| ఒంటరి వాని పాటు యింటికి రాదు
|
| ఒంటి కంటే జంట మేలు
|
| ఒంటికి ఓర్వలేనమ్మ రెంటికి ఓరుస్తుందా?
|
| ఒంటి చేతి దాహం - ఒక నాలి పొందు తనివి తీరవు
|
| ఒంటి మీద బట్టలు తొలగకుండా శృంగారం సాగిద్దాం రారా అందట
|
| ఒంటెద్దు సేద్యం - ఒరిగాలు నొప్పి
|
| ఒంటేలుకు పోతే రెండు వేళ్ళకు వచ్చిందట
|
| ఒక ఊరి కరణం యింకొక వూరికి వెట్టి
|
| ఒక ఒరలో రెండు కత్తు లిముడునా?
|
| ఒక కంట పాలు - ఒక కంట నీరు
|
| ఒక కంట సున్నం - మరో కంట వెన్న
|
| ఒక కన్ను కన్నూ కాదు - ఒక కొడుకు కొడుకూ కాదు - ఒక చెట్టు తోపూ కాదు
|
| ఒక కొప్పులో రెండు జడలిమడవు
|
| ఒక చెట్టు కాయలే ఒకటిగా వుండవు
|
| ఒక చెయ్యి తట్టితే చప్పుడవుతుందా?
|
| ఒక చేతి వ్రేళ్ళు ఒకటిగా ఉండవు
|
| ఒకడికున్నదని ఏడిస్తే ఒక కన్ను పోయింది - తనకు లేదని ఏడిస్తే రెండో కన్ను పోయింది
|
| ఒకడిని చూస్తే పెట్టబుద్ధి - ఉంకొకడిని చూస్తే మెట్టబుద్ధి
|
| ఒకడి పాటు - పదిమంది సాపాటు
|
| ఒకడు తిమి - ఇంకొకడు తిమింగలము
|
| ఒకనాటి పెళ్ళికి ముఖమంతా కాటుకన్నట్లు
|
| ఒకనాటి భాగోతానికి మూతి మీసాలు గొరిగించుకున్నట్లు
|
| ఒకనాటి సుఖం - ఆరు నెలల కష్టం
|
| ఒకనాడు ధారణ - ఒకనాడు పారణ
|
| ఒక పుట్టలో పెడితే వెయ్యి పుట్టల్లోంచి పైకి వచ్చినట్లు
|
| ఒక పూట తిన్నమ్మ ఓర్చుకుంటే ముప్పొద్దులా మెక్కినమ్మ మూర్ఛపోయిందట
|
| ఒకరి కలిమి వేరొకరికి యేడ్పు
|
| ఒకరికి పుట్టి - కొందరికి పుట్టి - అర్ధరాత్రి అందరికీ పుట్టినట్లు
|
| ఒకరిద్దరిని చంపితేగానీ వైద్యుడు కాలేడు
|
| ఒకరికైతే ఓపినంత - తనదైతే తగరమంత
|
| ఒకరు యేటికి తీస్తే మరొకరు కాటికి తీసినట్లు
|
| ఒకరేం పెట్ట - మనమేం తిన - వండుకునేదాకా వుండవే ఓ మనసా! అన్నట్లు
|
| ఒక వూరికి వేయి త్రోవలు
|
| ఒకే జోడు అందరికీ సరిపోతుందా?
|
| ఒకే తొడిమ - రెండు కాయలు
|
| ఒకే దెబ్బకు రెండు పిట్టలు
|
| ఒక పుస్తె తెగితే వేయి పుస్తెలల్లాడతాయి
|
| ఒక్కొక్క చినుకే వాన అవుతుంది
|
| ఒక్కొక్క రాయి తీస్తుంటే కొండ అయినా తరుగుతుంది
|
| ఒదిగేవారేగానీ, తీర్చేవారుండరు
|
| ఒట్టు పోయి గట్టెక్కే - తాను పోయి చెట్టెక్కె
|
| ఒడిలో పెడుదునా? దడిలో పెడుదునా? అన్నట్లు
|
| ఒయ్యరం ఊఁ అంటే సింగారం ఎరుపెక్కిందిట
|
| ఒరుపు కోరుస్తారుగానీ తడుపు కోర్వరు
|
| ఒల్లని మగనికి తలంబ్రాలు పోసినట్లు
|
| ఒళ్ళు వంగనమ్మ కాలిమట్టెలకు కందిపోయిందట
|
| ఒళ్ళు వంగనివాడు దొంగలలో కలిసినాడట
|
| ఒళ్ళు వంగనివారికి ఊరు అచ్చిరాదు
|
| ఒళ్ళెరుగని శివము - మనసెరుగని కల్ల వుంటుందా?
|
| ఓంకారంలేని మంత్రం - అధికారంలేని హోదా ఒకటే
|
| ఓనమాలు రానివాడు లెక్కలు వేసినట్లు
|
| ఓటి కుండలో నీళ్ళు
|
| ఓడ ఎక్కేదాకా ఓడమల్లయ్య - ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య
|
| ఓడలు బండ్లు - బండ్లు ఓడలు అవుతాయి
|
| ఓడు ఓడంటే మొత్తమంతా ఓడన్నట్లు
|
| ఓదార్చేకొద్దీ యేడ్చే బిడ్డవంటివి కష్టాలు
|
| ఓనమాలే ఋక్కులు, ఒక్కటీ రెండే లెక్కలు
|
| ఓపని వాడు కోరందీ, ఒంటరివాడు ఆడనిదీ లేదు
|
| ఓపని వారికి వద్దన్నవారే తల్లిదండ్రులు
|
| ఓపలేని అత్తకు వంకలేని కోడలు
|
| ఓర్చలేనమ్మ ఓడిన నిప్పులు కట్టుకుంటే ఒడీ, దడీ కాలినవట
|
| ఓర్చితే ఓరుగల్లు పట్టణమవుతుంది
|
| ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెళ్ళి చేసుకుంటే, కుండలన్నీ పగలగొట్టిందట
|
| ఓలీ! ఓలీ! నీవు వడ్లు దంచు, నేను పక్కలెగరేస్తాను అన్నట్లు
|
| ఔననటానికీ, కాదనటానికీ అత్తకు అధికారం గానీ కోడలికేం వుంటుంది?
|
| ఔను - కాదు అనే మాటలెంత చిన్నవో వాటిని అనటం అంత కష్టం
|
| ఔషధానికీ అపథ్యానికీ చెల్లు - రోగం పైపెచ్చు
|