాలకొండ లోయల్లో బంతులాట అన్నట్లు
|
| పాలకోసం పొదుగు కోసినట్లు
|
| పాల పొంగు - పడుచు పొంగు
|
| పాలు త్రాగి రొమ్ము గుద్దినట్లు
|
| పాలు పొంగటం పొయ్యిపాలుకే
|
| పిండార బోసినట్లు వెన్నెల
|
| పిండికొద్దీ రొట్టె - తిండికొద్దీ పసరం
|
| పిండి బొమ్మ చేసి ఆడబిడ్డంటే, ఆడబిడ్డ తనాన అదిరదిరి పడిందిట
|
| పిండేవాడు పిండితే పిటుకురాయైనా పాలిస్తుంది
|
| పిచ్చి కుదిరింది, రోకలి తలకు చుట్టమన్నాడట
|
| పిచ్చి కుదిరితే గానీ పెళ్ళికాదు - పెళ్ళి అయితే గానీ పిచ్చి కుదరదు
|
| పిచ్చివాని చేతిలో రాయిలాగా
|
| పిచ్చివాడికి లోకమంతా పిచ్చే
|
| పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం
|
| పిట్టకు పట్టేదెంత?
|
| పిట్టకొంచెము - కూత ఘనము
|
| పిట్టపోరూ పిట్టపోరూ పిల్లి తీర్చినట్లు
|
| పిడుగుకు గొడుగడ్డమా?
|
| పిడుగుకూ, బియ్యానికి ఒకే మంత్రమా?
|
| పిత్త సత్తువ లేదు గానీ పాసనాలకు మందట
|
| పితికే బర్రెను యిచ్చి పొడిచే దున్నను తెచ్చుకున్నట్లు
|
| పిత్తి నేల గోకినట్లు
|
| పిత్తిన ముత్తయిదువవలె
|
| పిదప కాలానికి పిదప బుద్ధులు
|
| పిరికివానికే పిడికెడంత మీసాలు
|
| పిరికివాని బింకంలాగా
|
| పిర్రలు చూసి పీట వేసినట్లు
|
| పిలవని పేరంటానికి వెళ్ళినట్లు
|
| పిలిచి పిల్లనిస్తానంటే వంక పెట్టినట్లు
|
| పిలిచేవారుంటే బిగిసేవారికి కొదువలేదు
|
| పిల్ల ఓపిక శోభనంలో తెలుస్తుందన్నట్లు
|
| పిల్లకాకికేమి తెలుసు ఉండేలు దెబ్బ!
|
| పిల్లకాయ - పిల్లకాకి
|
| పిల్ల గలవాడు పిల్లకేడిస్తే - కాటివాడు కాసుకేడ్చినట్లు
|
| పిల్ల చచ్చినా పురుటి కంపు పోలేదు
|
| పిల్లనిచ్చినవాడు ఈగ - పుచ్చుకున్నవాడు పులి
|
| పిల్ల పిడికెడు - గూనె గంపెడు
|
| పిల్ల ముద్దుగానీ పియ్య ముద్దా!
|
| పిల్లా అని పిలిస్తే పెళ్ళి చేసుకుంటావా అని అడిగిందట
|
| పిల్లి ఎదురైతె తల్లి గూడా శత్రువవుతుంది
|
| పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగుతూ ఎవరూ చూడటం లేదనుకుంటుందట
|
| పిల్లికి ఎలుక సాక్షి
|
| పిల్లికి కూడా భిక్షం పెట్టనట్లు
|
| పిల్లికి చెలగాటం - ఎలుకకు ప్రాణసంకటం
|
| పిల్లికి రొయ్యల మొలత్రాడు కట్టినట్లు
|
| పిల్లి గ్రుడ్డిదయితే ఎలుక ముడ్డి చూపిస్తుంది
|
| పిల్లిని చంకలో పెట్టుకుని పెళ్ళికి వెళ్ళినట్లు
|
| పిల్లిని చంపిన పాపం గుడి కట్టించినా పోదు
|
| పిల్లి పిల్లలను త్రిప్పినట్లు
|
| పిల్లిమెడలో గంట కట్టేదెవరు?
|
| పీటకు పిఱ్ఱకు వైరం
|
| పీట పగిలేటట్లు తిన్నట్లు
|
| పీనుగుమీద పిండాకూడు
|
| పుండుకు పుల్ల మొగుడు
|
| పుండున్నచోటే పుల్ల తగుల్తుంది
|
| పుండు మానినా మచ్చమానదు
|
| పుండుమీద కారం చల్లినట్లు
|
| పుక్కిట పురాణం
|
| పుచ్చుకున్నప్పుడు కొడుకుపుట్టినంత సంతోషం, యిచ్చేటప్పుడు మనిషిపోయినంత బాధ
|
| పుట్టంగ పురుడు - పెరగంగ పెళ్ళి
|
| పుట్టనివాడు, గిట్టినవాడు పుణ్యాత్ములు
|
| పుట్టమన్ను వేస్తే పుట్లకొద్దీ పంట
|
| పుట్టమీద తేలుకుడితే నాగుపాము కరచినట్లే
|
| పుట్టి చచ్చినా కొడుకే మేలు
|
| పుట్టినవాడు గిట్టక మానడు
|
| పుట్టి మునిగినట్లు
|
| పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదు
|
| పుట్టెడు అప్పులు
|
| పుట్టెడు నువ్వుల్లోపడి దొర్లినా అంటేగింజే అంటుతుందిగానీ అంటనిది అంటదు
|
| పుడుతూ పుత్రులు - పెరుగుతూ శత్రువులు
|
| పుణ్యంకొద్దీ పురుషుడు - దానంకొద్దీ బిడ్డలు
|
| పుణ్యంకొద్దీ పురుషుడు - విత్తంకొద్దీ వైభవం
|
| పుణ్యం పుట్టెడు - పురుగులు తట్టెడు
|
| పుణ్యానికి పిలిచి కొలిస్తే పిచ్చికుంచమని పారపోశాడట
|
| పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్లు
|
| పుబ్బ ఉబ్బిబ్బి కురిసినా చెట్టు క్రింద గడ్డనానదు
|
| పుబ్బ రేగినా బూతురేగినా నిలువవు
|
| పుబ్బలో చల్లినా, బూడిదలో చల్లినా ఒక్కటే
|
| పుబ్బలో చల్లేదానికంటే దిబ్బలో చల్లేది మేలు
|
| పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లు
|
| పురిటిలోనే సంధి కొట్టినట్టు
|
| పురుషుల భాగ్యం - పడతుల సౌఖ్యం
|
| పురుషులందు పుణ్య పురుషులు వేరయా!
|
| పుర్రెకొక తెగులు
|
| పుర్రెకొక బుద్ధి - జిహ్వకొక రుచి
|
| పూచిన పువ్వంతా కాయలైతే చెట్టు మనునా?
|
| పులి కడుపున పిల్లులు పుడతాయా?
|
| పులిని చూచి నక్క వాత పెట్టుకొన్నట్లు
|
| పులిమీద పుట్రలాగా
|
| పులి మీసాలతో ఉయ్యాల ఊగినట్లు
|
| పుల్లయ్య వేమారం వెళ్ళి వచ్చినట్లు
|
| పువ్వులమ్మిన చోటే కట్టెలమ్మినట్లు
|
| పువ్వులా విచ్చుకుంటా తుమ్మెదలా దోచుకో అందట
|
| పుష్యమాసంలో పూసలు గ్రుచ్చ పొద్దుండదు
|
| పుష్యమాసానికి పూసంత వేసంగి
|
| పుష్యమి కురిస్తే పిట్టకూడా తడవదు
|
| పూచింది పుడమంత - కాచింది గంపంత
|
| పూజకన్నా బుద్ధి - మాటకన్నా మనసు ప్రధానం
|
| పూటకూళ్ళమ్మకు పుణ్యంతో పని లేదు
|
| పూటకూళ్ళింటి తిండిలాగా
|
| పూట గడుస్తుందిగానీ మాట నిలచిపోతుంది
|
| పూనినకర్మ పొరుగూరు పోయినా తప్పదు
|
| పూబోడీ అంటే, ఎవర్రా బోడి? నీ అమ్మబోడి, నీ అక్కబోడి అందట
|
| పూర్ణం లేని బూరె - వీరణంలేని పెళ్ళి
|
| పూవు పుట్టగానే పరిమళిస్తుంది
|
| పూవు పుట్టగానే తెలుస్తుంది కళ
|
| పెంటకొద్దీ పంట
|
| పెట్టకపోయినా పెట్టే యిల్లు చూపమన్నారు
|
| పెట్టగతులు లేకున్న పుట్టగతులు వుండవు
|
| పెట్టనమ్మ పెట్టనే పెట్టదు పెట్టే ముండ కేమొచ్చింది రోగం అన్నాడట
|
| పెట్టి దెప్పితివో - పెద్దల తిడితివో
|
| పెట్టినదే తనది - కూడ బెట్టినది యితరులది
|
| పెట్టినమ్మ పుణ్యాన - పెట్టనమ్మ పాపాన
|
| పెట్టి పొయ్యనమ్మ కొట్టవచ్చిందిట
|
| పెట్టు చుట్టం - తిట్టు పగ
|
| పెట్టుబడిలేని సేద్యం - చద్దిలేని పయనం
|
| పెడతానంటే ఆశ - కొడతానంటే భయం
|
| పెడితే తింటారుగానీ తిడితే పడతారా?
|
| పెడితే పెళ్ళి పెట్టకపోతే పెటాకులు
|
| పెత్తనానికి పోతే దుత్త చేతికొస్తుంది
|
| పెదవి దాటితే పృథ్వి దాటుతుంది
|
| పెదవీ పెదవి కలిస్తే మధువులు - ఒంపూ సొంపూ దక్కితే శోభనం
|
| పెదవుల పరిచయం ఎదలకు పరిణయం అన్నట్లు
|
| పెదవుల మధువులు, కౌగిలి విందులు మల్లెల జాతరలో అందట
|
| పెదవుల రుచి పెదవులకే తెలుసన్నట్లు
|
| పెదాలమ్మ వేటలో అలుపుండదన్నట్లు
|
| పెద్ద యింటి గోత్రాలు దేవుడి కెరుక
|
| పెద్ద యింటి రంకు, పెద్ద చెరువు కంపు తెలియవు
|
| పెద్ద యింటి భాగోతం
|
| పెద్దలమాట చద్దిమూట
|
| పెద్దలు లేని యిల్లు - సిద్ధులు లేని మఠము
|
| పెనము మీదనుంచీ పొయ్యిలో పడ్డట్లు
|
| పెరటిచెట్టు మందుకు పనికిరాదు
|
| పెరుగుట విరుగుట కొరకే
|
| పెరుగుతూ పెరుగుతూ పెదబావ కోతి అయినట్లు
|
| పెళ్ళంటే నూరేళ్ళ పంట
|
| పెళ్ళాం పోతే పురుషుడు మళ్ళీ పెండ్లికొడుకు
|
| పెళ్ళి అయిన యింటిలో ఆరునెలలు కరువు
|
| పెళ్ళి ఒకరితో శోభనం మరొకరితో అన్నట్లు
|
| పెళ్ళికి పోతూ పిల్లిని చంకన పెట్టుకొని పోయినట్లు
|
| పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా పెళ్ళికూతుర్లేనా?
|
| పెళ్ళికి వచ్చినవారే చేస్తారు పెళ్ళి పనులు, పెళ్ళామా! నీ ఒళ్ళు అలిపించుకోకు అన్నాడట
|
పెళ్ళికొడుకు కుడికాలు చూచి అత్త ఏడుస్తుంటే,
ఏడ్పులో ఏడ్పు ఎడమకాలూ చూడమన్నాడట తోడపెండ్లికొడుకు
|
| పెళ్ళికొడుకు మావాడేగానీ, చెవి పోగులు మాత్రం మావిగావు అన్నట్లు
|
| పెళ్ళినాటి పప్పుకూడు రోజూ దొరుకుతుందా?
|
| పెళ్ళినాడే పరగడుపన్నట్లు
|
| పెళ్ళిని చూస్తూ ఒకడుంటే, పెళ్ళాన్ని చూస్తూ ఒకడున్నాడట
|
| పెళ్ళీ - పెటాకులు
|
| పెళ్ళిలో పుస్తె కట్టడం మరచిపోయినట్లు
|
| పేదకు పెన్నిధి దొరికినట్లు
|
| పేదవాడి పెళ్ళాం వాడకెల్లా వదిన
|
| పేదవాణ్ణి చూస్తే పేలాలు త్రుళ్ళుతాయి
|
| పేదవాని కోపం పెదవికి చేటు
|
| పేనుకు పెత్తనమిస్తే తలంతా తెగ గొరిగిందట
|
| పేరు ఒకరిది - నోరు ఒకరిది
|
| పేరు ఒకరిది - పెత్తనమొకరిది
|
| పేరు ఒకరిది - సౌఖ్యమొకరిది
|
| పేరుకే పెద్దరికం - బానిస బ్రతుకు
|
| పేరు గొప్ప - ఊరు దిబ్బ
|
| పేరు పల్లకీ మీద - కాలు నేల మీద
|
| పేరు పెండ్లివారిది - తిండి యింటివారిది
|
| పేరులేని వ్యాధికి పెన్నేరు మందన్నట్లు
|
| పైన పటారం - లోన లొటారం
|
| పైనబడ్డా నేనే గెలిచానన్నట్లు
|
| పైపనీ, క్రింద పనీ నేను చూచుకుంటా సహకరించు అన్నాడట
|
| పైపై పనేనా అసలు పనేమైనా వుందా అని అందిట
|
| పైరుగాలి తగిలితే పంటకు ఏపు
|
| పైరుకు ముదురు - పసరానికి లేత
|
| పైసాకూ, ప్రాణానికి లంకె
|
| పైసాలో పరమాత్ముడు
|
| పొంకణాల పోతురెడ్డికి ముప్పై మూడు దొడ్లు - మూడు ఎడ్లు
|
| పొంగినదంతా పొయ్యిపాలే
|
| పొంగే పాలను వూదరాదు - వెలిగే దీపాన్ని ఆర్పరాదు
|
| పొంగే యౌవ్వనం కౌగిళ్ళపాలు అన్నట్లు
|
| పొగచుట్టకు, పడతి యోనికి ఎంగిలి లేదు
|
| పొగాకు కొనుక్కోవాలి అందలం బయటపెట్టరా అన్నాడట
|
| పొట్టకిచ్చినా, బట్టకిచ్చినా భూమాతే యివ్వాలి
|
| పొట్టకోస్తే అక్షరం ముక్క లేదన్నట్లు
|
| పొట్టి గట్టి
|
| పొట్టివానికి పుట్టెడు బుద్ధులు
|
| పొట్లచెట్టుకు పొరుగు గిట్టదు
|
| పొడుగు లొడుగు
|
| పొత్తుల మగడు పుచ్చిచస్తాడు
|
| పొదుగు కోసి పాలు త్రాగినట్లు
|
| పొదుగులేని ఆవు పాలిస్తే నాలుకలేని పిల్లి నాకి పోయిందట
|
| పొద్దు తిరుగుడు - డొంక తిరుగుడు
|
| పొద్దు గడిచిపోతుంది మాట నిలిచిపోతుంది
|
| పొద్దున్నే వచ్చిన వాన - ప్రొద్దుగూకి వచ్చిన చుట్టం పోరు
|
| పొమ్మన లేక పొగ పెట్టినట్లు
|
| పొయ్యి ఊదిందంటే బంధువుల రాక
|
| పొయ్యిలో పిల్లి లేవలేదు
|
| పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదు అన్నాడట
|
| పొరుగమ్మ సరిపెట్టుకుంటే - ఇరుగమ్మ ఉరిపెట్టుకుంది
|
| పొరుగింట చూడరా నా పెద్ద చెయ్యి
|
| పొరుగింటి కలహం వినవేడుక
|
| పొరుగింటి జగడం చూడవేడుక
|
| పొరుగింటి పుల్లకూర రుచి
|
| పొరుగింటి పొయ్యి మండితే తన పొయ్యిలో నీళ్ళు పోసుకున్నట్లు
|
| పొరుగూరి వ్యవసాయం - ఇద్దరు భార్యల సంసారం ఒక్కటే
|
| పోకముడి విప్పుతూ కోక వెల అడిగినట్లు
|
| పోచికోలు వాగుడు
|
| పోనున్నది పోకమానదు
|
| పోయిన నీటికి కట్ట కట్టినట్లు
|
| పోయిన మగడు పోయినా పొన్నకాయలాంటి గుండు దొరికిందన్నదట
|
| పోయే కాలానికి కాని బుద్ధి
|
| పోరాని చోట్లకు పోతే రారాని నిందలు వచ్చినట్లు
|
| పోరిన పొరుగు - దాచిన కుండలు మనవు
|
| పోరుకు సిద్ధమయితే పోటుకు సిద్ధం అన్నాడట
|
| పోరు నష్టం -పొందులాభం
|
| పోలీ! పోలీ! నీ భోగమెన్నాళ్ళే అంటే మాఅత్త మాలవాడనుండి వచ్చేదాకా అన్నదట
|
| ప్రజల మాట ప్రభువుకు కోట
|
| ప్రజలే ప్రభువుకు అండ
|
| ప్రదక్షిణాలు చేస్తూ కడుపు చూచుకున్నదట
|
| ప్రమిదలో వత్తేసి కళ్ళలో దీపాలు వెలిగించు అందిట
|
| ప్రయాణం అబద్ధం - ప్రసాదం నిబద్ధం
|
| ప్రసూతి వైరాగ్యం పురిటి పచ్చి ఆరేదాకానే
|
| ప్రాణముంటే భయంలేదు
|
| ప్రాణముంటే శివం - ప్రాణం పోతే శవం
|
| ప్రాణం పోయినా మానం పోరాదు
|
| ప్రాణం వున్నప్పుడే పంతాలు నెరవేరుతాయి
|
| ప్రాయాన పుట్టిన కొడుకు
|
| ప్రాస కోసమేడ్చానే కూసుముండా అన్నట్లు
|
| ప్రియం మహాలక్ష్మి - చౌక శనేశ్వరం
|
| ప్రీతితో పెట్టింది పట్టెడయినా చాలు
|
| ప్రేమలో పడ్డవారు ఎంతకైనా తెగిస్తారు
|
| ప్రేమలేని మాట పెదవి పైనే
|