| భాష | సామెతలు |
|
| అంకపొంకాలు లేనిది శివలింగం |
| అంకెకు రాని ఆలిని ఆరుగురు బిడ్డల తల్లయినా విడవాలి |
| అంకెకు రాని ఆలి - కీలెడలిన కాలు |
| అంగటి వీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టావురా కొడకా అన్నట్లు |
| అంగట్లో అన్నీ వున్నాయి అల్లుని నోట్లో శని |
| అంగట్లో అరువు - తల మీద బరువు |
| అంగట్లో అష్ట భాగ్యం - అల్లుని నోట్లో అష్ట దరిద్రం |
| అంగట్లో ఎక్కువైతే ముంగిట్లో కొస్తుంది |
| అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు |
| అంగడి బియ్యం - తంగేటి కట్టెలు |
| అంగరక్ష లెన్నివున్నా శ్రీరామరక్ష వుండాలి |
| అంగిట బెల్లం - ఆత్మలో విషం |
| అంగిట విషం - మున్నాలిక తియ్యదనం |
| అంచుడాబేగానీ పంచడాబు లేదన్నట్లు |
| అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు |
| అంటుకోను ఆముదం లేకుంటే మీసాలకు సంపెంగ నూనెట |
| అంటే ఆరడి - అనకుంటే అలుసు |
| అండలుంటే కొండలు దాటవచ్చు |
| అండలేని వూళ్ళో వుండ దోషం - ఆశలేని పుట్టింట అడగ దోషం |
| అండ వున్నవానిదే అందలం |
| అంత వురిమీ యింతేనా కురిసేది! |
| అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత |
| అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు |
| అంత నీతే వుంటే ఇంత సంతెందుకు? |
| అంత పెద్ద పుస్తకం చంకలో వుంది పంచాంగం చెప్పలేవా? |
| అంతా తెలిసినవాడూ లేడు, ఏమీ తెలియనివాడూ లేడు |
| అంతా బాపలే, మరి కోడిపెట్ట ఏమైనట్లు? |
| అంతా మావాళ్ళేగానీ అన్నానికి రమ్మనే వాళ్ళు లేరు |
| అంత్య నిష్ఠూరం కన్న ఆది నిష్ఠూరం మేలు |
| అందం చందం నావంతు - ముద్దూ మురిపెం నీవంతు అన్నదట |
| అందం చందం లేని మొగుడు మంచం నిండా వున్నట్లు |
| అందని ద్రాక్షపండ్లు పుల్లన |
| అందముంటే సరా! అదృష్టముండొద్దూ! |
| అందని మ్రానిపండ్లకు అఱ్ఱులు చాచినట్లు |
| అందరి కాళ్ళకు మ్రొక్కినా అత్తగారింటికి పోకతప్పదు |
| అందరికీ శకునం చెప్పే బల్లి తాను బోయి కుడితి తొట్లో పడ్డట్లు |
| అందరికీ అన్నం పెట్టే వాడు రైతే |
| అందరికీ నేను లోకువ నాకు నంబి లోకువ |
| అందరినీ మెప్పించడం అలవి గాని పని |
| అందరూ అందల మెక్కేవారే, మోసే వారెవరు? |
| అందరూ ఒక ఎత్తు - అగస్త్యుడు ఒక్కడూ ఒక ఎత్తు |
| అందరూ శ్రీవైష్ణవులే బుట్టెడు రొయ్యలు ఎగిరిపోయినాయ్ |
| అందానికి పెట్టిన సొమ్ము ఆపదకు అడ్డం వస్తుంది |
| అందాల గంధాలు, అధరాల మధువులు కౌగిలింతల పాలన్నట్లు |
| అందాల విందులు, అధరాల మధువులు నీకే అన్నదట |
| అందాలు నావి - సంబరాలు నీవి అందిట |
| అందితే జుట్టు అందకపోతే కాళ్ళు |
| అందితే తియ్యన అందకుంటే పుల్లన |
| అందీ అందని పరువాలు ఉసికొలిపే కాముని కవ్వింతలు |
| అంధునికి అద్దం చూపినట్లు |
| అంబటిలోకి ఉప్పే లేకుంటే పిండి వంటల మీదకు పోయిందట మనసు |
| అంబలా అంటే ముఖాలే చెప్తాయి అన్నట్లు |
| అంబలి త్రాగేవాడికి మీసాలెత్తే వాడొకడా? |
| అంభంలో కుంభం ఆదివారంలో సోమవారం అన్నట్లు |
| "అ - ఆ" లు రావు గానీ అగ్రతాంబూలం కావాలట |
| అకట వికటపు రాజుకు అవివేకపు ప్రధాని, చాదస్తపు పరివారము |
| అక్క ఆరాటమే గానీ బావ బ్రతకడన్నట్లు |
| అక్క కాపురం అడగక్కర లేదు - చెల్లెలి కాపురం చెప్పక్కర లేదు |
| అక్కచెల్లెళ్ళకు అన్నం పెట్టి లెక్క వ్రాసినట్లు |
| అక్క పగ, బావ మంచి |
| అక్క మనదైతే బావ మన వాడవుతాడా? |
| అక్క మొగుడు కుక్క |
| అక్కర వున్నంతవరకూ ఆదినారాయణ - అక్కఱ తీరిన తర్వాత గూదనారాయణ |
| అక్కరకురాని చుట్ట మెందుకు? |
| అక్కరకు వచ్చినవాడే మనవాడు |
| అక్కర తీరితే అల్లుడు అశుద్ధంతో సమానమన్నట్లు |
| అక్కరకు రానిది అవనిలో లేదు |
| అగడ్తలో పడ్డ కప్పకు అదే వైకుంఠం |
| అగసాలిని, వెలయాలిని నమ్మరాదు |
| అగసాలి పొందు, వెలమల చెలిమి నమ్మరాదు |
| అగ్గి చూపితే వెన్న అడక్కుండా కరుగుతుంది |
| అగ్గిమీద గుగ్గిలం లాగా |
| అగ్గువ అయితే అంగడికి వస్తుంది |
| అగ్గువ కొననీయదు ప్రియం అమ్మనీయదు |
| అగ్నికి వాయువు తోడైనట్లు |
| అగ్నిచెంత వెన్న ఎంత తడవాగో ఆడవారి కోపము అంత తడవాగు |
| అగ్నిదేవుడు చలికాలంలో చిన్నవాడు ఎండాకాలంలో ఎదిగినవాడు |
| అగ్నిలో ఆజ్యం పోసినట్లు |
| అగ్నిలో మిడత పడ్డట్లు |
| అగ్నిశేషం, ఋణశేషం, శత్రుశేషం ఉంచరాదు |
| అగ్రహారం పోతే పోయింది గానీ చట్టం మొత్తం తెలిసింది |
| అచ్చట్లు - ముచ్చట్లు - ఎదనిండా వెన్నెల్లు అన్నట్టు |
| అచ్చట్లు, ముచ్చట్లు దుప్పట్ల ముసుగులో అన్నదట |
| అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం అన్నట్లు |
| అచ్చివచ్చిన భూమి అడుగైనా చాలు |
| అచ్చివచ్చే కాలానికి నడిచివచ్చే కొడుకు |
| అచ్చు పోసిన ఆఁబోతువలె |
| అజీర్ణానికి లంఖణం మందు |
| అటైతే కందిపప్పు - యిటైతే పెసరపప్పు |
| అటైతే వైద్యకట్నం - యిటైతే వైతరిణీ గోదానం |
| అట్టే చూస్తే అయ్యవారు కోతిలా కనబడతారు |
| అట్లు వండినమ్మకు ఆరుగురు అమర్చాలి |
| అట్లు వండే అత్తకు అరవైఆరు ఎత్తులు పెట్టినట్లు |
| అడకత్తెరలో పోకచెక్కవలె |
| అడక్కుండా చెప్పులిచ్చాడు అడిగితే గుర్రం యిస్తాడన్నట్లు |
| అడక్కుంటే జోలె అడుక్కుపోతోంది |
| అడగనిదే అమ్మయినా పెట్టదు |
| అడవి ఉసిరికాయకు, సముద్రపు ఉప్పుకు జత కలసినట్లు |
| అడవి పత్రి - వాన నీరు |
| అడవి గాచిన వెన్నెల - ముదిమిన చేసిన పెళ్ళి ఒక్కటే |
| అడవిలో తిని ఆకుతో తుడుచుకున్నట్లు |
| అడిగిందే పాపం - అనుగ్రహించటం తన స్వభావం అన్నట్లు |
| అడిగింది రొట్టె - యిచ్చింది రాయి |
| అడిగితే చిరాకు - అడగకపోతే పరాకు |
| అడిగేటంత అన్యాయానికి లోబడతానా? |
| అడిగేవాడికి చెప్పేవాడు లోకువ |
| అడవిలో పడ్డట్లుగా |
| అడుక్కుతినేవాడికి ఆలయ్యేకంటే ధనవంతుడికి దాసి అయ్యేది మేలు |
| అడుక్కుతినేవాడికి అరవై ఆరు కూరలు |
| అడుక్కుతినేవాడికి అరవై వూళ్ళు |
| అడుక్కోవటానికి ఈ గడప కాకపోతే యింకో గడప |
| అడుగు తప్పితే పిడుగు తప్పుతుంది |
| అడుగు దాటితే అక్కర దాటుతుంది |
| అడుగున ఎరువుకొద్దీ పైన పంట బంగారం |
| అడుగు పెట్టగానే పిడుగు పడ్డట్లు |
| అడుసు త్రొక్కనేల - కాలుకడగనేల? |
| అడ్డాలనాడు బిడ్డలు గానీ గడ్డాలనాడు బిడ్డలా? |
| అడ్డం దిడ్డం తిరిగే తెడ్డుకు రుచేం తెలుసు? |
| అడ్డెడు తినేవాడికి ఆలెందుకు? యిద్దుము మోసేవానికి ఎద్దెందుకు? |
| అడ్డెడు వడ్ల ఆశకు పోతే తూమెడు వడ్లు గొడ్డు తినిపోయిందిట |
| అడ్డేటు మీద గుడ్డేటు |
| అతడెంత ఘనుడైనా అడుగక తప్పదు |
| అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న |
| అత్యాశ నిత్య దరిద్రం |
| అతికించిన కోరమీసం ఎంతసేపు నిలుస్తుంది? |
| అతి చేస్తే మతి చెడుతుంది |
| అతితెలివికి ఆకలెక్కువ |
| అతితెలివికి మగబుద్ధి అన్నట్లు |
| అతిరహస్యం బట్టబయలు |
| అతివినయం ధూర్త లక్షణం |
| అతివృష్టి - అనావృష్టి |
| అతివృష్టయినా అనావృష్టయినా ఆకలిబాధ తప్పదు |
| అతి సర్వత్ర వర్జయేత్ |
| అతి సుకుమారం - కటిక దరిద్రం |
| అతుకుల కాపురం - చితుకుల మంట |
| అతుకుల బొంత - గతుకుల బాట |
| అత్త అడుక్కొని తింటుంటే అల్లునికి మనుగుడుపా? |
| అత్త అప్పుతీరే - అల్లునికి భ్రమతీరే |
| అత్త కాలము కొన్నాళ్ళు - కోడలి కాలము కొన్నాళ్ళు |
| అత్తకు అల్లుడాశ - అల్లుడికి అత్తాశ |
| అత్తకు మంచి లేదు - చింతకు పచ్చి లేదు |
| అత్తకు మొగుడు అల్లుడు |
| అత్తకు లేక చస్తుంటే అల్లుడు వచ్చి దీపావళి పండగన్నాడట |
| అత్త కొట్టిన కుండ అడుగోటికుండ, కోడలు కొట్టిన కుండ క్రొత్తకుండ |
| అత్త చేసిన పనికి ఆరళ్ళు లేవు |
| అత్తను ఉంచుకున్నవాడు ఆయుష్మంతుడు |
| అత్తను కొట్టి అటకెక్కింది - మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కింది |
| అత్త పెట్టే ఆరళ్ళు కనబడతాయిగానీ, కోడలి కొంటె పనులు కనబడవు |
| అత్త పేరు పెట్టి కూతుర్ని కొట్టినట్లు |
| అత్త మంచీలేదు - వేప తీపీలేదు |
| అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు |
| అత్తముండ కన్న ఉత్తముండ మేలు |
| అత్త మెత్తన, కత్తి మెత్తన ఉండవు |
| అత్త రంకుకు పోతూ కోడలికి బుద్ధి చెప్పిందట |
| అత్త లేని కోడలుత్తమురాలు - కోడలు లేనత్త గుణవంతురాలు |
| అత్తవల్ల దొంగతనము, మొగుడి వల్ల రంకుతనం నేర్చుకున్నట్లు |
| అత్తవారింటి అల్లుణ్ణీ ఆముదాల చేలో ఆబోతునూ చూడాలి |
| అత్తవారింటి ఐశ్వర్యంకన్న పుట్టింటి గంజి మేలు |
| అత్తవారింటి లేమి అల్లుడెరుగు |
| అత్తవారింటి సుఖం మోచేతి దెబ్బ వంటిది |
| అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు |
| అత్తా ఒకింటి కోడలే - మామా ఒకింటి అల్లుడే |
| అత్తా! నీ కొంగు తొలిగిందన్నా తప్పే, లేదన్నా తప్పే |
| అత్తింటి కాపురం కత్తి మీద సాములాంటిది |
| అతి తెలివి అరవై రకాలు |
| అతిథి కోసమే తిథులు వున్నట్లు |
| అదును లేని పైరు - ముదిమిలోని బిడ్డ ఒక్కటే |
| అదుగో అంటే ఆరునెలలు |
| అదుగో పులి అంటే యిదిగో తోక అన్నట్లు |
| అదును గాని పదును |
| అదును చూచి పొదలో చల్లినా పండుతుంది |
| అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు వేయాలి |
| అదుపుకురాని ఆలిని, అందిరాని చెప్పును విడవాలి |
| అదుపులేని గుర్రాలు అగడ్తలు దాటుతాయా? |
| అదృష్టం వుంటే పోయిందికూడా చేతికి వస్తుంది |
| అదృష్టం చెప్పిరాదు - దురదృష్టం చెప్పిపోదు |
| అదృష్టం పండితే ఆరు నూరవుతాయి |
| అదృష్టవంతుడ్ని చెరిపేవారూ, దురదృష్టవంతుడ్ని బాగుచేసేవారూ లేరు |
| అద్దం మీద అలిగి ముక్కు కోసుకున్నట్లు |
| అద్దం మీద ఆవగింజ పడ్డట్టు |
| అద్దంలో చూసుకుంటూ అందం అడిగినట్లు |
| అద్దంలోని మూట అందిరాదు |
| అద్దెకు వచ్చిన గుర్రాలు అగడ్తలు దాటుతాయా? |
| అధమునికి భార్య అయ్యేదానికన్నా బలవంతునికి బానిసయ్యేది మేలు |
| అధికారం ఆరుపాళ్ళు - అహంకారం అరవై పాళ్ళు |
| అధికారం బంగారు గొలుసుల పంజరం |
| అధికారాంతమునందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్ |
| అధికారి మూరెడు - బంటు బారెడు |
| అధికాశ లోక దరిద్రం |
| అనంతయ్య చేతిమాత్ర వైకుంఠయాత్ర అన్నట్లు |
| అనగా అనగా రాగం - తినగా తినగా రోగం |
| అని అనిపించుకోవలెనా అత్తగారూ! |
| అనుకున్న పని అంగవస్త్రంలో అయినట్లు |
| అనుభవం ఒకరిది - ఆర్భాటం, ఆయాసం ఇంకొకరివి |
| అనుమానం ప్రాణ సంకటం / అనుమానం పెనుభూతం |
| అనుమానం ముందుపుట్టి ఆడది తర్వాత పుట్టింది |
| అనువు గాని చోట అధికుల మనరాదు |
| అనువుగాని చోట పుండు - అల్లుడి వైద్యం |
| అనూరాధ కార్తెలో అనాధ కర్రయినా ఈనుతుంది |
| అనూరాధకు తడిస్తే మనోరోగాలు పోతాయి |
| అనూరాధలో అడిగినంత పంట |
| అనూరాధలో తడిస్తే ఆడది మగాడౌతుంది |
| అన్నం అరిగిపోతుంది - ఆదరణ శాశ్వతంగా వుంటుంది |
| అన్నం కన్నా ఆదరణ ముఖ్యం |
| అన్నం వుడికిందో లేదో చూడాలంటే అంతా పట్టి చూడక్కరలేదు |
| అన్నం కోసం వచ్చి కంచం కోసం పోట్లాడుకున్నట్లు |
| అన్నం వండని ఆడదీ, మంచం నేయని మగవాడూ వుండడు |
| అన్నం తిన్నవాడూ, తన్నులు తిన్నవాడూ మరచిపోరు |
| అన్నం పెట్టిన చెయ్యిని నరికినట్లు |
| అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు, అప్పచెల్లెళ్ళ పొత్తు పెద్దప్పుడు |
| అన్నదీక్షే కానీ అక్షర దీక్ష లేదు |
| అన్న ద్వేషం, బ్రహ్మ ద్వేషం పనికిరావు |
| అన్నప్రాశన నాడే ఆవకాయా? |
| అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం ఊడిపోయిందట |
| అన్నవారూ, పడినవారూ బాగున్నారు, మధ్యవారు పడిచచ్చారు |
| అన్నానికి పదును తప్పినా - భూమికి అదును తప్పినా పనికిరావు |
| అన్ని కార్తెలు తప్పినా హస్త కార్తె తప్పదు |
| అన్ని దానాలలో అన్నదానం మిన్న |
| అన్ని పైర్లకూ ఆషాఢం |
| అన్ని రోగాలకు వాతలు పెట్టే వైద్యుణ్ణి దూరంగావుంచాలి |
| అన్నీ అమర్చిన తర్వాత అత్తగారు వేలు పెట్టినట్లు |
| అన్నీ అయిన తర్వాత అగ్ని వైద్యం |
| అన్నీ వున్న విస్తరి అణిగి వుంటే ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడిందిట |
| అన్నీ ఉన్నా అయిదవతనం లేదు |
| అన్నీతెలిసినవాడు అమావాస్యనాడు చస్తే ఏమీ తెలియనివాడు ఏకాదశినాడు చచ్చాడు |
| అన్నీ పండించిన రైతుకు అన్నమే కరువు |
| అన్నీ సాగితే రోగమంత సుఖం లేదు |
| అన్యాయపు వూరిలో ఆలూ మగలకే రంకు |
| అన్యాయపు సంపాదన ఆవిరై పోతుంది |
| అపనింద అవతలకిపోతే, నింద వచ్చి తలమీద పడిదట |
| అపుత్రుడికి గతి లేదు |
| అప్పచెల్లెలు బ్రతక గోరితే తోడికోడలు చావు కోరుతుంది |
| అప్ప సిరి చూసుకుని చెల్లెలు మడమలు విరగ త్రొక్కుకుందట |
| అప్పటి కోపం అన్యాయ మెరుగదు |
| అప్ప సంపాదించిన ఆస్థి మనుమడితో మట్టిపాలు |
| అప్పిచ్చే నాకొడుకుంటే దొంగతనం ఎందుకు? |
| అప్పు అదనుకు, ఆకటికీ రాదు |
| అప్పు ఆదా కాదు - వాపు బలుపూ కాదు |
| అప్పు ఆరు తెన్నులు - ముప్పు మూడు తెన్నులు |
| అప్పు యిచ్చి చూడు - పిల్ల నిచ్చి చూడు |
| అప్పు ఇచ్చినవాడు బాగు కోరితే తీసుకున్నవాడు చెడు కోరతాడు |
| అప్పు చేసి కొప్పు తీర్చినట్లు |
| అప్పు చేసి పప్పుకూడు |
| అప్పుడనే మాటను ఆర్నెల్లు ఆగి అనాలి |
| అప్పులున్నవాడి వెంట, చెప్పులున్నవాడి వెంట వెళ్ళరాదు |
| అప్పులెందుకు మిగిలాయిరా అంటే ఎగ్గొట్టటం చేతకాక అన్నాడట |
| అప్పు లేని గంజి గరిటడే చాలు |
| అప్పులేనిదే ఒక సంపద / ఐశ్వర్యం |
| అప్పులేని మనిషి - పిప్పిలేని పగడం ఉంటాయా? |
| అప్పు లేనివాడే అధిక బలుడు / పుణ్యాత్ముడు |
| అబద్ధం అంటే అతుకుల మాట |
| అబద్ధం చెబితే అన్నం పుట్టదు - నిజం చెబితే నీళ్ళు పుట్టవు |
| అబద్ధమాడితే గోడ కట్టినట్లుండాలి |
| అబద్ధానికి అంతు లేదు |
| అబద్ధాల మనిషికి అరవై నాలుగు అసత్య ప్రమాణాలు |
| అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారట |
| అబ్బ నుయ్యి త్రవ్విస్తే అబ్బాయి పూడ్పించినట్లు |
| అబ్బాయి ఆర్భాటం, ఆయాసమే గానీ కడుపు పండేది లేదు |
| అబ్బలేని బిడ్డ - గట్టులేని చేను |
| అబ్బురాన బిడ్డ పుట్టింది - గడ్డపలుగు తేరా చెవులు కుడదాం అన్నట్లు |
| అభాగ్యునికి ఆకలెక్కువ - నిర్భాగ్యునికి నిద్రెక్కువ |
| అభ్యాసం కూసు విద్య |
| అభిరుచులా మస్తు - అంగస్తంభన నాస్తి |
| అమరితే ఆడది - అమరకుంటే గాడిద |
| అమావాస్యకు అట్లు - పున్నానికి బూరెలు |
| అమ్మ కడుపు చూస్తుంది - భార్య జేబు చూస్తుంది |
| అమ్మ కళ గుమ్మంలోనే తెలుస్తుంది |
| అమ్మకు నోటి వాడి - అయ్యకు చెయ్యి వాడి |
| అమ్మ గూటికి - అయ్య కాటికి |
| అమ్మ గృహ ప్రవేశం - అయ్య అగ్ని ప్రవేశం |
| అమ్మ దగ్గర క్రింద పడుకున్నా - అయ్య దగ్గర నేల పడుకున్నా ఒక్కటే |
| అమ్మ తాను పెట్టా పెట్టదు అడుక్కు తినానివ్వదన్నట్లు |
| అమ్మ దీవెన ఆకాశమంత - దేవుడి దీవెన దీపమంత |
| అమ్మన్న అమ్మకు మొగుడు - తిమ్మన్న తల్లికి మొగుడు |
| అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక |
| అమ్మ పుట్టిల్లు - మేనమామ దగ్గరా? |
| అమ్మ పెంచిన బిడ్డా? అయ్య పెంచిన బిడ్డా? |
| అమ్మ పెట్టెవి నాలుగూ పెడితే గానీ కుదరదు |
| అమ్మబోతే అడవి - కొనబోతే కొరివి |
| అమ్మ మంచిదే - తెడ్డే మంచిది కాదు |
| అమ్మవారి మొక్కు, ఆడబిడ్డ అప్పు తీరవు |
| అమ్మా నాన్నా ఆర్భాటమే కానీ నాకు చదువొస్తుందా? |
| అమ్మాయి పరువాలు అబ్బయికి పండుగ అన్నట్లు |
| అమ్మాయి పుట్టిందంటే ఆయువు సగం క్రుంగిందన్నమాటే |
| అయ్యకు రెండు గుణాలే తక్కువ - తనకు తోచదు, చెబితే వినడు |
| అయ్యకు వణుకు ప్రాయం - అమ్మకు కులుకు ప్రాయం |
| అయ్యగారికి ఆరు ఎడ్లు, మూడు దొడ్లు |
| అయ్యగారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా? |
| అయ్య దాసర్లకు పెడితే అమ్మ జంగాలకు పెట్టిందట |
| అయ్య దేశ సంచారం - అమ్మ గ్రామ సంచారం |
| అయ్య వాత పెట్టనూ బర్రె బ్రతుకనూనా? |
| అయ్యవా రంతంత - అయ్యవారి పెళ్ళాం ముంతంత |
| అయ్యవా రటికంత - అయ్యవారి పెళ్ళాం పుటికంత |
| అయ్యవారిని చేయబోతే కోతి అయినట్లు |
| అయ్యవారు తప్పులు చేసి దిద్దుకుంటుంటే, అమ్మగారు పారపోయనూ ఎత్తనూనట |
| అయ్యిందమ్మా పెళ్ళి అణిగిందమ్మా రంధి |
| అయితంపూడి ఉద్యోగం అయితే గియితే, ఆరావుల పాడి చేస్తే గీస్తే పెరుగు, పాలు మా వాళ్ళకి పోస్తావా? మీవాళ్ళకి పోస్తావా? అంటూ పెళ్ళాన్నడిగాడట |
| అయితే అవతల ఒడ్డు లేకపోతే ఇవతల ఒడ్డు |
| అయితే ఆడబిడ్డ లేకపోతే మొగబిడ్డ |
| అయితే ఆదివారం లేకపోతే సోమవారం |
| అయితే అమీరు లేకపోతే ఫకీరు |
| అయిదవతనం లేని అందం అడుక్కు తిననా? |
| అయిదు శిఖలున్నా యిబ్బందిలేదు కానీ మూడుకొప్పులు చేరాయంటే ముదనష్టమే |
| అయినకాడికి జమాబందీ |
| అయినవాణ్ణి అడిగేకంటే కానివాడి కాళ్ళు పట్టుకోవడం మంచిది |
| అయిన పెళ్ళికి మేళాలా? |
| అయినవాడని ఇంటికి రానిస్తే ఇంటి దానికి కన్ను కొట్టాడట |
| అయినవారు లోపలకు తోస్తే కానివారు బయటకు తోస్తారు |
| అయినవాళ్ళకు ఆకుల్లోనూ కానివాళ్ళకి కంచాల్లోనూ |
| అయోమయం అడవి మొద్దు |
| అయ్యోపాపం అంటే ఆరు నెలల పాపం పైన పడ్తుంది |
| అరకాసు పనికి ముప్పాతిక బాడుగ ఖర్చు |
| అరగదీస్తే గంధపు చెక్కకు వాసన పోతుందా? |
| అరగని కూడు - జరగని మాట |
| అరఘడియ భోగం - ఆరు నెలల రోగం |
| అరిచే కుక్క కరవదు |
| అరచేత వెన్న పట్టుకొని నేతి కోసం ఏడ్చినట్లు |
| అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి వరకూ నాకించినట్లు |
| అరచేతిలో వైకుంఠం చూపినట్లు |
| అరచేవాడి పంచన చేరవచ్చు గానీ, నాలిముచ్చు గడప త్రొక్కరాదు |
| అర్ధరాత్రి యుద్ధం ఎక్కడంటే మల్లెల మంచం మీద అన్నదట |
| అరటి కఱ్ఱు - జ్ఞాతి గుఱ్ఱు పోవు |
| అరటికాయ ఆరు నెలల రోగం |
| అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు |
| అరణం కంటే మరణమే మేలు మగాడికి |
| ఆరణ్య రోదనం లాగ |
| అరనిమిషం తీరికలేదు - దమ్మిడీ ఆదా లేదు |
| అరమనిషి సత్తువ - ఆరుగురి కోపం |
| అరవ లేని దేశం - కాకి లేని వూరు లేదు |
| అరవై ఆరు పిండివంటలూ ఆవు చంటిలోనే వున్నాయి |
| అరవై వూళ్ళ అమలుదారు ఆలికి దాసుడు |
| అరవైఏళ్ళునిండినవాని ఆలోచన అడక్కు - ఇరవైఏళ్ళు నిండనివానికి పెత్తనం ఈయకు |
| అరవైఏళ్ళ అన్నంభొట్లు అద్దాన్ని చూచి బిద్దం అంటే వాళ్ళమ్మకు ఆశ్చర్యం వేసిందట |
| అరవై వరహాలిచ్చినా అత్తవంటి బానిస దొరకదు |
| అరిశె ఆరు నెలల రోగం బయట పెడ్తుంది |
| అరిశెల పాకం - అత్త పాకం తెలుసుకు మసలాలి |
| అరుంధతీ, గిరుంధతీ కనపడ్డంలేదు గానీ అప్పు మాత్రం కనబడుతోంది అన్నాడట |
| అరువు సొమ్ము బరువు చేటు |
| అరువుగా యిస్తానంటే ఆరు ఏనుగులు పంపమన్నట్లు |
| అర్ధంకాని మాట - అల్లిబిల్లి మాట |
| అర్ధబలం కంటే - అంగబలం ముఖ్యం |
| అర్ధరాత్రివేళ అంకమ్మ శివాలు |
| అర్ధరాత్రివేళ మద్దెల దరువులు అన్నట్లు |
| అర్జీలకు పనులూ కావు - ఆశీర్వచనాలకు బిడ్డలూ పుట్టరు |
| అలంకారం కంటే అయిదవతనం మేలు |
| అలకపాన్పు మీద అల్లుడలిగితే అత్తగారు కంగారు పడినట్లు |
| అలకాపురం కొల్లగొట్టినా అదృష్టహీనునికి దక్కేదేమీ వుండదు |
| అలలు నిల్చేదెప్పుడు? స్నానం చేసేదెప్పుడు? |
| అలక మీరితే అమృతమైనా విషమే |
| అలికిన యింట ఒలికినా అందమే |
| అలిగే బిడ్డతోనూ - పొడిచే గొడ్డుతోనూ కష్టం |
| అలిగి అత్తవారింటికి - చెడి చెల్లెలింటికి పోరాదు |
| అలుపుల మాటే లేదు గెలుపుల వూసేలేదు రసరాజ్య జాతరలో అన్నట్లు |
| అల్పవిద్యా మహాగర్వీ |
| అల్ప విద్వాంసుడు ఆక్షేపణలకు పెద్ద |
| అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట |
| అల్పుని చేరదీస్తే అధిక ప్రసంగం - కుక్కను చేరదీస్తే మూతి నాకుడు |
| అల్లుడని పేరుపెట్టి పుల్ల విరిచి వేస్తే ఎగిరి పడుతుంది |
| అల్లుడా ఎప్పుడొచ్చావని అడిగితే రాత్రి వండిన గారెల సంగతి చెప్పనా అన్నాడట |
| అల్లుడి కత్తికి రెండు వైపులా పదునే |
| అల్లుడికి చేసినవంట అతిథికి కూడా వచ్చినట్టు |
| అల్లుడికి నెయ్యి లేదు అల్లుని వెంట వచ్చిన వానికి నూనె లేదు |
| అల్లుడికి పెట్టినట్లు కొడుక్కి పెడితే యిల్లు గుల్లవుతుంది |
| అల్లుడి గుణం అనుభవంలో గానీ తెలీదు |
| అల్లుడితో గిల్లుడన్నట్లు |
| అల్లుడితో భోజనం, కొడుకుతో చదువు |
| అల్లుడంటే చాలు - వంకర తాడి కూడా నిఠారుగా నుంచుంటుందట |
| అల్లుడలిగితే కూతుర్ని తీసుకుపోతాడు అంతేగా? |
| అల్లుడికి బెట్టు - యిల్లాలికి గుట్టు వుండాలన్నట్లు |
| అల్లుడు చుట్టమూ గాదు - ఆముదపు చెట్టు చెట్టూకాదు |
| అల్లుడు దశమగ్రహం |
| అల్లుని గుడ్డి తెల్లవారితే తెలుస్తుంది |
| అవలక్షునికి అక్షింతలిస్తే అవతలికెల్లి నోట్లో పోసుకున్నాడట |
| అవతార పురుషుడు అమ్మల్లుడు - అంతకంటే చక్కని వాడు పిన్నల్లుడు |
| అవివేకితో చెలిమికంటే - వివేకితో విరోధం మేలు |
| అవ్వకు ఆవలింతలు నేర్పినట్లు |
| అవ్వను పట్టుకొని వసంతాలాడినట్లు |
| అవ్వా కావాలి - బువ్వా కావాలి |
| అశుద్ధం మీద రాయి వేస్తే ముఖమంతా చిందుతుంది |
| అశ్వత్థ ప్రదక్షిణం చేసి కడుపు తడిమి చూసుకున్నట్లు |
| అశ్వమేధ యాగం చేయవచ్చుగానీ ఆడపిల్ల పెళ్ళి చేయలేం |
| అశ్వని కురిస్తే అంతా నష్టం |
| అశ్వని కురిస్తే ఆరు కార్తెలు విడుపు |
| అష్ట భాగ్యాలున్నా అత్తగారిల్లే - పురిటి కూర తిన్నా పుట్టిల్లే |
| అసత్యం సంపాదించిన పలుకుబడి సత్యం బయటపడే వరకే |
| అసత్యం చెప్పటం పిరికి లక్షణం |
| అసలు కంటే వడ్డీ ముద్దు |
| అసలుకు గతిలేకుంటే కొసరడిగినట్లు |
| అసలు పిసలయ్యే, గొంగళి భారమయ్యె |
| అసలు మూడు పాళ్ళు, వడ్డీ ఆరుపాళ్ళు |
| అసలే అయోమయం అందులో అంధకారం |
| అసలే కోతి, దానికి తోడు కల్లు త్రాగింది ఆ పైన తేలు కుట్టింది |
| అసిమిలో దొకటి, అమ్మేదొకటి |
| అసూయ ముందు - ఆడది వెనకాల |
| ఆఁ అంటే అపరాధం - కోఁ అంటే బూతుమాట |
| ఆఁ అంటే ఆరు నెలలు |
| ఆ యింటికి ఈ ఇల్లెంత దూరమో ఈ యింటికాయిల్లూ అంతే దూరం |
| ఆ యింటికి తలుపూ లేదు, ఈ యింటికి ద్వారబంధమూ లేదు |
| ఆ ఉరుముకు ఈ చినుకులేనా? |
| ఆకతాయి కోరికల ఆకలి కేకలే సోయగాల విహారాలన్నట్లు |
| ఆకలి అవుతోంది అత్తగారూ అంటే రోకలి మింగవే కోడలా అన్నదట |
| అకలి ఆకాశమంత - నోరు సూది బెజ్జమంత |
| ఆకలిగొన్న కరణం పాత కవిలి బయటకు తీసాడట |
| ఆకలిగొన్నమ్మ ఎంగిలికి రోయదు |
| ఆకలి తీరేందుకు అర్ధగంట పోరు చాలు అన్నదట |
| ఆకలి రుచి ఎరుగదు - నిద్ర సుఖ మెరుగదు |
| ఆకలిలేనివానికి అజీర్ణం సంగతి ఏమి తెలుస్తుంది? |
| ఆకారం వుంటే శ్రీకారం ఉండొద్దూ! |
| ఆకారం చూసి ఆశ పడటమేగానీ, 'అందులో' పసలేదు అయ్యకు అందట |
| ఆకారం వికారంగా వున్నా బుద్ధి సూరేకారంగా వుంది |
| ఆకార పుష్టి - నైవేద్యనష్టి |
| ఆకాశమంత ఎత్తు ఎదిగినట్లు |
| ఆకాశమంత గొప్ప అన్నట్లు |
| ఆకాశానికి నిచ్చెనలు వేసినట్లు |
| ఆకు యిస్తే అన్నం పెట్టినంత పుణ్యం |
| ఆకుకు అందక - పోకకు పొందక |
| ఆకు చుట్టను - ఆడదానిని నమ్మరాదు |
| ఆకుతోట సేద్యం అన్ని అవసరాలనూ తీరుస్తుంది |
| ఆకులు ఎత్తరా అంటే విస్తళ్ళు లెక్క పెట్టినట్లు |
| ఆకులు నాకే వాళ్ళింటికి మూతులు నాకే వాళ్ళు వచ్చినట్లు |
| ఆకులో అంతా పెట్టి అంచున పెంట పెట్టినట్లు |
| ఆకూ పోకా అందిస్తే అందాలన్నీ వడ్డిస్తా అందట |
| ఆగభోగాలు - అంకమ్మ శివాలు |
| ఆగభోగాలు అంకమ్మవి, పొలికేకలు పోలేరమ్మవి |
| ఆ గొడ్డు మంచిదయితే ఆ వూళ్ళోనే అమ్ముడయ్యేదిగా |
| ఆచారం అన్నంభొట్లూ అంటే పెద్ద చెరువును కుక్క ముట్టుకుపోయిందన్నాడట |
| ఆచారం ఆరుబారులు - గోచీపాత మూడుబారలు |
| ఆచారం ముందు - అనాచారం వెనుక |
| ఆచారానికి అంతం - అనాచారానికి ఆది లేవు |
| ఆచారాలు నిలుస్తాయి - అర్థాలు పోతాయి |
| ఆటా పాటా మా యింట - మాపటి భోజనం మీ యింట |
| ఆడంగులలో పెదబావ |
| ఆడంబరానికి అంటకత్తెర వేసినట్లు |
| ఆడ చెత్త - మగ బంగారం |
| ఆడదానికి అలుసిస్తే తలకెక్కి కూర్చుంటుంది |
| ఆడదాని కౌగిలి సుఖాల లోగిలి |
| ఆడదానిచేతి అర్థం - మగవాడిచేతి బిడ్డ మనవు |
| ఆడదాని నోటిలో నువ్వు గింజ నానదు |
| ఆడదాని బుద్ధి అపరబుద్ధి |
| ఆడదాని బ్రతుకూ - అరిటాకు బ్రతుకూ ఒక్కటే |
| ఆడదాని మాట ఆపదలకు మూలం |
| ఆడదాని మాట నీటి మూట |
| ఆడదాన్ని చూచినా, అర్థాన్ని చూచినా బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు |
| ఆడది తిరిగి - మగాడు తిరక్క చెడతారు |
| ఆడది అబద్ధమాడితే గోడపెట్టినట్లు, మగాడు అబద్ధమాడితే తడికె పెట్టినట్లు |
| ఆడది లేనిది అడవి - మగాడు లేనిది మఠం |
| ఆడదే అమృతమూ, హాలాహలమూ |
| ఆడదై పుట్టేకంటే అడవిలో మ్రానై పుట్టేది మేలు |
| ఆడపిల్ల పరువాలు సంబరాల జాతరలు అన్నట్లు |
| ఆడపడచు ఉసూరుమంటే ఆరు తరాలు అరిష్టం |
| ఆడపిల్ల పుట్టిందంటే, ఆయువు సగం క్రుంగిందన్నమాటే |
| ఆడపిల్ల పెళ్ళి - అడుగు దొరకని బావి ఒకటే |
| ఆడ పెత్తనం - తంబళ్ళ దొరతనం |
| ఆడ బిడ్డ అర్ధమొగుడు |
| ఆడబిడ్డ కత్తికి ఇరువైపులా పదునే |
| ఆడబోతే చూడబుద్ధి - చూడబోతే ఆడ బుద్ధి |
| ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు |
| ఆడలేక మద్దెల ఓడన్నట్లు |
| ఆడశోకం - మగ రాగం ఒక్కటే |
| ఆడి తప్పితే అపకీర్తి |
| ఆడిది ఆట - పాడింది పాట |
| ఆడది నీతి తప్పిన తర్వాత అంతేమిటి? ఇంతేమిటి? |
| ఆడబుద్ధి కంటే అపర బుద్ధి లేదు |
| ఆడే కాలూ - పాడే నోరూ వూరుకోవు |
| ఆ తండ్రికి కొడుకు కాడా! |
| ఆ తుష్టికీ, ఈ నష్టికీ సరి |
| అత్రగాడు ఒళ్ళో పెట్టనా దళ్ళో పెట్టనా అన్నాట్ట |
| ఆత్రగాడికి బుద్ధి తక్కువ |
| ఆత్రానికి పోతే ఆడపిల్ల పుట్టినట్లు |
| ఆదర్శాలు శిఖరమెక్కితే, అవసరాలు అగాధంలోకి తోస్తాయి |
| ఆదాయంలేని శెట్టి వరదకు పోడు |
| ఆదిలోనే హంసపాదన్నట్లు |
| ఆ పడుగులోనిదే ఈ పీలికా |
| ఆపదకు పాపం లేదు |
| ఆపద మ్రొక్కులు - సంపద మరపులు |
| ఆపదలైనా, సంపదలైనా ఒంటరిగా రావు |
| ఆపదలో అడ్డుపడే వాడే చుట్టము |
| ఆపదలో ఆదుకోవాలి, ఆస్థిలో పంచుకోవాలి |
| ఆమడ నడిచినా ఆరిక కూడు తప్పలేదు |
| ఆమని సోయగాలు అందాలు విందులు అన్నట్లు |
| ఆ మాటా ఈ మాటా యింటి పెద్దకు |
| ఆమాటకూ, ఈ మాటకూ పెద్దకోడలు - ఆచేతి తుడుపుకూ, ఈచేతితుడుపుకూఅడ్డుగోడ |
| ఆముదాల బేరం - కామెర్ల రోగం నమ్మరానివి |
| ఆయ మెరిగి వ్యయం చేయాలి |
| ఆయాసాల మొగుడికి రేసు గుర్రంలాటి భార్య అన్నట్లు |
| ఆయుర్దాయం గట్టిగా వుంటే అడవిలో వున్నా బ్రతకవచ్చు |
| ఆయుర్దాయం వున్న రోగి హస్తవాసి వున్నా వైద్యుడి దగ్గరికే పోతాడు |
| ఆయువు గట్టిదయితే చాలు అన్ని రోగాలు పోతాయి |
| ఆయుష్యం ఆరుపాళ్ళు - యాతన ఏడు పాళ్ళు |
| ఆయుష్షు లేక చచ్చాడు గానీ వైద్యం లేక కాదు |
| ఆయెనమ్మా పెండ్లి - అణిగెనమ్మా రంధి |
| ఆరంభ శూరుడికి ఆర్భాటాలెక్కువ |
| ఆరగించగా లేనిది అడిగితే వచ్చిందా! |
| ఆరాటపు పెళ్ళి కొడుకు పేరంటాళ్ళ వెంట పడ్డాడట |
| ఆరాటమేగానీ పసలేదన్నట్లు |
| ఆరాటాల పెళ్ళాం - ఆయాసాల మొగుడు |
| ఆరికకు చిత్త గండం - ఆడదానికి పిల్ల గండం |
| ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ |
| ఆరు కార్తెలకు పోతు ఆరుద్ర కార్తె |
| ఆరుద్ర కార్తె విత్తనానికీ - అన్నం పెట్టిన యింటికీ చెరుపు లేదు |
| ఆరుద్ర కురిస్తే ఆరు కార్తెలు కురుస్తాయి |
| ఆరుద్ర కురిస్తే దారిద్ర్యం లేదు |
| ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు |
| ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడతాయి |
| ఆరుద్రతో అదను సరి |
| ఆరుద్రలో అడ్డెడు చల్లితే, సులువుగా పుట్టెడు పండుతుంది |
| ఆరుద్ర వాన అదను వాన |
| ఆరుద్రకు ఆమ్లాలు కూడా పండుతాయి |
| ఆరు నెలలకు చచ్చేవాడికి అరుంధతి కనపడదు |
| ఆరునెలల సహవాసం చేస్తే వారు వీరవుతారు |
| ఆరు నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మతో యుద్ధం చేసినట్లు |
| ఆరు రాజ్యాలను జయించవచ్చు కానీ అల్లుడిని జయించలేం |
| ఆర్భాటపు ఆడదానికి ఆరుగురు మొగుళ్ళు |
| ఆర్చేవారే గానీ తీర్చేవారే లేరు |
| ఆరోగ్యమే మహాభాగ్యం |
| ఆలిఅలుక అరవైఏండ్లు, మగనిఅలుక ముప్పై ఏండ్లు, బాలప్రాయం పదేళ్ళు |
| ఆలికి అదుపు - ఇంటికి పొదుపు |
| ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా? |
| ఆలికి లొంగినవాడూ, అరగాణిలో పడినవాడూ ఉక్కిరి బిక్కిరి అవుతాడు |
| ఆలిని అదుపులో పెట్టలేడు గానీ, మందిని అదుపులో పెడతాడట |
| ఆలిని విడిస్తే హరిదాసు - సంసారం విడిస్తే సన్యాసి |
| ఆలి మాట విన్నవాడూ - అడవిలో పడ్డవాడూ ఒక్కడే |
| ఆలి వంక వారు ఆత్మ బంధువులు |
| ఆలి శుచి ఇల్లు చెబుతుంది |
| ఆలి ఏడ్చిన ఇల్లు - ఎద్దు ఏడ్చిన సేద్యం కలసిరావు |
| ఆలి చచ్చిన వారికి ఆలి బంగారం |
| ఆలి బెల్లం - తల్లి విషం |
| ఆలుమగల కలహం అద్దం మీద ఆవగింజ వేసినంతసేపే |
| ఆలుమగల కలహం అన్నం తినేదాకానే |
| ఆలుమగల కలహం కౌగిళ్ళలోకి చేరే వరకే |
| ఆలు లేత - నారుముదురు |
| ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు |
| ఆవగింజంత సందు వుంటే అరవై గారెలు తిననా? అన్నాడట |
| ఆవాలు ముద్ద చేసినట్లు |
| ఆవాహనా లేదు, విసర్జనా లేదు |
| ఆవు చేలో మేస్తే దూడ గట్టుమీద మేస్తుందా? |
| ఆవు తొలి చూలు - గేదె మలిచూలు మంచిది |
| ఆవునిచ్చి పలుపు దాచుకున్నట్లు |
| ఆవును చంపి చెప్పులు దానం చేసినట్లు |
| ఆవు పాడి ఎన్నాళ్ళు? ఐశ్వర్య మెన్నాళ్ళు? |
| ఆవులను మళ్ళించినవాడే అర్జునుడు |
| ఆవులలో ఆబోతై తినాలి - అత్తవారింట అల్లుడై తినాలి |
| ఆవులిస్తే ప్రేగులు లెక్కబెట్టినట్లు |
| ఆవులూ ఆవులూ పోట్లాడుకుంటూ లేగల కాళ్ళు విరగత్రొక్కినట్లు |
| ఆవు లేని యింట అన్నమే తినరాదు |
| ఆవేశం ఆకాశమంత - ఆలోచన ఆవగింజంత |
| ఆశకు అంతు లేదు - గోచీకి దరిద్రం లేదు |
| ఆశకు అంతం లేదు - నిరాశకు చింత లేదు |
| ఆశకు పోతే గోచీ వూడిందట |
| ఆశకు మించిన దూరం - వడ్డీకి మించిన వేగం లేవు |
| ఆశకు ముదిమి - అర్థికి సౌఖ్యం లేవు |
| ఆశ గలమ్మ దోష మెరుగదు - పూటకూళ్ళమ్మ పుణ్య మెరుగదు |
| ఆశ బోధిస్తున్నది - అవమానం బాధిస్తున్నది |
| ఆశబోతు బాపనికి గోచీపాతే సంచి |
| ఆశలు తగ్గించుకుంటే అశాంతికి తావులేదు |
| ఆశ సిగ్గెరుగదు - నిద్ర సుఖ మెదుగదు |
| ఆశ్లేష కురిస్తే ఆరోగ్యమంటారు |
| ఆశ్లేష వర్షం అందరికీ లాభం |
| ఆశ్లేషలో ముసలి ఎద్దు కూడా రంకె వేస్తుంది |
| ఆశ్లేష ముసలి కార్తె - ఆగి ఆగి తుంపర తుంపరగా కురుస్తుంది |
| ఆశ్లేషలో అడుగుకొక చినుకు పడినా అడిగినన్ని వడ్లు |
| ఆశ్లేషలో అడ్డెడు చల్లటం మేలు |
| ఆశ్లేషలో ఊడ్చినట్లయితే అడిగినంత పంట |
| ఆశ్లేషలో తడిస్తే ఆడది మగవాడౌతుంది |
| ఆశ్లేషలో పూస్తే అంతులేని పంట |
| ఆషాఢమాసంలో అరిశెలు వండను ప్రొద్దు వుండదు |
| ఆషాఢానికి ఆకుపోతలు |
| ఆసక్తి మారకం - అనాసక్తి తారకం |
| ఆసనంలో పుండు - అల్లుడి వైద్యం |
| ఆసులో పుల్లలా తిరిగినట్లు |
| ఆస్థికొక కొడుకు - ప్రేమకొక కూతురు |
| ఆహారం పట్ల వ్యవహారం పట్ల మొగమాటం పనికిరాదు |