| నంగనాచి తుంగబుఱ్ఱ
|
| నంగిమాటల వాడినీ - దొంగ చూపుల వాడినీ నమ్మరాదు
|
| నందనవనంలో నాగుపామున్నట్లు
|
| నంది అంటే పంది అన్నట్లు
|
| నందిని చేయబోయి పందిని చేసినట్లు
|
| నందిని పంది - పందిని నంది చేయగలిగినవాడు
|
| నంబి కవిత్వం - తంబళ్ళ జోస్యం
|
| నంబివాడు ఎదురైనా నాగుపాము ఎదురైనా కలిసిరావు
|
| నంబీ నంబీ నా పెళ్ళికేమి సహాయం చేస్తావంటే నీ పెళ్ళికి ఎదురు రాను పో! అన్నాడట
|
| నక్క ఎక్కడ నాగలోక మెక్కడ?
|
| నక్క జిత్తులన్నీ నాదగ్గరుండగా తప్పించుకుపోయెరా తాబేటిబుఱ్ఱ
|
| నక్క జిత్తులవాడు
|
| నక్కను చూచిన వేటగాడిలాగా
|
| నక్కను త్రొక్కి వచ్చినట్లు
|
| నక్కపుట్టి నాలుగు వారాలు కాలేదు - నేనింత ఉప్పెన ఎన్నడూ చూడలే దన్నదట
|
| నక్క పోయిన తర్వాత బొక్క కొట్టుకున్నట్లు
|
| నక్కలు బొక్కలు వెదుకును
|
| నక్క వినయం - కొంగ జపం
|
| నగుబాట్ల పెళ్ళికి పెళ్ళినాడే నాగవల్లి అన్నట్లు
|
| నట్టేట పుట్టి ముంచినట్లు
|
| నట్టేట చేయి విడిచినట్లు
|
| నట్టేట పడ్డ సొమ్ము నట్టింటికి నడిచి వచ్చినట్లు
|
| నడిచే దారిలో గడ్డి మొలుస్తుందా?
|
| నడచినవాడే పడేది
|
| నడమంత్రపు సిరి
|
| నడమంత్రపు సిరికి నెత్తిమీద కళ్ళు
|
| నడమంత్రపు సిరి, నరంమీద పుండూ రెండూ ఒక్కటే
|
| నడమంత్రపు సిరి వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట
|
| నడమంత్రపు సిరి వస్తే నడుము లిరుగ పడ్డట్లు
|
| నడిరాత్రి దుప్పట్లో యౌవ్వన మద్దెల మోతలన్నట్లు
|
| నడువగా నడువగా పైగుడ్డే బరువు
|
| నడుము మునిగేదాకానే చలి - నలుగురూ వినేదాకానే సిగ్గు
|
| నత్తగుల్లలన్నీ ఒకచోట - ముత్యపు చిప్పలన్నీ ఒకచోట
|
| నన్ను ఎరిగినవాడు లేకపోతే నా బడాయి చూడమన్నట్లు
|
| నన్ను ముట్టుకోకు నా మాలకాకీ అన్నట్లు
|
| నపుంసకునికి రంభ దొరికినట్లు
|
| నమిలేవాడికన్నా మింగినవాడే ఘనుడు
|
| నమ్మకానికి రాయబారమెందుకు?
|
| నమ్మించి గొంతు కోసినట్లు
|
| నయము నష్టకారి - భయము భాగ్యకారి
|
| నయాన కాని పని భయాన అవుతుంది
|
| నరకానికి నవ ద్వారాలు - స్వర్గానికి ఒక్కటే
|
| నరములేని నాలుక ఎటైనా తిరుగుతుంది
|
| నరునికి నాలుగు దశలు
|
| నల భీమ పాకములు
|
| నలిగి వున్నప్పుడు తొలగి వుండమన్నారు
|
| నలుగురితో చావు పెళ్ళిలాంటిది
|
నలుగురి తర్వాత ఆడపిల్ల పుడితే నట్టింట బంగారం -
ముగ్గురి తర్వాత ఆడపిల్ల పుడితే ముయ్య మూకుళ్ళుండవు
|
| నలుగురితో పాటు నారాయణా!
|
| నలుగురూ నడిచే దారే నడవాలి
|
| నలుగురూ నడిచిందే బాట - పలికిందే మాట
|
| నలుగురూ వినేదాకానే సిగ్గు
|
| నలుపు నారాయణ స్వరూపం
|
| నలుపో తెలుపో నలుగురు పిల్లలు - ముతకో సన్నమో నాలుగు చీరలు
|
| నల్ల బంగారం యిస్తా సాన పెట్తావా అందిట
|
| నల్లబాపడు నాభికంటే విషం
|
| నల్లేరు మీద బండిలాగా
|
| నవరత్నాలున్నా నారీరత్నం వుండాలి
|
| నవాబు పొట్టకూ, తమలపాకు కట్టకూ ఎప్పుడూ తడుపు కావాలి
|
| నవ్వలేని వారిని నమ్మరాదు
|
| నవ్వు నాలుగిందాల చేటు
|
| నవ్విన నాపచేనే పండుతుంది
|
| నవ్వే ఆడదాన్నీ - ఏడ్చే మగవాణ్ణీ నమ్మరాదు
|
| నష్టపడ్డా భ్రష్టు కారాదు
|
| నాకు లేక ఆకులు నాకుతుంటే నీకెక్కడ పెట్టేది?
|
| నా కోడీ, కుంపటీ లేకుంటే ఎలా తెల్లారుతుందో, నిప్పెట్లా దొరుకుతుందో చూస్తానందట
|
| నాగరికంలేని మాట నాలుక తీట
|
| నాగలోకానికీ నక్కకూ పోలికా?
|
| నా చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నాడట
|
| నా చేను నీకు రాసిస్తా దున్నుకుని పంట పండిస్తావా? అని అడిగిందట
|
| నాజూకు నయగారాలు - వలపు వయ్యరాలు
|
| నాటిన పైరుకు నష్టం లేదు
|
| నాడా దొరికింది - యిక గుర్రం కొందామన్నట్లు
|
| నాతి బలం నాలుకే
|
| నాతోనే అంతా వున్నది అన్నట్లు
|
| నాది కాదు - నా అత్త సొమ్ము అన్నట్లు
|
| నా దెబ్బకు గోలకొండ కూడా అబ్బా అంటుంది
|
| నానాటికీ తీసికట్టు నాగంభొట్లు
|
| నా నోట్లో నీ వేలు పెట్టు - నీ కంట్లో నా వేలు పెడతా అన్నట్లు
|
| నా పాతివ్రత్యం గూర్చి నా మొదటి మొగుణ్ని అడగరా రెండో మగడా అందిట
|
| నా పెనిమిటికి లేనిది నీకుంది అందుకే నీ పక్కలోకొచ్చా అందిట
|
| నామాలవారే గానీ, నియమాలవారే లేరు
|
| నా మొగుడికే పసవుంటే నీ దగ్గరెందుకు పడుకుంటానని అందిట
|
| నాయనకు పెళ్ళి సంబరం - అమ్మకు సవతి సంకటం
|
| నారి తెగినా కష్టమే - నారి తిరిగినా కష్టమే
|
| నారు పోసినవాడే నీరూ పోస్తాడు
|
| నాలిముచ్చు వెధవనీ, నీళ్ళు నమిలేవాణ్నీ నమ్మరాదు
|
| నాలుక కటువు - ఎద మెత్తన
|
| నాలుక వుంటే అన్ని దిక్కులూ తిరుగగలడు
|
| నాలుక దాటితే నరకము
|
| నాలుక మీద తేనె - మనసులో విషం
|
| నాలుకా! నాలుకా! వీపుకు దెబ్బలు తేకే
|
| నా వ్రేలితో నా కన్నే పొడిచినట్లు
|
| నాశనమూ - నల్ల బొగ్గులూ
|
| నా సింగారం చూడరా నా బంగారు మగడా! అన్నట్లు
|
| నిండా మునిగిన వానికి చలేమిటి?
|
| నిండిన కడుపుకు అన్నం - బట్టతలకు నూనె అన్నట్లు
|
| నిండిన కడుపుకు నిక్కెక్కువ
|
| నిండిన కడుపు నీతి వినదు
|
| నిండు కుండ తొణకదు
|
| నిండుటేరు నిలిచి పారుతుంది
|
| నింద లేనిదే బొంది పోదు
|
| నింద వస్తుంది గానీ అవమానం రాదు
|
| నిజం మాట్లాడితే ఉన్న ఊరు అచ్చిరాదు
|
| నిజం మాట్లాడితే నిష్ఠూరం
|
| నిజం కురచ - బొంకు పొడవు
|
| నిజం నిలకడ మీద తెలుస్తుంది
|
| నిజమైన బంగారం నిప్పుకు వెరవదు
|
| నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయి
|
| నిత్య కళ్యాణం పచ్చతోరణం
|
| నిత్య దరిద్రుడు నిశ్చింత పురుషుడు
|
| నిద్రపోతున్నవాడిని లేపగలంగానీ, మేలుకొని నిద్ర నటిస్తున్నవాడిని లేపగలమా?
|
| నిదానమే ప్రధానం
|
| నిన్న ఉన్నవాడు నేడు లేడు
|
| నిప్పుకు చెదలంటుతుందా?
|
| నిప్పుకూ నీటికీ ఉన్నంత స్నేహం
|
| నిప్పు త్రొక్కిన కోతిలాగా
|
| నిప్పు ముట్టనిదే చేయి కాలదు
|
| నిప్పు లేనిదే పొగరాదు
|
| నిప్పులో ఉప్పు వేసినట్లు
|
| నిమ్మకు నీరెత్తినట్లు
|
| నియమం కోసం నామం పెడితే, నామం నా కొంపముంచింది అన్నట్లు
|
| నియోగి నిక్కులు
|
| నియోగపు ముష్టికి బనారసు సంచి
|
| నిర్భాగ్యపు దామోదరుడికి అభాగ్యపుటల్లుడు
|
| నిలకడ లేని మాట నీళ్ళ మూట
|
| నిలుచోటానికి చోటిస్తే పడగ్గది ఎక్కడన్నాడట
|
| నివురు కప్పిన నిప్పువలె
|
| నిష్ఠ నీళ్ళపాలు - మంత్రం మాలలపాలు
|
| నిష్ఠ మాలలపాలు - మానం సాయిబుపాలు
|
| నీ ఎడమ చెయ్యి తియ్యి - నా పురచెయ్యి పెడతాను అన్నట్లు
|
| నీకు ఎక్కడ సంశయమో, నాకూ అక్కడే సందేహం
|
| నీ కూడు తింటూ, నీ బట్ట కడుతూ, నాతో కాపురం చెయ్యి అన్నట్లు
|
| నీకు బెబ్బెబ్బే - నీ యబ్బకు బెబ్బెబ్బే
|
| నీకో దణ్ణం - నీ పెద్దకొక దణ్ణం
|
| నీకోసం పుట్టా, నీకోసం పూచా, దొరలా దోచుకో అందట
|
| నీటికి కలువ - మాటకు చలువ
|
| నీటికి నాచు తెగులు - మాటకు మాట తెగులు
|
| నీటికి నాచు తెగులు - నాతికి రంకు తెగులు
|
| నీటిలో జాడలు వెతికినట్లు
|
| నీడలకు నోళ్ళుంటాయి
|
| నీతో కాపురం ఒంటికి కంపరం అన్నట్లు
|
| నీతి లేనివాడు కోతికంటే పాడు
|
| నీతి లేని మాట రాతి వేటు
|
| నీతోడిదే లోకం అన్నట్లు
|
| నీ పప్పు నా పొట్టు కలిపి ఊదుకు తిందాం రా! అన్నట్లు
|
| నీ పెండ్లాం ముండమొయ్యా!
|
| నీ పెండ్లి ఎట్లాగో పాడయింది, నా పెండ్లికి రా అన్నాడట
|
| నీరు వుంటేనే పల్లె - నారి వుంటేనే యిల్లు
|
| నీరు పల్లమెరుగు - నిజం దేముడెరుగు
|
| నీటి మూటలు - గాలి మాటలు
|
| నీళ్ళ మూట - వంచకుడి మాట ఒక్కటే
|
| నీళ్ళు లేని పైరు - నూనె లేని జుట్టు
|
| నీవు ఒక అందుకుపోస్తే, నేను ఒకందుకు తాగుతున్నా
|
| నీతల్లో తేజమ్మ
|
| నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష
|
| నీవు పాడిందానికీ, నేను విన్నదానికి సరి. తలవూపిన దానికి తంబూర పెట్టిపో! అన్నట్లు
|
| నీ సరి వేల్పులు - నా సరి దాసులు లేరు
|
| నీ సొమ్ము ఆదివారం - నా సొమ్ము సోమవారం
|
| నుదుట వ్రాయనిదే నోటరాదు
|
| నుయ్యి తియ్యబోతే భూతం బయటపడ్డట్లు
|
| నువ్వు దంచుతూ వుండు - నేను పక్కలెగరేస్తాను అన్నట్లు
|
| నూటికీ కోటికీ ఒకడు
|
| నూటికి పెట్టి కోటికి గొరిగినట్లు
|
| నూతి కప్పకు సముద్రపు సంగతేం తెలుస్తుంది?
|
| నూరు అబద్ధాలాడి అయినా ఒక యిల్లు నిలుపమన్నారు
|
| నూరు కీళ్ళు ఓరిస్తేగానీ ఒక మేలు దక్కదు
|
| నూరు కొరడా దెబ్బలైనా ఒక బొబ్బట్టుకు సరిరావు
|
| నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుంది
|
| నూరు నోములు ఒక్క రంకుతో సరి
|
| నూరు మాటలు ఒక వ్రాతకు సరికావు
|
| నూరేళ్ళు వచ్చినా నుదుటి వ్రాతే గతి
|
| నెత్తి కాలనిదే జోలె నిండదు
|
| నెత్తిన నోరుంటే పెత్తనం సాగుతుంది
|
| నెత్తీబోడి తిత్తీబోడి, తిరుపతికెందుకు?
|
| నెమలి కంటినీరు వేటగానికి ముద్దా?
|
| నెమలిని చూచి నక్క నాట్యమాడినట్లు
|
| నెయ్యానికైనా - వియ్యానికైనా - కయ్యానికైనా సమానంగావుండాలి
|
| నెల తక్కువైనా రాజింట పుట్టాలి
|
| నెల తక్కువైనా మగవాడిగా పుట్టాలి
|
| నెల బాలుడికి నూలు పోగన్నట్లు
|
| నేడు చస్తే రేపటికి రెండు
|
| నేతి కుండను నేలబెట్టి, ఉత్త కుండను ఉట్టి మీద పెట్టినట్లు
|
| నేతి బీరకాయలాగా
|
| నేను పుట్టకపోతే నువ్వెవరిని పెళ్ళి చేసుకునేవాడివని అడిగితే, నీతల్లిని పెళ్ళాడేవాడిని అన్నాడట
|
| నేను వెళితే లేదుగానీ నా పేర చీటీ పంపితే పని జరుగుతుందా?
|
| నేర్చి చెప్పిన మాట నెరవాది మాట
|
| నేర్చినమ్మ ఏడ్చినా బాగానే వుంటుంది
|
| నేర్చిన బుద్ధి ఏడ్చినా పోదు
|
| నేలచూపు పోతే వాలుచూపు సై అంటుంది
|
| నేలది తీసి నెత్తికి రాసుకున్నట్లు
|
| నేలరాయి నెత్తికెత్తుకున్నట్లు
|
| నేల విడిచి సాము - నీరు విడిచి ఈత
|
| నేసేవాణ్ని నమ్ముకుని పొలిమేర జగడం ఒప్పుకోరాదు
|
| నొప్పించక తా నొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు
|
| నొసట పళ్ళు - నోట్లో కళ్ళు లేవు
|
| నొసట నామాలు - నోట్లో బూతులు
|
| నొసట వ్రాసిన వ్రాతని చెరిపే దెవరు?
|
| నోటి తీట పొట్టకు చేటు
|
| నోటికి, చేతికి చీకటి లేదు
|
| నోటితో లేదనేది చేతితో లేదంటే సరి
|
| నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించినట్లు
|
| నోట్లో నువ్వుగింజ దాగదు
|
| నోట్లో ముద్ద గూట్లో దీపం
|
| నోట్లో వేలు పెట్టినా కరవలేని నంగనాచి
|
| నోరు అప్పాల పిండి - చెయ్యి బలుసు ముల్లు
|
| నోరుంటే ఊరుంటుంది
|
| నోరున్న తలగాచును
|
| నోరున్నవాడిదే రాజ్యం
|
| నోరు చేసే అఘాయిత్యాన్ని పొట్ట భరించలేదు
|
| నోరు నవ్వటం - నొసలు వెక్కిరించటం
|
| నోరు మంచిదయితే ఊరు మంచిది
|
| నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరించినట్లు
|
| నోరు మూస్తే మూగ - నోరు తెరిస్తే గయ్యాళి
|
| న్యాయదేవత వింటుందేగానీ చూడలేదు
|
| న్యాయానికి కూడు లేదు
|
| న్యాయానికి రోజులు లేవు
|
| న్యాయాన్ని రక్షిస్తే, అది నిన్ను రక్షిస్తుంది
|
| న్యాయదేవత కళ్ళు విప్పనంతవరకే అన్యాయం ఆగడాలు
|